Friday, January 24, 2020

🔥భారత పౌరసత్వం🔥

పూర్తి విశ్లేషణ 

 

 🔥భారత పౌరసత్వం🔥



*♦ఇప్పుడు దేశం మొత్తం మీద జరుగుతున్న చర్చ ఒకటే అంశం మీద అదే CAB and NRC.. ఎంతలా అంటే దేశం మొత్తం ప్రజలు, ప్రతిపక్షాలు రెండుగా విడిపోయి ముస్లిం vs హిందూగా మార్చి అల్లకల్లోలం రేపుతున్నారు.. అసలు పౌరసత్వ చట్టానికి సవరణ ఎందుకు తీసుకు రావలసి వచ్చింది అనే తెలుసుకునె ముందు విదేశీయులకు భారత పౌరసత్వం ఎలా ఇస్తారు తెలుసుకోవడం అవసరం..*


*🌎ప్రపంచంలోని ప్రతిదేశం ఆ దేశ పౌరసత్వం ఎలా ఇవ్వాలి అనే దానిపై చట్టాలు రూపొందించుకుని ఆయా చట్టాల లోని నియమ నిబంధనల ప్రకారమే పౌరసత్వం కల్పిస్తాయి. భారతదేశం మొట్ట మొదటిసారి Indian Citizenship Act, 1955 అని పౌరసత్వ చట్టాన్ని 1955లో ఆమోదించింది.. దీనికి గతంలో 1986, 1992, 2003, 2005, 2015 లో సవరణలు చేశారు ఇప్పుడు తాజాగా 2019లో మరి ఒకసారి Citizenship Amendment Bill, 2019 పేరుతో తాజా సవరణ చేశారు.*


*🇮🇳భారత పౌరసత్వ చట్టం ప్రకారం నవంబర్ 26, 1949 నాటికి భారతదేశంలో నివాసం ఉంటున్న వ్యక్తి ఆటోమాటిక్ గా భారత పౌరుడు అవుతాడు.*


*🇮🇳భారత జాతీయతా చట్టం ముఖ్యంగా citizenship by right of birth within the territory బదులుగా citizenship by right of blood ను అనుసరిస్తుంది..*


*♦పుట్టుకతో పౌరసత్వం:♦*


*🔅జనవరి 26, 1950 నుండి జూలై 1, 1987 మధ్యలో భారతదేశంలో జన్మించిన వ్యక్తులు, తల్లిదండ్రులలో కనీసం ఒకరు భారత పౌరులు అయి ఉండి జూలై 1, 1987 నుండి డిసెంబర్ 3, 2004 మధ్యలో జన్మించిన వ్యక్తులు, డిసెంబర్ 3, 2004 తరువాత భారత్ లో జన్మించిన వ్యక్తుల తల్లిదండ్రులు ఇద్దరు ఖచ్చితంగా భారత పౌరులు అయి ఉన్న వ్యక్తులకు జన్మతః భారత పౌరులు అవుతారు..*


*♦భారత సంతతికి పౌరసత్వం:♦*


*🔅జనవరి 26, 1950 నుండి డిసెంబర్ 10, 1992 మధ్య కాలంలో భారత దేశానికి వెలుపల జన్మించిన వ్యక్తి యొక్క తండ్రి ఆ కాలంలో భారత పౌరసత్వం కలిగి ఉన్నట్లయితే ఆ జన్మించిన సంతానానికి భారత పౌరసత్వం లభిస్తుంది.. డిసెంబర్ 10, 1992 తర్వాత భారతదేశం వెలుపల జన్మించిన వ్యక్తి తల్లిదండ్రులలో ఎవరో ఒకరు భారత పౌరులు అయి ఉన్నట్లయితే కూడా భారత సంతతి కింద పౌరసత్వం లభిస్తుంది.. కాని డిసెంబర్ 3, 2004 తర్వాత భారత్ వెలుపల జన్మించిన వ్యక్తులు పుట్టిన తేదీ నుండి ఒక సంవత్సరం లోపు భారత దౌత్య కార్యాలయంలో నమోదు చేసుకుంటే తప్ప భారత పౌరసత్వం లభించదు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఒక సంవత్సరం తర్వాత కూడా భారత దౌత్య కార్యాలయంలో పౌరసత్వ నమోదు చేసుకునే అవకాశం ఉంది కానీ ఆ వ్యక్తి మరే ఇతర దేశానికి చెందిన పాస్పోర్ట్ కలిగి లేడు అని తల్లిదండ్రులు ఇద్దరు అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది.*


*🔅నమోదు ద్వారా పౌరసత్వం:🔅*


*👉భారత పౌరసత్వ చట్టం, 1955 లోని సెక్షన్ 5 కింద కేంద్ర ప్రభుత్వం వద్ద భారత పౌరసత్వం కోసం, ఒక వ్యక్తి ఈ క్రింది వర్గాలలో దేనికైనా చెంది ఉంటే నమోదు చేసుకోవచ్చు (అక్రమ వలసదారుడు కాని వారు మాత్రమే)*


*🔅భారతీయ మూలాలు కలిగి గత ఏడు సంవత్సరాలుగా భారత దేశంలో నివాసం ఉంటున్న వ్యక్తి సెక్షన్ 5(1) ప్రకారం పౌరసత్వ నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు..(దరఖాస్తుకు ముందు తప్పనిసరిగా 12 నెలల కాలం నిరవధికంగా, గత ఏనిమిది సంవత్సరాల కాలంలో ఆరు సంవత్సరాలు భారతదేశంలో నివాసం ఉండాలి)*


*🔅భారత సంతతికి చెంది, అవిభక్త భారతదేశం వెలుపల ఏ దేశంలో లేదా ప్రదేశంలో నివసిస్తున్న వ్యక్తి.*


*🔅భారత పౌరుడిని వివాహం చేసుకుని భారత పౌరసత్వ నమోదు కోసం దరఖాస్తు చేయడానికి ముందు ఏడు సంవత్సరాలు సాధారణంగా భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తి*


*🔅తల్లిదండ్రులలో కనీసం ఒకరు భారత పౌరులు అయి, గతంలో భారత పౌరసత్వం కలిగివుండిన వ్యక్తి గత సంవత్సర కాలంగా భారత దేశంలో నివాసం ఉంటున్న వ్యక్తి.*


*👉ఐదేళ్లపాటు భారతదేశపు విదేశీ పౌరుడిగా నమోదు చేసుకుని, భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేయడానికి ముందు ఒక సంవత్సరం భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తి. అలాగే భారత పౌరసత్వం కోసం నమోదు చేసుకున్న వారి సంతానం కూడా భారత పౌరసత్వం నమోదు చేసుకోవడం ద్వారా పొందవచ్చు.*


*సహజత్వం ద్వారా పౌరసత్వం:*


*♦గత 12 సంవత్సరాలుగా భారతదేశంలో సాధారణంగా నివసిస్తున్న ఒక విదేశీయుడు సహజత్వం ద్వారా భారత పౌరసత్వం పొందడానికి అర్హుడు అవుతాడు. ఇందులో దరఖాస్తు తేదీకి ముందు 12 నెలల కాలం మరియు ఆ 12 నెలల ముందు 14 సంవత్సరాల వ్యవధిలో 11 సంవత్సరాలు భారతదేశంలో నివాసం ఉండాలి. ఇవన్నీ కూడా భారత పౌరసత్వ చట్టం, 1955 లోని సెక్షన్ 6(1)కు లోబడి ఉంటాయి.*


*👉భారత పౌరసత్వం కొరకు పై నిబంధనలు ఇప్పటివరకు ఉన్నవి.. ఇప్పుడు ఈ చట్టంలోని సహజత్వం ద్వారా పౌరసత్వం అనే నిబంధనకు సవరణ కొరకు తీసుకు వచ్చిన బిల్లే CAB ఇంత గొడవకు కారణం.. ఈ బిల్లు ఆల్రెడీ పార్లమెంట్ ఉభయసభల్లో పాసై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు గనుక ఇక మీదట దీనిని CAA (Citizenship Amendment Act, 2019) గా పిలుద్ధాం.*


*👉భారతదేశానికి పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో మైనారిటీలు అనే కారణంతో మతపరమైన దాడులు, హింస ఎదుర్కుని భారతదేశానికి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు మరియు క్రైస్తవులకు భారత పౌరసత్వం ఇవ్వడానికి ఉద్దేశించి చేసినదే ఈ పౌరసత్వ సవరణ చట్టం, 2019.*


*👉పౌరసత్వ సవరణ చట్టం, 2019 ముఖ్యంగా వీరికి రెండు వెసులుబాట్లు ఇచ్చింది. అవేమిటంటే..*


*1) సరిఅయిన పత్రాలు లేకుండా భారతదేశానికి వచ్చి, నిర్ధారిత సమయం తర్వాత కూడా ఇక్కడే తలదాచుకున్న వారందరినీ పౌరసత్వ చట్టం, 1955 ప్రకారం అక్రమ వలసదారులుగా (illegal immigrants) గా గుర్తించే వారు. ఇప్పుడు వారిని అలా గుర్తించరు..


2) సహజత్వం ద్వారా పౌరసత్వం పొందడానికి ఒక విదేశీయుడు గతంలో 11 సంవత్సరాలు భారతదేశంలో నివాసం ఉండాలి అనే నిబంధనను 5 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది అని సడలించింది.
అందుకే డిసెంబర్ 31, 2014 న లేదా అంతకు ముందు భారతదేశం లోకి ప్రవేశించిన వారికి మాత్రమే వర్తిస్తుంది అనే నిబంధన చేర్చడం జరిగింది.
ఆ తేదీ తర్వాత వచ్చిన వారు మతానికి సంబంధం లేకుండా అక్రమ వలసదారులుగానే గుర్తించబడతారు..*


*👉మరి ఇలా వచ్చినవారు ఏన్నో లక్షల మంది ఉన్నారు అని భ్రమ పడవద్దు.. ఈ చట్టంలో పేర్కొన్న పాక్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ దేశాల నుండి డిసెంబర్ 31, 2014 లోపు భారతదేశానికి వచ్చిన వారి సంఖ్య కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 31,313 మంది మాత్రమేనని అంచనా.. ఇందులో హిందువులు 25,447 మంది, సిక్కులు 5807 మంది, క్రైస్తవులు 56 మంది కాగా, బౌద్ధులు, పార్సీ లు ఇద్దరు చొప్పున ఉన్నారు.*


*👉ఈ పౌరసత్వ సవరణ చట్టంలో ముస్లింలను చేర్చకపోవడం ఇంత వివాదానికి కారణం. అసలు ఈ సవరణ చట్టం తెచ్చింది ఆ మూడు దేశాలలో మెజారిటీ మతం అయిన ముస్లింల నుండి మత పరమైన వివక్ష, హింస ఎదుర్కొన్న మైనారిటీలను ఆదుకోవడానికి అయితే ముస్లింలకు ఎలా చోటు కల్పిస్తారు? అందువల్ల ఆయా దేశాల ముస్లింలు ఈ చట్టంలో మినహాయించబడ్డారు. ఒకవేళ ముస్లింలను కూడా చేర్చే పక్షంలో ఈ సవరణ చట్టమే అవసరం లేదు.*


*👉మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ సవరణ బిల్లు పౌరసత్వ చట్టం, 1955 లోని సెక్షన్ 6 లో గల సహజత్వం ద్వారా పౌరసత్వంను మాత్రమే సవరించింది.. సెక్షన్ 6A ని కాదు.. ఈ సెక్షన్ 6A జనవరి 1, 1966 నుండి మార్చి 25, 1971 వరకు అస్సాం రాష్ట్రంలో ప్రవేశించిన అక్రమ వలసదారుల ను డీల్ చేస్తుంది.. సరిగ్గా చెప్పాలంటే ఇండో - చైనా యుధ్ధం ముగిసిన సమయం నుండి బంగ్లాదేశ్ విమోచన యుధ్ధం మొదలయ్యే సమయం వరకు.
కనుక అస్సామ్ రాష్ట్రాల ప్రజలు ఈ చట్టం గురించి భయపడటం అనవసరం. ఇది కేవలం అపోహల వల్ల లేదా కొంత మంది కావాలని సృష్టించినది కావచ్చు.*


*👉కొందరు మేధావులు ఈ పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21 లను ఉల్లఘిస్తుంది అని అంటున్నారు..*


*👉సరే ఆర్టికల్ 14 ఏమంటుందంటే.. "The State shall not deny to any person equality before the law or the equal protection of the laws within the territory of India." అంటే ఏ వ్యక్తికైనా చట్టం ముందు సమానత్వం లేదా భారత భూభాగంలో చట్టాల సమాన రక్షణను కల్పించడంలో రాజ్యం యెటువంటి వివక్షా చూపకూడదు.*


*👉అయితే ఇక్కడ పౌరసత్వ సవరణ చట్టం మూడు దేశాలలో మతపరమైన హింసను ఎదుర్కొన్న మైనారిటీలకు సహజత్వం ద్వారా పౌరసత్వం ఇవ్వాలని ఉద్దేశించినది.. దీని అర్థం ఇతరులకు ఈ పద్దతి ద్వారా పౌరసత్వం ఇవ్వరు అని కాదు.. ఇతరులు సహజత్వం ద్వారా పౌరసత్వం పొందాలి అనుకుంటే ఆ యొక్క సెక్షన్ నియమాలు అనుసరించి పొందవచ్చు.. అందువల్ల ఇది ఆర్టికల్ 14 ఉల్లంఘించడం లేదు అని చెప్పవచ్చు.*


*👉రాజ్యాంగం లోని ఆర్టికల్ 15 ప్రకారం ఒక వ్యక్తి పై అతని మతం, జాతీ, కులం, లింగం మరియు ప్రాంతం ఆధారంగా యెటువంటి వివక్షా చూపరాదు. Prohibits discrimination of Indians on basis of religion, race, caste, sex or place of birth.*


*👉నాకు తెలిసినంత వరకు ఇది భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. ఇతర దేశాల ప్రజలకు కాదు. సహజత్వం ద్వారా పౌరసత్వం పొందిన తర్వాత ఒక వ్యక్తి భారతీయ పౌరుడుగా మారుతాడు.. అంతకు ముందు కాదు.. అందువల్ల ఆర్టికల్ ఉల్లంఘన ప్రశ్నే తలెత్తదు.*


*♦ఆర్టికల్ 21 ఏమంటుంది అంటే "No person shall be deprived of his life or personal liberty except according to a procedure established by law.” అంటే చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన ఒక విధానం ప్రకారం తప్ప ఏ వ్యక్తి అయినా తన జీవితం లేదా వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోకూడదు.*


*♦రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు,వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు అనేది భారతదేశంలో నివసించే వారికి వర్తిస్తుంది కాని భారతదేశంలోకి ప్రవేశించాలి అని అనుకునే వారికి కాదు..*


ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భారత రాజ్యాంగం భారతీయుల కోసం రాసినది.. విదేశీయుల కోసం వ్రాసింది కాదు.. వాళ్ళు భారత పౌరసత్వం పొందిన తర్వాతనే రాజ్యాంగం కల్పించిన హక్కులను పొందేందుకు అర్హత పొందుతారు.




ఇప్పుడు కొన్ని ప్రశ్నలు సమాధానాలు చూద్దాం.. ____________________________________________
1) CAA మరియు NRC భారతీయ ముస్లింలకు వ్యతిరేకమా?


: ఎంత మాత్రం కాదు.. భారతీయ ముస్లింలకు ఈ చట్టానికి యెటువంటి సంబంధం లేదు. ఈ పౌరసత్వ సవరణ చట్టం కేవలం పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో మతపరమైన హింసను, వివక్షను ఎదుర్కొన్న వారికి భారత పౌరసత్వం ఇచ్చేందుకు తెచ్చిన ఒక ఉపశమన చట్టం అది కూడా ఈ ఒక్కసారికే వర్తిస్తుంది.


2) దేశ విభజన సమయంలో పాకిస్తాన్ ను కాదని భారతదేశాన్ని మాతృభూమి గా ఎంచుకున్న ముస్లింలు ఇప్పుడు ఈ దేశంలో రెండవ శ్రేణి పౌరులా?


: దేశ విభజన సమయం నుండి భారతదేశంలో ఉన్న అన్ని కులమతాలకు చెందిన వాళ్ళు భారతదేశ పౌరులే అవుతారు.. కొందరి పౌరసత్వం, ఓటు హక్కు రద్దు చేయబడుతుంది అనేది కేవలం అపోహ మాత్రమే.


3) పాకిస్తాన్ లో ఉన్న ఆహ్మదీయులు, షియాలను ఈ జాబితాలో ఎందుకు చేర్చలేదు?


: వారు అక్కడ హింస లేదా వివక్ష ఎదుర్కొంటే అది మతపరమైనది కాదు.. అందుకు ఇతర కారణాలు ఉండవచ్చు. ఎందుకంటే ఆహ్మదీయులు, షియాలు ఇస్లాం లో ఒక భాగమే తప్ప వేరు కాదు


4) మత ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వడం ఏమిటి?


: ఇక్కడ పౌరసత్వం మతప్రాతిపదికన ఇవ్వడం లేదు.. మతం పేరిట వేధింపులకు గురై ప్రాణభయంతో వచ్చినవారికి పౌరసత్వం ఇస్తున్నారు.. రెండింటికి తేడా ఉంది.


*5) మరి శ్రీలంక నుండి శరణార్థులుగా వచ్చిన తమిళులను ఇందులో ఎందుకు చేర్చలేదు?


*: శ్రీలంక నుండి తమిళ శరణార్ధులు వచ్చిన కారణం అక్కడ జరిగిన సింహళ-తమిళ జాతుల మధ్య జరిగిన పోరాటం వల్లనే కానీ అక్కడ హిందువుల మధ్య బౌధ్ధుల మధ్య జరిగిన హింస కాదు. శ్రీలంక నుండి శరణార్ధులుగా వచ్చిన తమిళులకు భారతీయ పౌరసత్వం ఇవ్వడానికీ ఈ సవరణ చట్టానికి సంబంధం లేదు. వాళ్ళు భారత పౌరసత్వం కోసం Indian Citizenship Act, 1955 సెక్షన్ 5 ప్రకారం దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం వారికి పౌరసత్వం ఇస్తారు. ఇది అన్ని మతాల వారికి, జాతుల వారికి వర్తిస్తుంది. పాకిస్థాన్ నుండి వలస వచ్చే ముస్లిమ్స్ కూడా సెక్షన్ 5 క్రింద పౌరసత్వానికి నమోదు చేసుకోవచ్చు.*


*👉చివరిగా నా మాట..*


*🔅అక్రమవలసదారుల పట్ల మన దేశానికి ఒక నిర్ధిష్టమైన విధానం ఎంతో అవసరం. మనకంటే చిన్న చిన్న దేశాలకు స్పష్టమైన విధానం, వైఖరి ఉన్నాయి.*
*🔅మీరు అక్రమంగా ఇతర దేశాలలో ప్రవేశించి స్వేచ్చగా తిరగగలరా ఊహించండి.. భారతీయులను ఆకర్షిస్తున్న అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు వలసదారుల విద్యా, ఉద్యోగ అనుభవం, ఆంగ్ల భాషా నైపుణ్యం, background verification, ఆరోగ్య పరీక్షలు వంటి వాటికి పాయింట్స్ ఇచ్చి ఆయా దేశాలకు వెళ్ళడానికి వీసాలు ఇస్తున్నాయి అని గుర్తుంచుకోండి. మోస్ట్ క్వాలిఫైడ్ పీపుల్ మాత్రమే ఈ దేశాల్లో స్థిర పడడానికి వెళ్తున్నారు.. చదువు సంధ్యా లేని అనామకులు కారు.. చట్టబద్దంగా విదేశాలకు పోతున్న భారతీయుల్ని, చట్ట వ్యతిరేకంగా మనదేశంలోకి చొరబడుతున్న ఇతర దేశీయుల్ని ఒకే గాటన కట్టడం మూర్ఖత్వం..ఇది తెలుసుకోవడానికి పెద్దపెద్ద చదువులు చదవాల్సిన అవసరం కూడా లేదు.. కామన్స్ సెన్స్ చాలు...*

No comments:

Post a Comment