Friday, January 24, 2020

ఆటలు(7అంశాలు)



ఆటలు(7అంశాలు)


1) క్రీడానామ సంవత్సరంగా 2020
2020 క్రీడా నామ సంవత్సరంగా నిలిచిపోనుంది. ఈ ఏడాదిలో 3 వరల్డ్‌కప్‌లు ఫ్యాన్స్‌కు కిక్ ఇవ్వనున్నాయి. U-19 WC, మహిళల, పురుషుల T20 వరల్డ్‌కప్‌లు జరగనున్నాయి. ఇక జులై 24 నుంచి మొదలయ్యే టోక్యో ఒలంపిక్స్‌కు ఫుల్ క్రేజ్ ఉంది. ఈసారి ఎలాగైనా మెడల్స్ సాధించాలని భారత్ వ్యూహాలు రచిస్తోంది. ఇటు రెండేళ్లుగా టెన్నిస్‌కు దూరంగా ఉన్న సానియా రీఎంట్రీ.. ధోనీ, లియాండర్ పేస్ రిటైర్మెంట్‌పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది



2) ఫుట్‌బాల్ ఎప్పుడు ప్రారంభమైంది?
ప్రపంచంలో ఫుట్‌బాల్ ఎక్కువమంది ఆడే, చూసే ఆట
చైనాలో 476 BCలో ప్రారంభమైంది
ఈ ఆటను పలు దేశాల్లో సాకర్‌గా పిలుస్తారు
తొలిసారిగా టీవీలో ప్రత్యక్ష ప్రసారం 1937లో జరిగింది
1913 వరకు టీం సభ్యులు ఒకే రకమైన టీషర్టులు ధరించేవారు కాదు
1999లో జరిగిన బ్యాంకాక్ లీగ్ సెవెన్--సైడ్ ఫుట్‌బాల్‌లో అతి పెద్ద టోర్నమెంట్‌గా నిలిచింది ఈ టోర్నీలో 5098 జట్లు, 35,000 మంది క్రీడాకారులు పాల్గొన్నారు



3) బాస్కెట్‌బాల్‌ను ఎవరు కనిపెట్టారు?
బాస్కెట్‌బాల్‌ను 1891లో జేమ్స్ నైస్మిత్ అనే వ్యక్తి కనిపెట్టాడు.
బాస్కెట్‌బాల్ ఆడేటప్పుడు ఒక ప్లేయర్ పరిగెత్తే దూరం దాదాపు 4 మైళ్లు ఉంటుంది
బాస్కెట్‌బాల్ ఆడే క్రీడాకారుల్లో దాదాపుగా మగవారు(6.3 ఫీట్లు), ఆడవారు(5.7 ఫీట్లు) ఉంటారు
అమెరికాలో విద్యార్థులు ఎక్కువగా బాస్కెట్‌బాల్ ఆడతారు
నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్(NBA)ను ఆగస్టు 5, 1976లో స్థాపించారు



4) పారాగ్లైడింగ్ గురించి ఆసక్తికర విషయాలు
పారాగ్లైడింగ్ అనేది సాహసక్రీడ. ఈ ఆటకు పారాగ్లైడింగ్ అనే పేరును అమెరికా స్పేస్ సెంటర్ నాసా పెట్టింది.
కెనడాకు చెందిన డొమైనా జల్బర్ట్ అనే వ్యక్తి 1952లో పారాగ్లైడింగ్ మీద పేటెంట్ హక్కు పొందాడు.
పారాగ్లైడింగ్ చేసేటప్పుడు వేరియోమీటర్, రేడియో, జీపీఎస్ యూనిట్లు తప్పకుండా ఉండాలి.
అత్యంత ఎత్తులో(8,157 మీటర్లు) పారాగ్లైడింగ్ చేసిన వ్యక్తిగా ఆంటోని జియార్డ్ అనే వ్యక్తి రికార్డు సృష్టించాడు



5) ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ గురించి ఆసక్తికర విషయాలు
ప్రపంచ జనాభాలో 50 శాతం ప్రజలు 2018 ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ మ్యాచ్‌లు వీక్షించారు.
2002 వరల్డ్‌కప్‌ను దక్షిణ కొరియా, జపాన్‌లో నిర్వహించారు. తొలిసారిగా వరల్డ్‌కప్ మ్యాచ్‌లను 2 దేశాల్లో నిర్వహించారు.
మొదటి ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌ను 1930లో ఆడారు. ఇందులో ఆతిథ్య, విజేత జట్టుగా ఉరుగ్వే నిలిచింది.
ఎక్కువ వరల్డ్‌కప్స్ గెలిచిన జట్టుగా బ్రెజిల్(5) నిలిచింది. ఆ తర్వాత స్థానంలో జర్మనీ(4) ఉంది.



6) తొలి టెస్టు హ్యాట్రిక్ వీరుడు ఫ్రెడ్ స్పాఫోర్త్
టెస్టు క్రికెట్‌లో తొలి హ్యాట్రిక్ నమోదయ్యింది ఈ రోజే. 1879 జనవరి 2న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ ఫ్రెడ్ స్పాఫోర్త్ తొలిసారి హ్యాట్రిక్ నమోదు చేశాడు. మెల్‌బోర్న్‌లో జరిగిన మ్యాచ్‌లో వెర్నోన్ రాయల్, ఫ్రాన్సిస్ మెక్‌నోన్, టామ్ ఎమెంట్‌‌లను వరుస బంతుల్లో పెవీలియన్‌కు పంపి చరిత్ర సృష్టించాడు. 1879 నుంచి ఇప్పటి వరకు టెస్టు క్రికెట్‌లో 44 హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి.


7) వన్డేల్లో తొలి సెంచరీ ఎవరు చేశారు?
వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో మొదటి సెంచరీ చేసిన క్రికెటర్‌గా ఇంగ్లాండ్‌కు చెందిన డెన్నిస్ ఎమిస్ నిలిచాడు. 1972లో ఇంగ్లాండ్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో ఆస్ట్రేలియా మీద డెన్నిస్ 103 పరుగులు చేశాడు. అతడు ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేయడం విశేషం. కాగా డెన్నిస్ ఇంగ్లాండ్ తరఫున 50 టెస్టుల్లో 3,612 పరుగులు, 18 వన్డేల్లో 859 పరుగులు చేశాడు. ఇందులో టెస్టుల్లో 11, వన్డేల్లో 4 సెంచరీలు ఉన్నాయి.

No comments:

Post a Comment