Thursday, January 23, 2020

19వ శతాబ్ది సాంఘిక ,మత సంస్కరణోద్యమాలు

19వ శతాబ్ది సాంఘిక ,మత సంస్కరణోద్యమాలు


*🔹భారతీయ సంస్కృతి అధ్యయనం కొరకు కలకత్తాలో సర్ విలియం జోన్స్చే క్రీస్తుశకం 1784లో ఏసియాటిక్సొసైటీని స్థాపించారు. సంస్కృత భాష అధ్యయనం కొరకు వారణాసిలో సంస్కృత కళాశాలను జోనాథన్ డంకన్ స్థాపించారు.రాజా రామ్మోహన్ రాయ్ సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఆద్యుడు.ఆధునిక భారతదేశానికి పితామహుడు*.


*🔹క్రీస్తుశకం 1815 లో రాజా రామ్మోహన్ రాయ్ కలకత్తా లో ఆత్మీయ సభ స్థాపించబడింది రామ్మోహన్ రాయ్ రాజా అనే బిరుదును మొగల్ చక్రవర్తి అక్బర్ 2 ఇచ్చాడు.జీసస్ బోధలు ,శాంతి సంతోషాలకు మార్గం ఏకేశ్వరోపాసక లకు కానుకగా పర్షియన్ అనే గ్రంథాలను రచించాడు*.


*🔹సంవాద కౌముది మరియు బంగదూత అనే పత్రికలో బెంగాలీ భాషలో నిర్వహించాడు .1828 లో బ్రహ్మసమాజం లో స్థాపించాడు క్రీస్తుశకం 1833లో బ్రిస్టన్ నగరంలో రాజా రామ్మోహన్ రాయ్ మరణించాడు. క్రీస్తుశకం 1824లో హెన్రీ వివిన్ ఆధ్వర్యంలో బెంగాల్ ఉద్యమం ప్రారంభించబడింది*.


*🔹రాజా రామ్మోహన్ రాయ్ అనంతరం బ్రహ్మ సమాజంలో దేవేంద్రనాథ్ ఠాగూర్ నిర్వహించాడు బ్రహ్మధర్మం అనే గ్రంథాన్ని రాశాడు.దేవేంద్రనాథ్ ఠాగూర్ ఆధ్వర్యంలో ఆది బ్రహ్మసమాజం నిర్వహించబడింది 1866లో భారతీయ బ్రహ్మసమాజ్ కేశవ చంద్ర సేన్ నాయకత్వంలో ఏర్పడింది.1870లో కేశవ చంద్రసేన్ భారతీయ సంస్కారణల సంఘం స్థాపించాడు*.


*🔹సివిల్ మారేజ్ చట్టం గా పేరొందిన ఈ దేశీయుల వివాహ చట్టం 1872 ఈ చట్టం ప్రకారం వివాహ వయస్సు బాలురు కు 18 సంవత్సరాలు బాలికలకు 14 సంవత్సరాలుగా నిర్ణయించారు 1878 మే 15 శివనాథ్ శాస్త్రి, ఆనందమోహన్ సాధారణ బ్రహ్మసమాజం నెలకొల్పారు .1975 ఏప్రిల్ 15న దయానంద సరస్వతి ఆర్య సమాజం స్థాపించాడు దయానంద సరస్వతి అసలు పేరు మూల శంకర్.*


*🔹1863 జనవరి 12న కలకత్తాలో జన్మించిన వివేకానందుని అసలు పేరు నరేంద్రనాథ్ దత్ 1887లో వివేకానందుడు రామకృష్ణ మఠం బేలూరు లో స్థాపించారు. 1893లో అమెరికాలో సర్వమత సమ్మేళనంలో ప్రసంగించాడు వివేకానందుడు.వివేకానందుడు ఆంగ్లంలో ప్రబుద్ధ భారత బెంగాలీలో ఉద్బోధ అనే పత్రిక ప్రచురణను ప్రారంభించాడు*.


*🔹నా గురువు రాజయోగా కర్మయోగ భక్తి యోగ అనే గ్రంథాలను వ్యాఖ్యాత గ్రంథాలను వెలువరించాడు.వివేకానందుడు కలకత్తాలో 1902 జూలై 4 న మరణించాడు.1857లో దివ్యజ్ఞాన సమాజం న్యూయార్క్ నగరంలో శ్రీమతి బ్లావట్రి కర్నల్ ఆల్ కాట్లు స్థాపించారు.1879లో వీరు భారతదేశం మద్రాసులోని అడయారు లో దివ్యజ్ఞాన సమాజం నెలకొల్పారు*.


*🔹1886లో అనీబిసెంట్ లండన్లోని దివ్యజ్ఞాన సమాజం లో చేరింది అనిబిసెంట్ ఆధ్వర్యంలో న్యూ ఇండియా కామన్ విల్ అనే వార పత్రికను ప్రారంభించింది 1917 లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి తొలిసారి మహిళా అధ్యక్షురాలిగా వ్యవహరించింది.1865లో దియో బందు వద్ద ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు మహమ్మద్ ఖాసిం.అహ్మదీయ ఉద్యమం లేదా ఖదయాని ఉద్యమమును పంజాబులో మీర్జా గులాబ్ అహ్మద్ ప్రారంభించారు*.

             ఈ-మెయిల్ ద్వారా SUBSCRIBE చేసి బ్లాగ్ ను FOLLOW అవ్వగలరు
        మీ ప్రోత్సాహం ఉంటె మంచి USEFUL UPDATES తో బ్లాగ్ ని రన్ చెయ్యగలను 

                                                     ధన్యవాదములు

No comments:

Post a Comment