Saturday, February 8, 2020

పోస్ట్ ఆఫీస్‌లో టైమ్ డిపాజిట్ అకౌంట్‌... లాభాలేంటో తెలుసా

*🌺Post Office Scheme: పోస్ట్ ఆఫీస్‌లో టైమ్ డిపాజిట్ అకౌంట్‌... లాభాలేంటో తెలుసా?*



*🌺1. ఇండియా పోస్ట్... భారతదేశంలో గ్రామగ్రామాన విస్తరించిన పోస్టల్ సర్వీస్. పట్టణాల కంటే పల్లెల్లో పోస్ట్ ఆఫీస్ సేవల్ని ఉపయోగించుకునేవాళ్లే ఎక్కువ. పోస్ట్ ఆఫీస్‌లో అన్ని వర్గాలకు వేర్వేరు పథకాలు ఉంటాయి.*


*🌺2. చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో మంచి వడ్డీ ఇస్తుంది ప్రభుత్వం. ఈ వడ్డీ రేట్లు మూడు నెలలకోసారి మారుతుంటాయి. అలాంటి పథకాల్లో ఇండియా పోస్ట్‌లో టైమ్ డిపాజిట్ పేరుతో ఓ స్కీమ్ ఉంది. దీన్నే ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ అని కూడా అంటారు. పోస్ట్ ఆఫీస్‌లో టైమ్ డిపాజిట్ అకౌంట్‌తో లాభాలేంటో తెలుసుకోండి*




*🌺3. పోస్ట్ ఆఫీస్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్‌ను ఎవరైనా క్యాష్ లేదా చెక్‌తో ఓపెన్ చేయొచ్చు. కనీసం రూ.200 నుంచి ఈ అకౌంట్‌లో డిపాజిట్ చేయొచ్చు. గరిష్ట పరిమితి లేదు.<br />ఏడాది నుంచి ఐదేళ్ల కాలానికి 7 నుంచి 7.8 శాతం వరకు వడ్డీ లభిస్తుంది*




*🌺4. ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్-7.00%. రెండేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్-7.00%. మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్-7.00%. ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్-7.80%*


*🌺5. ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌ అకౌంట్ ఎంచుకుంటే ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.*


*🌺6. మైనర్ పేరు మీద జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. నామినేషన్ సదుపాయం కూడా ఉంటుంది.*

No comments:

Post a Comment