Sunday, April 12, 2020
ఓజోన్ పొర ఎక్కడుంటుంది? మన కంటికి కనపడదా?
ఓజోన్
అనేది మూడు పరమాణువులతో కూడిన
ఆక్సిజన్ అణువు (triatomic
oxygen molucule). ఇందులో
ఉన్న అన్ని ఆక్సిజన్ పరమాణువులు
రసాయనికంగా ఒకే లక్షణం ఉన్నవి
కావు. కానీ
మనం శ్వాసక్రియలో పీల్చే
సాధారణ ద్విపరమాణుక ఆక్సిజన్
అణువులో (diatomic
oxygen molucule) మాత్రం
రెండు పరమాణువులూ ఒకే విధమైనవి.
తద్వారా
సాధారణ ఆక్సిజన్ అణువుల్లాగా
ఓజోన్ స్థిరమైన వాయువు
(stable gas) కాదు.
భూవాతావరణాన్ని
నేల మీద నుంచి పైకి వెళ్లే
కొలదీ అక్కడున్న ప్రధాన
రసాయనిక భౌతిక ధర్మాల ఆధారంగా
కొన్ని పొరలుగా విభజించారు.
నేలకు
దగ్గరగా 20 కి.మీ.లోపే
ఉన్న పొరను ట్రోపోస్ఫియర్
అనీ, 20 నుంచి
50 కి.మీ
మధ్యలో ఉన్న పొరను స్ట్రాటోస్ఫియర్
అనీ, ఆ
తర్వాత మీసో స్ఫియర్,
థర్మోస్ఫియర్,
ఎక్సోస్ఫియర్
అనే పొరలు సుమారు 500
కి.మీ.
వరకు
వివిధ దూరాల్లో విస్తరించి
ఉన్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment