Sunday, April 12, 2020

కితకితలు రావడానికి కారణం ఏమిటి?😁


కితకితలు రావడానికి కారణం ఏమిటి?😁



👉జవాబు: మన శరీరంపై ఎవరైనా కితకితలు (చక్కిలిగింతలు) పెడితే, వాటి వల్ల కలిగే అనుభవాన్ని మెదడులోని రెండు ప్రదేశాలు పంచుకుంటాయి. అందులో ఒకటి సొమాటో సెన్సరీ కార్టెక్స్‌ (somato sensory cortex). ఇది శరీరానికి స్పర్శజ్ఞానం కలుగజేస్తుంది. రెండోది ఏంటీరియర్‌ సింగులేట్‌ కార్టెక్స్‌ (Anterior cingulate cortex). ఇది ఆహ్లాదాన్ని కలుగజేస్తుంది. ఈ రెండు అనుభూతుల వల్ల మనం సిగ్గుపడుతూ, నవ్వుతాము. మనకై మనం చక్కిలిగింత పెట్టుకున్నప్పుడు ఈ రెండు ప్రదేశాలు అంతగా ఉత్తేజం చెందవు. మన తలలోని మెదడు వెనుకవైపు సెరిబెల్లమ్‌ (ceribellum) అనే భాగం ఉంటుంది. దీన్నే చిన్నమెదడు అంటారు.


👉ఈ భాగం మన దేహంలోని చలనాలను నియంత్రిస్తుంటుంది. మనకై మనం చక్కిలిగింత పెట్టుకుంటే సెరిబెల్లమ్‌ ఆ చలనానికి స్పందించినా, ఆ స్పందన మెదడులోని మిగతా ప్రదేశాల్లో కలిగే ప్రతిస్పందనలను రద్దు చేయడంతో మనకు నవ్వు రాదు.1897 లో ఇద్దరు శాస్త్రవేత్తలు చక్కిలిగింతల మీద పరిశోధన చేసారట. చక్కిలిగింతలు రెండు రకాలుగా ఉంటాయట. చర్మం మీద చిన్న కదలిక వల్ల కలిగే చక్కిలిగింత మొదటి రకానికి చెందింది. దీని వలన నవ్వు రాకపోగా చిరాకు కలగచ్చు. చక్కిలిగింతలు పుట్టే చోట పదే పదే సున్నితంగా తాకడం వల్ల బాగా నవ్వు రావచ్చు, ఇవి రెండవ రకానికి చెందిన చెక్కిలిగింతలు.


No comments:

Post a Comment