Monday, February 17, 2020

ఆంధ్రప్రదేశ్ అవతరణ గూర్చి

ఆంధ్రప్రదేశ్ అవతరణ గూర్చి


*★ ఆంధ్రప్రదేశ్, భారతదేశంలోని 28 రాష్ట్రాల లో ఒకటి. తెలంగాణాతో పాటు ఈ రాష్ట్రం లో తెలుగు ప్రధాన భాష. తదుపరి స్థానంలో ఉర్దూ ఉంది.*


ㅁ✧ ఈ రాష్ట్రానికి వాయవ్యదిశలో తెలంగాణ, ఉత్తరాన ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాలు,తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన తమిళ నాడు రాష్ట్రం,పడమరన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి.*


*ㅁ👉 భారతదేశంలో ఎనిమిదవ అతి పెద్దరాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్.*


*ㅁ👉 రాష్ట్రంలోని ముఖ్యమైన నదులు.. గోదావరి, కృష్ణ, తుంగభద్ర మరియు పెన్నా.*


*ఆంధ్ర ప్రదేశ్ 12°37'- 19°54' ఉత్తర*
*అక్షాంశాల మధ్య, 76°46', 84°46'*
*తూర్పు రేఖాం శాల మధ్య వ్యాపించి*
*ఉంది. భారత ప్రామాణిక రేఖాంశ మైన 82°30'తూర్పు రేఖాంశంరాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది.*


*ㅁ👉 దేశంలోనే 2వ అతి పెద్ద కోస్తా తీరం ఈ రాష్ట్రంలో ఉంది.*


*♦ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలు..*


*●రాష్ట్ర భాష — తెలుగు*
*●రాష్ట్ర గుర్తు — పూర్ణకుంభం*
*●రాష్ట్ర గీతం — మా తెలుగు తల్లికి మల్లె పూదండ*
*●రాష్ట్ర జంతువు — కృష్ణ జింక*
*●రాష్ట్ర పక్షి — పాలపిట్ట*
*●రాష్ట్ర వృక్షం — వేప చెట్టు*
*●రాష్ట్ర ఆట — చెడుగుడు(కబడ్డీ)*
*●రాష్ట్ర నృత్యం — కూచిపూడి*
*●రాష్ట్ర పుష్పము — కలువ పువ్వు*


*♦రాష్ట్ర సమాచారం..*


*✧రాజధాని. : హైదరాబాదు*
*✧అవతరణ. : నవంబర్ 1,1956*
*✧అధికార బాషలు:తెలుగు - ఉర్దూ*
*✧విస్తీర్ణము. : 160205 .కి.మీ(8వది)*
*✧జనాభా (2011): 49,665,533 (10వది)*
*✧జనసాంద్రత. : 310/.కి.మీ*
*✧జిల్లాలు. : 13*
*✧పెద్ద నగరము. : విశాఖపట్నం*


*✧గవర్నరు. :*
*✧ముఖ్యమంత్రి: వై యస్ జగన్ మోహన్ రెడ్డి*
*✧శాసనసభ :175 స్థానాలు*
*✧శాసన మండలి :56 స్థానాలు*
*✧లోక్ సభలో :25*
*✧రాజ్యసభలో :11*


*♦చరిత్ర..*


*ㅁ👉 1953 అక్టోబరు1న మద్రాస్ రాష్ట్రం లోని తెలుగు భాషీయులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను, రాయలసీమ దత్త జిల్లాలను కలిపి ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది.*


*ㅁ👉 రాష్ట్రాల పునర్విభజన బిల్లు ఆమోదం పొందాక భాషా ప్రయుక్తరాష్ట్రాలు వచ్చాయి.*


*ㅁ👉 హైదరాబాదు రాజ్యంలోని మరాఠీ జిల్లాలు మహారాష్ట్రకూ, కన్నడ భాషీయ జిల్లాలు కర్ణాటకకూ పోగా, మిగిలిన హైదరాబాదుతో కూడుకుని ఉన్న తెలుగు మాట్లాడే నిజాం రాజ్యాధీనప్రాంతం ఆంధ్రరాష్ట్రంలో కలిసింది.*


*ㅁ👉 అలా 1956, నవంబర్ 1న అప్పటి హైదరా బాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని మరి యు మద్రాస్ నుండి వేరుపడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది.*


*ㅁ👉 మద్రాసు రాజధానిగా ఉండే "ఆంధ్ర రాష్ట్రం కోసం" అమరజీవి' పొట్టి శ్రీరాములు 58 రోజుల నిరాహార దీక్ష చేసి మరణించారు. కానీ ,సురేష్ కట్టా కర్నూలును రాజధానిగా చేసి 1953 అక్టోబరు1"మద్రాసు రాష్ట్రం"లో ఉత్తరాన ఉన్న 11 జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం చేశారు.*


*ㅁ👉 గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేసారు. టంగు టూరి ప్రకాశం పంతులు ఆంధ్రరాష్ట్రాని కి మొట్టమొదటి ముఖ్యమంత్రి.*


*ㅁ👉 తెలుగు ప్రజల కోరికపై 1956, నవంబరు 1 "హైదరాబాదు రాష్ట్రం"లోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో కలిపి ఆంధ్ర ప్రదేశ్ ను ఏర్పాటు చేసారు. కొత్త రాష్ట్రానికి హైదరాబాదు రాజధానిగా అవతరించింది.*


*ㅁ👉 ఈ విధంగా భాష ఆధారముగా ఏర్పడిన రాష్ట్రం లలో ఆంధ్రప్రదేశ్ మొదటి రాష్ట్రము ఐనది. నీలం సంజీవరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి.*


*ㅁ👉 1960 వ సంవత్సరంలో పటాస్కర్ కమిషన్ తీర్పుమూలంగా చిత్తూరు జిల్లా తిరుత్తణి తాలూకాలోని ఎక్కువభాగాన్ని తమిళనాడు కు ఇచ్చి, తమిళనాడుకు చెందిన తిరువళ్లూర్ తాలూకాలోని కొన్ని గ్రామాలను ఆంధ్ర ప్రదేశ్ లో చేర్చారు.*


*ㅁ👉 ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భవించినప్పుడు 20 జిల్లాలే ఉన్నాయి.తర్వాత, 1970, ఫిబ్రవరి 2న ప్రకాశం జిల్లా,1978 ఆగష్టు 12న రంగా రెడ్డి జిల్లా 1979 జూన్1న విజయనగరం జిల్లాలు ఏర్పడడంతో మొత్తం 23 జిల్లాల య్యాయి.*


*♦రాష్ట్ర భౌగోళిక సమగ్రతపై ఉద్యమాలు*


*ㅁ👉 రాష్ట్రం ఏర్పడిన తర్వాత అడపా దడపా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు.. దానికి పోటీగా సమైక్య ఉద్యమాలు జరుగుతూ వచ్చాయి.*


*ㅁ👉 2009లో కే.సి.ఆర్ నిరాహరదీక్ష విరమింప చేయడానికి కేంద్ర ప్రభుత్వం "తెలంగాణా ఏర్పాటు" ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం*


*ㅁ👉 2013 జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 10 జిల్లాలతో కూడి న తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.*


*ㅁ👉 2013 అక్టోబరు 3న జరిగిన కేంద్రప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో తెలంగాణా ఏర్పాటు ని ఆమోదించారు.*


*ㅁ👉 2014, ఫిబ్రవరి 18న ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్య వస్థీకరణ బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోకసభ ఆమోదం లభించింది. పిభ్రవరి20న రాజ్యసభ ఆమోదం తెలిపింది.*


*ㅁ👉 ఉద్యమాల ఫలితంగా.. దాదాపు 58 సం"ల తర్వాత 2014 జూన్ 2న తెలంగాణా ప్రాంతం సీమాంధ్ర ప్రాంతాలనుండి వీడి, క్రొత్త రాష్ట్రంగా ఏర్పడింది.*


*ㅁ👉 తెలంగాణా రాష్ట్రానికి కె.చంద్రశేఖర్ ( కేసిఆర్ ) ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టగా..*


*ㅁ👉 చంద్రబాబునాయుడు 2014, జూన్ 8 న రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు*


*ㅁ👉 హైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాల ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా పది సంవత్సరాల వరకు కొనసాగుతుంది.*


*ㅁ👉 అమరావతిలో కొత్త రాజధానికి 2015 అక్టోబరు 23 న శానికి స్థాపన జరిగింది.*

No comments:

Post a Comment