®EWS Quota: ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% రిజర్వేషన్... సర్టిఫికెట్ కోసం కావాల్సిన 8 డాక్యుమెంట్స్ ఇవే...*
*🔹1.
Income Certificate: ఈడబ్ల్యూఎస్
కోటా ప్రయోజనాలు పొందాలంటే
ఆదాయ ధృవీకరణ పత్రం తప్పనిసరి.
రూ.8
లక్షల లోపు
వార్షికాదాయం ఉండాలని కేంద్ర
ప్రభుత్వం స్పష్టం చేసింది.
కాబట్టి
రూ.8 లక్షల
లోపు ఇన్‌కమ్ సర్టిఫికెట్
ఉండాలి*
*🔸2.Caste
Certificate: ఈడబ్ల్యూఎస్
కోటా పొందాలంటే కుల ధృవీకరణ
పత్రం తప్పనిసరి. సాధారణంగా
అగ్రవర్ణాలకు చెందినవాళ్లు
కుల ధృవీకరణ పత్రాన్ని తీసుకోరు.
కానీ
ఈడబ్ల్యూఎస్ కోటాలో రిజర్వేషన్
పొందాలంటే క్యాస్ట్ సర్టిఫికెట్
కావాల్సిందే.*
*🔹3.BPL
Card: అగ్రకులాలకు
చెందినవాళ్లు ఆర్థికంగా
వెనుకబడ్డట్టు నిరూపించడానికి
బీపీఎల్ కార్డ్ ఉపయోగపడుతుంది.
దారిద్ర్యరేఖ(BPL)కు
దిగువన ఉన్నవారికి ఇచ్చే
కార్డు ఇది.*
*🔹4.PAN
Card: అన్ని
ఉద్యోగాలకు, విద్యావకాశాలకు
పాన్ కార్డు తప్పనిసరి చేసింది
ప్రభుత్వం. కాబట్టి
పాన్ కార్డు లేకపోతే దరఖాస్తు
చేసుకోవాలి.*
*🔸5.Aadhaar
Card: రిజర్వేషన్
ప్రయోజనాలు పొందడానికి ఆధార్
తప్పనిసరి చేసింది కేంద్రం.
దరఖాస్తుదారులు
భారతీయులేనని నిరూపించడానికి
ఆధార్ కార్డు ఉపయోగపడుతుంది.
మీరు ఆధార్
కార్డు జత చేస్తే మీకు సంబంధించిన
సమస్త సమాచారం ప్రభుత్వం
తెలుసుకోవడానికి అవకాశముంటుంది*
*🔹6.Income
Tax Return: ఆదాయపు
పన్ను రిటర్న్స్ దాఖలుకు
సంబంధించిన డాక్యుమెంట్స్
కావాలి. మీ
ఆదాయం రూ.8 లక్షలకు
మించి లేకపోతే ఆ విషయం
నిరూపించడానికి ఫామ్ 16
సాయపడుతుంది.*
*🔹7.Bank
Passbook: ఏదైనా
బ్యాంకులో అకౌంట్ ఉంటే పాస్
బుక్ కాపీ ఉండాలి. దాంతో
పాటు గత 3 నెలల్లో
మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్
తీసుకోవాలి*
*🔸8.Jandhan
Scheme: మీరు
ఈడబ్ల్యూఎస్ కోటాలో రిజర్వేషన్
పొందాలంటే జన్‌ధన్ స్కీమ్‌లో
అకౌంట్ ఓపెన్ చేయడం తప్పనిసరి.
ఈ స్కీమ్‌లో
లబ్ధిదారుల్ని ఆర్థికంగా
వెనుకబడ్డ వర్గాలుగా గుర్తిస్తుంది
ప్రభుత్వం
No comments:
Post a Comment