Friday, January 24, 2020

గోదావరి

🔥గోదావరి🔥



*💐ద్వీపకల్ప నదుల లో కెల్లా అతి పెద్ద నది గోదావరి. గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని త్రయంబకం వద్ద జన్మించి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ,ఆంధ్ర ప్రదేశ్ లో గుండా 1465 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.గోదావరి నది దక్షిణ గంగా, వృద్ధ గంగా అని కూడా పిలువబడుతుంది.గోదావరి నదికి కుడి వైపున మంజీరా, ప్రవరా, మూల, కిన్నెరసాని ఎడమవైపున ప్రాణహిత, వైన్గంగ, ఇంద్రావతి, శబరి, సీలేరు ఉపనదులు కలవు .భారతదేశంలోని అతి పెద్ద నదులలో గంగానది తరువాత అతి పెద్ద నది గోదావరి నది*.




*💐గోదావరి నది ఆదిలాబాదు జిల్లాలోని బాసర వద్ద తెలంగాణలో ప్రవేశించి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం జిల్లాల గుండా ప్రయాణిస్తూ ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలో ప్రవేశించి తూర్పుగోదావరి జిల్లాలో ఏడు పాయలుగా (గౌతమి, వశిష్ఠ ,వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ ,ఆత్రేయ, కౌశిక )చీలీ బంగాళాఖాతంలో కలుస్తుంది.గౌతమి వశిష్ఠ వైనతేయ శాఖల మధ్య గల ప్రాంతాన్ని కోనసీమ అంటారు*.


*💐గోదావరి నదిపై పోలవరం వద్ద గార్జును ఏర్పరుస్తుంది.ఈ నదికి అంతర్వేది సమీపంలో నది వంకలు ,ఆక్స్ బౌ సరస్సులు ఉన్నాయి.ఈ నదిని కవుల నది అని కూడా అంటారు.గోదావరి నది మొత్తం పరివాహక ప్రాంతం 3,12,812 చదరపు కిలోమీటర్లు. ఇందులో 49% మహారాష్ట్రలో, 20% మధ్యప్రదేశ్లో, 23 శాతం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోనూ, 6 శాతం ఒరిస్సా లోను ,2 శాతం కర్ణాటకలోనూ ఉంది*.


*💐గోదావరి మహా పుష్కర లో 2015 జూలై 14 నుంచి 20 వరకు ఘనంగా జరిగాయి*

No comments:

Post a Comment