*🇮🇳గణతంత్ర దినోత్సవం🇮🇳*
*🇮🇳గణతంత్ర
దినోత్సవం🇮🇳*
*🇮🇳ఒక
దేశపు రాజ్యాంగ అమలు ప్రారంభమైన
రోజుని ఆదేశము గణతంత్ర
దేశంగా ప్రకటించుకుని జరుపుకునే
"జాతీయ
పండుగ" దినం.
భారతదేశంలో
గణతంత్ర దినోత్సవము మన రాజ్యాంగం
అమలులోకి వచ్చిన 1950
జనవరి
26 దినానికి
గౌరవంగా జరుపు కుంటారు.ఈ
రోజున బ్రిటీషు కాలంనాటి భారత
ప్రభుత్వ చట్టం 1935 రద్దయి,
భారతదేశం
సర్వసత్తాక,
సామ్యవాద,
లౌకిక,
ప్రజాస్వామ్య,
గణతంత్ర
రాజ్యంగా ఆవిర్భవించింది.*
*🇮🇳భారతదేశానికి
1947 ఆగస్టు
15 న
స్వాతంత్ర్యము వచ్చింది.
దేశానికి
రాజ్యాంగము తయారు చేయటానికి
రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది.
దీనికి
అధ్యక్షుడుగా డాక్టర్ బాబు
రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు.
1947 ఆగస్టు
29 న
డాక్టర్ బి.ఆర్.
అంబేద్కర్ ఛైర్మన్
గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ
ఏర్పడింది.
రాజ్యాంగము
తయారు చేయడానికి ఎంతోమంది
మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను
పరిశీలించి ప్రజాస్వామ్య
విధానంగా రూపుదిద్దారు.
అనేక
సవరణల అనంతరము 1949
నవంబర్
26 న భారత
రాజ్యాంగాన్ని రాజ్యాంగ
పరిషత్ ఆమోదించింది.
భారత
రాజ్యాంగానికి 2
సంవత్సరాల,
11 నెలల,
18 రోజుల
కాలము పట్టింది.*
*🇮🇳ప్రపంచములోనే
అతి పెద్ద లిఖిత రాజ్యాంగముగా
గుర్తించబడింది.
అలా
తయారైన రాజ్యాంగాన్ని 1950
జనవరి
26 నుంచి
అమలుపరచడంతో భారతదేశము
సర్వసత్తాక,
సామ్యవాద,
లౌకిక,
ప్రజాస్వామ్య,
గణతంత్ర రాజ్యముగా
రూపొందడంతో పరిణామ దశ పూర్తయింది.*
*🇮🇳1930
జనవరి
26 న
పూర్ణ స్వరాజ్ దినోత్సవంగా
జరుపుకున్నప్పటికీ బ్రిటీష్
వారి నుండి పూర్తిగా స్వతంత్రం
సాధించలేదు.*
*🇮🇳భారతదేశానికి
మూడు జాతీయ సెలవు దినాలలో
ఇది ఒకటి.
మిగతావి స్వాతంత్ర్య
దినోత్సవం మరియు గాంధీ జయంతి.
ఈ రోజు
డిల్లీలో పరేడ్లు నిర్వహిస్తారు.
సాహస
బాల బాలికలకు భారత రాష్ట్రపతి
పురస్కారాలు అందజేస్తారు.
పద్మశ్రీ,
పద్మభూషణ్
వంటి బిరుదులు ప్రధానం
చేస్తారు.*
No comments:
Post a Comment