Saturday, April 11, 2020
*🔥గగన్‌యాన్...🔥*
*📡ఆస్ట్రోనాట్స్..
అంతరిక్ష
యాత్రికులు,
వీరిని
వ్యోమగాములని కూడా పిలుస్తాం.
మన
గగన్‌యాన్ మిషన్ కోసం
రష్యాలో శిక్షణ తీసుకునే
వ్యోమగాముల్ని గగన్‌నాట్స్
అని ముద్దుగా పిలుస్తున్నారు.
వీరిని
అంతరిక్ష కేంద్రానికి
తీసుకువెళ్లి తిరిగి భూమికి
సురక్షితంగా తీసుకొచ్చే
లక్ష్యంతో భారత అంతరిక్ష
పరిశోధన సంస్థ (ఇస్రో)
అడుగులు
వేస్తోంది. ఈ
మిషన్ కోసం తొలుత 12
మంది
ఎంపిక చేసింది.
భారత్‌లో
ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరో
స్పేస్ మెడిసిన్ (ఐఏఎం)లో
వారికి కొన్ని పరీక్షలు
నిర్వహించి శారీరకంగా,
మానసికంగా
దృఢంగా ఉన్న నలుగురిని తుది
జాబితాలోకి చేర్చింది.
ఈ నలుగురిలో
మహిళలెవరికీ చోటు దక్కలేదు.
ప్రస్తుతానికి
వీరి వివరాలను ఇస్రో రహస్యంగా
ఉంచింది. అయితే
వీరంతా భారత వైమానిక దళానికి
చెందిన పైలట్లని ఇస్రో చైర్మన్
కె.శివన్
వెల్లడించారు.
మానవ
లక్షణాలు కలిగిన ఒక రోబోని
కూడా వ్యోమగాముల వెంట
పంపించనున్నారు.*
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment