*🔴అల్పపీడనం అంటే ఏమిటి? హరికేన్ ఎలా ఏర్పడుతుంది?*
✳గాలులు
ఎక్కువగా గుమిగూడి ఉండే చోట
అధిక పీడనం ఉంటుందనీ,
పల్చగా
ఉంటే ఆ ప్రాంతంలో అల్పపీడనమనీ
అనుకోవచ్చు.
గాలులు
నిరంతరం తిరుగుతుండడం వల్ల
ఇలా పీడనాల్లో వ్యత్యాసాలు
వాతావరణంలో నిరంతరం ఏర్పడుతూనే
ఉంటాయి.
వేడిగాలులు
పైకి లేచిన చోట అల్పపీడనం
ఏర్పడితే,
ఆ
ప్రదేశంలోకి చల్లని గాలులు
వేగంగా వచ్చి చేరుతాయి.
ఈ
గాలుల ఒరవడిలో ఒకోసారి సుడులు
ఏర్పడతాయి.
ఈ
సుడుల వల్ల గాలుల పరిభ్రమణ
వేగం ఎక్కువై,
పెద్ద
పరిమాణంలో గాలులు పోగవడం,
పైకి
వెళ్లే గాలులు ఎక్కువగా
చల్లబడి పెద్దపెద్ద మేఘాలుగా
ఏర్పడడం జరుగుతుంది.
అందువల్లనే
అల్పపీడనం ఏర్పడిన ప్రాంతాల్లో
వర్షాలు బాగా కురుస్తాయి.
అల్పపీడనం
ఏర్పడ్డ ప్రాంతాల్లో గాలుల
ప్రభావం ఎక్కువైతే,
దాన్ని
వాయుగుండం అంటారు.
అది
కూడా బలపడితే తుపాను ఏర్పడుతుంది.
అల్పపీడనాలు
భూమ్మీద కూడా ఏర్పడవచ్చు.
కానీ
తుపానులు మాత్రం సముద్రంలోనే
ఏర్పడతాయి.
ఎందుకంటే
అక్కడ గాలులకు కొండలు,
భవనాలు
వంటి అవరోధాలు ఉండవు కదా!
అడ్డూ
అదుపు లేని గాలులు అక్కడ
సుడులు తిరుగుతూ కేంద్రీకృతమైపోతూ
పెద్దవిగా మారిపోతాయి.
మామూలుగా
సూర్యుని కాంతితో సముద్రపు
ఉపరితలాలు వేడెక్కడం వల్ల
అక్కడ దాదాపు పదికిలోమీటర్ల
ఎత్తు వరకు నీటి ఆవిరి పొరలుగా
పేర్కొని ఉంటుంది.
అల్పపీడనాలు
ఏర్పడినపుడు ఈ నీటి ఆవిరి
అంతా దానిచుట్టూ గిరగిరా
తిరుగుతూ ఉంటుంది.
ఈ
పరిణామం బాగా బలపడితే అదే
హరికేన్ అన్నమాట.
హరికేన్
ఏర్పడినచోట ఒక్కోసారి
సముద్రంలోని నీరు ఎవరో
స్ట్రాపెట్టి పీల్చినట్టు
పైకిలేస్తుంది.
అలా
లేచిన అల పెద్ద నీటి గొడుగులాగా
24
అడుగుల
ఎత్తు వరకు కూడా లేచి వేగంగా
ప్రయాణించి తీరాన్ని ముంచెత్తే
అవకాశం ఉంటుంది.
దీన్నే
ఉప్పెన అంటారు.
No comments:
Post a Comment