Saturday, February 8, 2020

GK & CA BITS



*1)* మనం గుర్తించే భూకంపాలలో సుమారు 68 శాతం భూకంపాలు ఏ ప్రాంతంలో సంభవిస్తున్నాయి ?


*Ans:👉 పరివేష్టిత ముడత మరియు అగ్ని పర్వత మేఖలలో*


*2)* భారతదేశంలో ఏ రాష్ట్రం అత్యధికంగా భూకంపాలు సంభవించే ప్రాంతం ?


*Ans:👉 అస్సాం* ( *_తరువాత గుజరాత్, మహారాష్ట్ర_* )


*3)* 1967లో సంభవించిన కోయనా భూకంపం, 1993 లాటూర్ భూకంపం ఏ రాష్ట్రంకి చెందినవి ?


*Ans:👉 మహారాష్ట్ర*


*4)* భారతదేశంలోని అండమాన్ ద్వీపాలలోని ఏ ద్వీపములు శంఖు ఆకారపు అగ్ని పర్వతాలకు చక్కని ఉదాహరణ ?


*Ans:👉 బారెన్ ద్వీపములు*


*5)* ఒకదానితో ఒకటి అనుసంధానం చెయ్యబడిన 5 మహాసముద్రాలన్నీ ప్రపంచం నందుగల మొత్తం నీటిలో ఎంత శాతం నీటిని కలిగి ఉన్నాయి ?


*Ans:👉 97.2* %


*6)* ప్రపంచంలోకెల్లా లోతైన మహాసముద్ర అఖాతమైనటువంటి 11,034 మీటర్ల లోతైన మెరియానా అఖాతం ఏ సముద్రంలో కలదు ?


*Ans:👉 పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం*


*7)* సముద్రజలాల సరాసరి లవనీయత శాతం ఎంత ?


*Ans:👉 33-37* %


*8)* ప్రపంచంలో ఏ ఇతర సముద్రంలో కంటే కూడా అతి ఎక్కువ లవనీయత ఏ సముద్రంలో ఉంది ?


*Ans:👉 మృతసముద్రం* (Dead Sea)


*9)* చంద్రుడు భూమిని ఒకసారి చుట్టివచ్చే కాలంలో ఎన్నిసార్లు పోటు పాటులు సంభవించును ?


*Ans:👉 రెండు*


*10)* ఇండియాలో ప్రతిరోజు వాతావరణ నివేదికలను తెలిపే IMD (India Meteorological Department) ఎప్పుడు స్థాపించబడింది ?


*Ans:👉 1875* (HQ : న్యూఢిల్లీ)

No comments:

Post a Comment