Saturday, February 8, 2020

పండ్లు ఆయా కాలాల్లోనే కాస్తాయెందుకు?

*🍓 పండ్లు ఆయా కాలాల్లోనే కాస్తాయెందుకు?*

వేర్వేరు పండ్లకు వేర్వేరు రుచులు రావడానికి కారణం ఆయా పండ్లలో ఉండే జన్యు సంకేతాలే (Genetic code). ఆ జన్యు సంకేతాన్ననుసరించే పండ్లలో ప్రత్యేక రుచుల్ని, వాసనలను, ఇచ్చే పదార్థాలే ఉత్పత్తి అవుతాయి. ఏ పదార్థమూ శూన్యం నుంచి ఏర్పడదు. 'అంటే ఫలాల్లో ఉన్న పదార్థాల తయారీకి కావలసిన ముడి పదార్థాలు చెట్టుకు అందుబాటులో ఉండాలి. పైగా పండ్ల రుచుల, వాసనల తయారీ సమయంలో తగిన విధంగా వాతావరణంలోనూ, నేలలోనూ అనువైన భౌతిక (ఉష్ణోగ్రతగల పీడనం, గాలిలో తేమ, వెలుతురు మొదలగునవి) రసాయనిక లక్షణాలు ఉండాలి. ఒకే ప్రాంతంలో సంవత్సరం పాటు ఒకే విధమైన భౌతిక, రసాయనిక లక్షణాలు నేలలోను, వాతావరణంలోనూ ఉండవు. అందువల్లే ఆయా ప్రాంతాలకు, ఆయా రుతువులకు అనుకూలంగా వివిధ పండ్ల మొక్కలు పుష్పించి ఫలిస్తాయి. వివిధ పంటలు పండుతాయి. ఎప్పుడూ కాయలనిచ్చే చెట్లున్నాయి, ఏడాదికోసారి ఫలాలనిచ్చేవి ఉన్నాయి.

No comments:

Post a Comment