Saturday, February 8, 2020

🔥ముఖ్యమైన ఆపరేషన్లు🔥

*🔥ముఖ్యమైన ఆపరేషన్లు🔥*





*👉ఆపరేషన్ పేరు - ఆపరేషన్ ఉద్దేశం*



» *🥀రెయిన్ బో ఈస్ట్ - 2004 డిసెంబరు 26న వచ్చిన సునామీ బాధితుల సాయం కోసం మనదేశ నౌకాదళం, శ్రీలంక చేపట్టిన కార్యక్రమం*.


» *🥀ఆపరేషన్ పవన్ - శ్రీలంలోని భారత శాంతి స్థాపక దళ కార్యక్రమాలు*


» *🥀ఆపరేషన్ రెడ్ డాన్ - ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ను పట్టుకోడానికి అమెరికా సైన్యం చేపట్టింది*.


» *🥀ఆపరేషన్ ఓవర్ లోడ్ - ఫ్రాన్స్ ను నాజీల నుంచి విముక్తం చేయడానికి అమెరికా చేపట్టిన సైనికచర్య*.




» *🥀ఆపరేషన్ ఈగల్ - శ్రీలంకలోని తమిళులకు ఆహార పదార్థాలు, వైద్య సదుపాయాలు, ఇతర సౌకర్యాలు కల్పించడానికి భారత శాంతిస్థాపక దళం చేపట్టిన కార్యక్రమం*.


» *🥀ఆపరేషన్ లీప్ ఫార్వర్డ్ - ఎల్.టి.టి.(లిబరేషన్ ఆఫ్ తమిళ ఈలం) స్థావరాలను ధ్వంసం చేయడానికి శ్రీలంక సైన్యం, వైమానిక, నౌకాదళాలు సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం*.


» *🥀ఆపరేషన్ ఆల్ క్లియర్ - భూటాన్ లోని భారత వ్యతిరేక శక్తులైన ఉల్ఫా, కమటాపూర్ లిబరేషన్ ఆర్గనైజేషన్, నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ ల కోసం చేపట్టిన చర్య*.


» *🥀ఆపరేషన్ తొపక్ - మన దేశ యువకులకు అక్రమంగా సైనిక శిక్షణ ఇచ్చి మన దేశంలో అలజడులు సృష్టించడానికి పాకిస్థాన్ అధ్యక్షుడు 1988 లో ఏర్పాటు చేసింది*.


» *🥀ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్ - అల్ ఖైదా ఉగ్రవాద సంస్థను అరికట్టడానికి అమెరికా చేపట్టిన సైనిక చర్య*.


» *🥀ఆపరేషన్ సన్ షైన్ - 1995లో ఎల్.టి.టి.ఈ స్థావరమైన జాఫ్నాపై శ్రీలంక సైన్యం చేపట్టిన చర్య*.


» *🥀ఆపరేషన్ చెక్ మేట్ - ఎల్.టి.టి.ఈ కి వ్యతిరేకంగా భారత శాంతిదళాలు తీసుకున్న చర్యలు*.


» *🥀ఆపరేషన్ డిజర్ట్ ఫాక్స్ - ఇరాక్ పై దాడికి అమెరికా వైమానిక దళం చేపట్టిన చర్య*
.
» *🥀ఆపరేషన్ స్యార్ యర్ - ఇరాక్ లోని ఉగ్రవాదులను నాశనం చేయడానికి అమెరికా వైమానిక దళం 2006 లో చేపట్టిన దాడులు*




» *🥀ఆపరేషన్ రెస్టోర్ హోష్ - సోమాలియాలో కరవు నివారణ కోసం యూఎన్ వో చేపట్టిన చర్యలు*.


» *🥀ఆపరేషన్ సైలెన్స్ - లాల్ మసీదులోని తీవ్ర వాదులను, మత ఛాందసులను నిరోధించడానికి పాకిస్థాన్ సైన్యం చేసిన కార్యక్రమం*


» *🥀ఆపరేషన్ పుష్ బాల్ - బంగ్లాదేశ్ నుంచి భారత దేశంలోకి వలస వచ్చిన వారిని వెనక్కి పంపే కార్యక్రమం*


» *🥀ఆపరేషన్ ఖఖరి - రివల్యూషనరీ యునైటెడ్ ఫ్రంట్ కు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి చేపట్టిన చర్య ఇది. సియెర్రాలియోన్ లో జరిగింది. 222 మంది భారత సైనికులను విడిపించడానికి ఈ చర్య చేపట్టారు*.




» *🥀ఆపరేషన్ డెవలప్ మెంట్ ఎఫర్ట్ - బంగ్లాదేశ్ లోని తుపాను బాధితుల కోసం చేపట్టిన ఆపరేషన్ ఇది. అమెరికా నావికా దళాలు దీన్ని నిర్వహించాయి*.


» *🥀ఆపరేషన్ ఎర్త్ క్వేక్ - ఎల్ టీటీఈ తీవ్రవాదులను నాశనం చేయడానికి శ్రీలంక సైన్యం ఈ చర్యను చేపట్టింది*.


» *🥀ఆపరేషన్ జాయింట్ ఎండీవర్ - నాటో ఆధ్వర్యంలో శాంతి స్థాపన కోసం బోస్నియాలో జరిగిన కార్యక్రమం*.


» *🥀ఆపరేషన్ అనకొండ - తోరాబోరా గుహల్లో దాక్కొని ఉన్న అల్ ఖైదా తీవ్రవాదులను చంపడానికి అమెరికా ఈ ఆపరేషన్ నిర్వహించింది*.


» *🥀ఆపరేషన్ ఒడిస్సీడాన్ - అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా తదితర దేశాల సైన్యంతో కూడిన అంతర్జాతీయ దళాలు లిబియాపై చేపట్టిన చర్య*.


» *🥀ఆపరేషన్ జరోనిమా - అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ ను చంపడానికి అమెరికా సైన్యాలు చేపట్టిన కార్యక్రమం*.


» *🥀ఆపరేషన్ ఖంజర్ - తాలిబన్ ల ఏరివేతకు అమెరికా సైన్యం, అప్ఘానిస్థాన్ సైన్యం సంయుక్తంగా చేపట్టిన చర్య*.


No comments:

Post a Comment