Friday, January 24, 2020

ఆధునిక భారతదేశ చరిత్ర



🔥ఆధునిక భారతదేశ చరిత్ర🔥



*🔥పోర్చుగీసు🔥*


*🎀భారతదేశాన్ని మొదటిగా సందర్శించిన వారు పోర్చుగల్ రాజు ప్రోత్సాహంతో 1498 మే నెలలో భారతదేశపు పశ్చిమ తీరాన గల కల్లికోట (కాలికట్) వాస్కోడిగామా మొదటిసారి చేరుకున్నాడు.ఆ కాలంలో ఆ ప్రాంతాన్ని జామెరిన్ పాలిస్తున్నాడు.వాస్కోడిగామా కాలికట్లో పోర్చుగల్ వారికోసం కోటను నిర్మించాడు.కాలి కట్, కొచ్చిన్ ,కాంగ్రా నూరు లో వర్తక కేంద్రం స్థాపించాడు*.


*🎀వాస్కోడిగామా అనంతరం ఫ్రాన్సిస్ డి అల్మిడా పోర్చుగీసు ప్రభుత్వం తరపున భారత గవర్నర్ గా నియమించబడ్డాడు .అల్మిడా బ్లూ వాటర్ ఫాలసీ విధానాన్ని అనుసరించాడు* .


*🎀బ్లూ వాటర్ పాలసీ :సముద్రం మీద అధికారాన్ని స్థాపించడం దాంతో భూమిపై దానంతటదే అధికారం స్థిర పడుతుంది.*

*🔥అల్ఫాన్సో- డి- అల్బుకర్క్🔥*


*🎉అల్మిడా మరణాంతరం గవర్నర్ గా నియమించబడ్డాడు. విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు తో స్నేహం చేశాడు. క్రీస్తు శకం 1510 లో బీజాపూర్ సుల్తాన్ యూసుఫ్ అదిల్ సైన్యాలను ఓడించిగోవా తీరాన్ని ఆక్రమించాడు*.




*🎉ఇండియాకి పోర్చుగీసువారు మొదటిసారి పొగాకు పంటలు పరిచయం చేశారు. క్రీస్తుశకం 1542లో గోవాను చర్చి తరఫున సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ సందర్శించాడు.క్రీస్తుశకం 1556 లో చికిత్స ఆధ్వర్యంలో గోవా లో మొదటిసారి ప్రింటింగ్ ప్రెస్ ను ప్రారంభించారు.క్రీస్తుశకం 1661 లో పోర్చుగల్ మహారాణితో ఇంగ్లాండ్ యువరాజు వివాహం సందర్భంగా కట్నంగా బొంబాయి ఇవ్వడం జరిగింది*.


*🎉వాస్కోడిగామా భారత్ ను మూడు సార్లు సందర్శించాడు అతనిని కొచ్చి పోర్టులో ఖననం చేశారు.డయ్యూ, డామన్ ,బేసిన్ ,నాగపట్నం, చిట్టిగాంగ్ మొదలైన చోట్ల పోర్చుగీస్ వారు స్థావరాలు నెలకొల్పారు.క్రీస్తు శకం 1666 ఫిబ్రవరిలో ఔరంగజేబు సేనలు పోర్చుగీసు సేనలను ఓడించి చిట్టిగాంగ్ స్థావరాన్ని ఆక్రమించుకున్నాయి.*


*🔥డచ్చి వారు🔥*


*🔸వీరు హాలెండ్ దేశస్తులు.16వ దశాబ్దంలో భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చిన భర్తకు సంఘాల్లో రెండోవారు క్రీస్తుశకం 1602 లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే వర్తక సంగం నెలకొల్పబడింది*.


*🔸క్రీస్తు శకం 1605 లో మచిలీపట్నంలో తొలిసారి ఫ్యాక్టరీని ఏర్పాటు చేశా.రు ఆ తర్వాత పులికాట్(1610) లో సూరత్( 1616),భీమిలి పట్నం(1641) , కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు.క్రీస్తు శకం 1658 లో పోర్చుగీసు వారి నుంచి డచ్ వారు సింహాళాన్ని ఆక్రమించుకున్నారు.పులికాట్ నుంచి వారి కేంద్రాన్ని క్రీస్తుశకం 1690 లో నాగపట్నానికి మార్చారు.*




*🔥ఆంగ్లేయులు🔥*


*🔹క్రీస్తుశకం 1600 డిసెంబర్ 31న బ్రిటిష్ రాణి ఎలిజబెత్ అనుమతితో ఇంగ్లీష్ ఈస్టిండియా కంపెనీ 70 వేల పౌండ్ల మూలధనంతో అవతరించింది.భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున ఫ్యాక్టరీల స్థాపనకోసం క్రీస్తు శకం 1608 నుంచి ప్రయత్నాలు చేశారు*.


*🔹1611 లో సూరత్లో వ్యాపారం చేసుకోవడానికి మొగలుల నుండి కెప్టెన్ లిటిల్ అనుమతి సంపాదించారు.మొఘల్ చక్రవర్తి జహంగీర్ ద్వారా సర్ జేమ్స్ ధామస్ గుజరాత్లో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి సంపాదించాడు.క్రీస్తుశకం 1639 లో ఆంగ్లేయులు మద్రాసు పట్టణంలో అభివృద్ధి చేశారు*.


*🔹మద్రాసులో సెయింట్ జార్జి కోటను తొలిసారి నిర్మించారు. 1651 లో బ్రీడ్ మెన్ కృషివల్ల వద్ద ఇంగ్లీష్ ఫ్యాక్టరీ నెలకొల్పబడింది.హుగ్లీ నదీ తీరంలో మొగల్ చక్రవర్తి ఔరంగజేబు వద్దనుండి గాబ్రియల్ బౌటన్ అనే బ్రిటిష్ వైద్యుడు బహుమానంగా పొందిన భూమిని బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ కొనుగోలు చేసి క్రీస్తుశకం 1687- 90 మధ్యలో కలకత్తా అనే కొత్త నగరాన్ని నిర్మించింది ఇచ్చట విలియం కోటను నిర్మించారు*.


*🔹క్రీస్తుశకం 1700 లో సమైక్య ఆంగ్లేయ వర్తక వ్యాపార సంఘం గా ఈస్టిండియా కంపెనీ పేరు మారింది.1628 లో రక్తపాత రహిత విప్లవం జరిగింది.*


*🔥ఫ్రెంచి🔥*


*🥀ఐరోపా నుంచి భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చిన వారిలో ఫ్రెంచి వారు చివరి వారు.క్రీస్తుశకం 1664 లో ఫ్రెంచి ఈస్టిండియా కంపెనీ నెలకొల్పబడింది క్రీస్తుశకం 1664 తర్వాత ఫ్రాన్స్ చక్రవర్తి 14వ లూయీ ప్రోత్సాహంతో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో స్థాపనకు కృషి చేసింది* .


*🥀క్రీస్తు శకం 1668 నాటికి సూరత్ 1669 లో మచిలీపట్నంలో 1674 లో పుదుచ్చేరి వద్ద తమ స్థావరాలను నెలకొల్పింది.పాండిచ్చేరి ఫ్రెంచివారి రాజధాని అయినది.భారత్లో సిస్ మార్టిన్ తొలి డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు.ఐరోపాలో 1740లో ప్రారంభమైన ఆస్ట్రేలియా వారసత్వపు వివాదం భారతదేశంలో ఆంగ్ల కంపెనీలకు ప్రత్యక్ష యుద్ధానికి కారణం అయింది.క్రీస్తు శకం 1623లో అంబయాను హత్యాకాండ పేరుతో డచ్ వారు ఆంగ్లేయులను హత్య చేశారు*.

No comments:

Post a Comment