భారత పాక్ యుద్ధం 1971
*🔥భారత
పాక్ యుద్ధం 1971🔥*
*💐భారత్-పాకిస్తాన్
ల మధ్య అతి పెద్ద యుద్ధం 1971లో
జరిగింది. ఈ
యుద్ధంలో బంగ్లాదేశ్ విమోచన
ప్రధాన అంశంగా నిలిచింది.
డిసెంబరు
3, 1971 సాయంత్రం
మొదలయిన యుద్ధం డిసెంబరు 16,
1971 తేదీన
పాకిస్తాన్ ఓటమితో ముగిసింది.
ఈ యుద్ధంలో
భారత సైన్యం, బంగ్లాదేశ్
సైన్యం కలసి కట్టుగా పాకిస్తాన్
సైన్యంతో పొరాడటం విశేషం*.
*తేదీ*
3
డిసెంబర్
– 16 డిసెంబర్
1971
*ప్రదేశము*
తూర్పున:
తూర్పు
పాకిస్తాన్ (ప్రస్తుతం
బంగ్లాదేశ్)
పశ్చిమాన:
భారత్-పశ్చిమ
పాకిస్తాన్ సరిహద్దు
*ఫలితము*
తూర్పున:
నిర్ణయాత్మకమైన
భారత్ విజయం. పాకిస్తాన్
సైన్యం లొంగిపోయింది.
పశ్చిమాన:
కాల్పుల
విరమణ ఒప్పందం కుదిరింది.
*భూభాగంలో
మార్పులు*
తూర్పు
పాకిస్తాన్(ప్రస్తుతం
బంగ్లాదేశ్) స్వతంత్ర
దేశంగా ఆవిర్భవించింది*.
*1971వ
సంవత్సరపు భారత-పాకిస్తాన్
యుద్ధం, భారత
దేశం, పాకిస్తాన్
మధ్య జరిగిన ఒక సైనిక ఘర్షణ.
డిసెంబరు
3, 1971న
11 భారతీయ
వాయుసేనకు సంబంధించిన విమాన
స్థావరాల పై పాకిస్తాన్ చేసిన
అనుమాన ప్రేరిత దాడిని,
ఆపరేషన్
చెంఘిజ్‌ఖాన్ అని పరిగణిస్తారు.
ఈ అనుమాన
ప్రేరిత దాడి యుద్ధానికి
మొదలుగా నిలిచింది.[7][8]
13 రోజులు
మాత్రమే నడిచిన ఈ యుద్ధాన్ని
చరిత్రలోని అతి తక్కువ కాలం
జరిగిన యుద్ధాలలో ఒకటిగా
గుర్తిస్తారు.[9][10]*
*యుద్ధం
జరుగుతోన్న సమయంలో,
భారత,
పాకిస్తానీ
బలగాలు, తూర్పు,
పడమటి
దిశలలో ఘర్షణ పడ్డారు.
తూర్పు
కమాండ్‌కు చెందిన పాకిస్తానీ
సైనిక బలగాలు లొంగుబాటు పత్రం
పై సంతకాలు చేసాక, యుద్ధం
ప్రభావవంతంగా అంతమయ్యింది.
ఈనాటి వరకూ
కూడా, బహిరంగ
లొంగుబాటులలో ఇది మొదటిదీ
బహుశా ఆఖరుదీ[11] కూడా.
[12] 1971 డిసెంబరు
16నాటి
లొంగుబాటు తరువాత, తూర్పు
పాకిస్తాన్, స్వతంత్ర
బంగ్లాదేశ్‌గా విడిపోయింది.
తూర్పు
పాకిస్తాన్‌కు స్వాతంత్ర్యం
వచ్చిన సమయంలో తూర్పు
పాకిస్తాన్‌లో ఉన్న సుమారు
97,368 పశ్చిమ
పాకిస్తానీ వాసులను,
భారతదేశము
యుద్ధ ఖైదీలుగా అదుపులోకి
తీసుకుంది. అందులో
79,700 మంది
పాక్ సైన్యానికి చెందిన
సైనికులు, పారామిలిటరి
సిబ్బంది[13], మరో
12,500 మంది
నాగరికులు[13] ఉన్నారు*.
*🔥నేపథ్యం🔥*
*🟢భారత-పాక్
ఘర్షణ బంగ్లాదేశ్ విముక్తి
పోరాటం వల్ల సంభవించింది.
బంగ్లాదేశ్
విముక్తి పోరాటం సాంప్రదాయికంగా
ఆధిక్యత ప్రదర్శించే పశ్చిమ
పాకిస్తానీయులకూ,,
సంఖ్యాపరంగా
ఆధిక్యంలో ఉన్న తూర్పు
పాకిస్తానీయులకు మధ్య జరిగిన
పోరాటం.[4] బంగ్లాదేశ్
విముక్తి పోరాటం, 1970వ
సంవత్సరపు పాకిస్తాన్ ఎన్నికల
తరువాత రాజుకుంది. ఈ
ఎన్నికలలో, తూర్పు
పాకిస్తానీ అవామీ లీగ్ తూర్పు
పాకిస్తాన్‌లో, 169 సీట్లలో,
167 సీట్లు
గెలుచుకుని 313 సీట్లుగల
మజ్లిస్-ఎ-షూరా
(పాకిస్తాన్
యొక్క పార్లమెంట్) లో
స్వల్ప ఆధిక్యతను పొందింది.
అవామీ లీగ్
నాయకుడు షేక్ ముజీబుర్ రహ్మాన్
పాకిస్తాన్ రాష్ట్రపతికి
ఆరు సూత్రాలను సమర్పించి
ప్రభుత్వం స్థాపించే హక్కుని
కోరాడు. పాకిస్తాన్
పీపుల్స్ పార్టీకి చెందిన
జుల్ఫికర్ అలీ భుట్టో,
పాకిస్తాన్
ప్రభుత్వం పై అధికారాన్ని
ముజీబుర్‌కు బదిలీ చేయడానికి
నిరాకరించడంతో, రాష్ట్రపతి
యాహ్యా ఖాన్ పశ్చిమ పాకిస్తానీల
ఆధిక్యతలో ఉన్న సైన్య నిరసనను
అణచివేయడానికి పిలిచాడు.[14][15]*
*నిరసనకారుల
యొక్క సామూహిక అరెస్టులు
మొదలయ్యాయి, అంతేకాక,
తూర్పు
పాకిస్తానీ సైనికులనీ,
పోలీసులనీ
నిరాయుధులను చేసే ప్రయత్నాలు
జరిగాయి. అనేక
రోజులపాటు కొనసాగిన దాడులు,
సహాయ
నిరాకరణోద్యమాల తరువాత,
పాకిస్తానీ
సైన్యము 1971 మార్చి
25న
ఢాకాపై విరుచుకుపడింది.
అవామీ లీగ్
నామరూపాల్లేకుండా పోయింది,
చాలామంది
సభ్యులు భారతదేశానికి
పారిపోయారు. ముజీబ్‌ను
25-1971 మార్చి
26వ
నాటి రాత్రి 1-30 ప్రాంతంలో
నిర్బంధంలోకి తీసుకుని (1971
మార్చి
29నాటి
రేడియో పాకిస్తాన్ యొక్క
వార్తల ప్రకారం) పశ్చిమ
పాకిస్తాన్‌కు తరలించారు*.
*1971
మార్చి
27న,
జియావుర్
రహ్మాన్, పాకిస్తాన్
సైన్యంలో ఒక తిరుగుబాటుదారుడైన
మేజర్, ముజీబుర్
తరఫున బంగ్లాదేశ్‌ను స్వతంత్ర
దేశంగా ప్రకటించాడు.[16]
ఏప్రిల్‌లో,
మెహెర్పూర్‌లోని
బైద్యనాథ్‌తలాలో,
బహిష్కృతులైన
అవామీ లీగ్ నాయకులు,
దేశం వెలుపల
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు.
ఈస్ట్
పాకిస్టాన్ రైఫిల్స్ అనబడే
ఒక పారామిలిటరి బలగం,
తిరుగుబాటుదారుల్లోకి
ఫిరాయించింది. బంగ్లాదేశ్
సైన్యానికి సాయం చేయడానికి
ముక్తి బాహిని అనబడే నాగరికులతో
కూడిన ఒక గెరిల్లా దళాన్ని
ఏర్పాటు చేయడం జరిగింది*.
*పశ్చిమ
పాకిస్తాన్ (ప్రస్తుత
పాకిస్తాన్), తూర్పు
పాకిస్తాన్ (ప్రస్తుత
బంగ్లాదేశ్) ల
మధ్య ఉన్న ఆధిపత్య పోరు ఈ
యుద్ధానికి బీజం వేసింది.
1970లో జరిగిన
పాకిస్తాన్ ఎన్నికల్లో తూర్పు
పాకిస్తాన్ పార్టీ అయిన అవామీ
లీగ్ మొత్తం 169 సీట్లలో
167 గెలుచుకొని,
313 సీట్లు
ఉన్న పాకిస్తాన్ పార్లమెంట్
దిగువసభలో ఆధిక్యతను సాధించింది.
అవామీ లీగ్
పార్టీ అధ్యక్షుడయిన షేక్
ముజిబుర్ రెహ్మాన్ తనకు
ప్రభుత్వాన్ని ఏర్పాటు
చేయడానికి హక్కు ఉన్నదని
ప్రతిపాదించినపుడు,
అప్పటి
పాకిస్తాను అధ్యక్షుడు అయిన
యాహ్యా ఖాన్ అందుకు అంగీకరించలేదు*.
*తూర్పు
పాకిస్తాన్ నాయకులను అణచివేయడానికి
యాహ్యా ఖాన్ మిలిటరీని రంగంలోకి
దింపినపుడు తూర్పు పాకిస్తాన్లో
నిరసనలు తెలియజేస్తూ పెద్ద
ఎత్తున బందులు జరిగాయి.
అవన్నీ
అణిచివేస్తూ మార్చి 25,
1971 న ఢాకాను
మిలిటరీ స్వాధీనపరచుకొంది.
చాలామంది
నాయకులు పారిపోయి భారత దేశం
చేరుకొన్నారు. ముజిబుర్
రెహ్మాన్‌ను అరెస్టు చేసి
పశ్చిమ పాకిస్తానుకు తీసుకెళ్ళారు*
*ఇది
జరిగిన రెండు రోజులకు పాకిస్తాను
సైన్యంలో మేజర్ అయిన జియా
ఉర్ రెహ్మాన్ తనకుతానుగా
బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం
ప్రకటించాడు. అవామీ
లీగ్ నాయకులు కొందరు కలసి
ప్రభుత్వాన్ని ఏర్పరచుకొనగా
ప్రజలే గెరిల్లా గ్రూపులుగా
మారి తమకున్న ఆర్మీతో కలసి
పాకిస్తానుతో యుద్ధానికి
సిద్దమయ్యారు*.
*🔥బంగ్లాదేశ్
విముక్తి పోరాటంలో భారతదేశ
జోక్యం🔥*
*🎉1971
మార్చి
27న
అప్పటి భారతదేశ ప్రధానమంత్రి
అయిన ఇందిరా గాంధీ బంగ్లాదేశ్
స్వాతంత్ర్యపోరాటానికి
పూర్తి మద్దతు తెలిపి బంగ్లా
శరణార్థులకోసం భారత సరిహద్దులను
తెరిపించారు. దాదాపు
కోటిమంది శరణార్థులు
పలురాష్ట్రాల్లోని శిబిరాల్లో
తలదాచుకొన్నారు. అంతమంది
శరణార్థులకు అవసరమయిన సౌకర్యాలు
కలిపించడానికి వేలకోట్ల
రూపాయలు ఖర్చు పెట్టసాగింది
భారత ప్రభుత్వం*.
*అమెరికా
పశ్చిమ పాకిస్తానుకు మొదటినుండి
మిత్రదేశం కావడం వల్ల,
పాకిస్తానుకు
అవసరమయిన ఆయుధాలు, సామగ్రి
సమకూర్చడానికి సిద్ధమయింది.
వెంటనే
ఇందిరా గాంధీ ఐరోపా పర్యటన
జరిపి యునైటెడ్ కింగ్‌డమ్,
ఫ్రాన్స్లు
పాకిస్తానుకు వ్యతిరేకంగా
పనిచేయునట్లు ఒప్పించింది.
ఆగష్టులో
సోవియట్ యూనియన్‌తో ఇరవయ్యేళ్ళ
మైత్రీ ఒప్పందం కుదుర్చుకొని
ప్రపంచాన్ని విస్మయానికి
గురిచేసింది. భారత్‌కు
సోవియట్ యూనియన్ అండ చూసిన
చైనా యుద్ధంలో పాల్గొనలేదు
కానీ పాకిస్తానుకు కొన్ని
ఆయుధాలు సరఫరా చేసింది*.
*పాకిస్తాన్
సైన్యం తూర్పు పాకిస్తాన్[17]కు
చెందిన బెంగాలి ప్రజల పై
విస్తృతమైన జాతి నిర్మూలన
మారణకాండ నిర్వహించింది,
ముఖ్యంగా
అల్పసంఖ్యాకులైన హిందు
జనాభా[18][19]ని
నిర్మూలించడం పై దృష్టి
కేంద్రీకరించింది. దాని
వల్ల, సుమారు
కోటి మంది[18][20] తూర్పు
పాకిస్తాన్ వదిలి సరిహద్దు
భారత రాష్ట్రాలలోకి శరణార్దులుగా
పారిపోయారు.[17][21] తూర్పు
పాకిస్తాన్-భారతదేశపు
సరిహద్దుని శరణార్ధులకు
భారతదేశంలో రక్షితమైన ఆశ్రయం
కల్పించడం కోసం తెరిచారు.
పశ్చిమ
బెంగాల్, బీహార్,
అస్సాం,
మేఘాలయా,
త్రిపురా
రాష్ట్ర ప్రభుత్వాలు సరిహద్దులలో,
శరణార్ధుల
శిబిరాలు ఏర్పాటు చేసాయి.
దరిద్రులయిపోయిన
తూర్పు పాకిస్తానీ శరణార్ధులు
వరదలా తరలిరావడం, అప్పటికే
పెనుభారంతో ఉన్న భారత
ఆర్థికవ్యవస్థ పై మోయలేని
భారం మోపింది.[19]*
*విస్తృత
స్థాయిలో చేసిన అమానుష
కృత్యాలకుగాను, జనరల్
తిక్కా ఖాన్‌కు 'బెంగాల్
యొక్క నరహంతకుడు' అన్న
పేరు వచ్చింది.[7] అతని
చర్యల పై వ్యాఖ్యానం చేస్తూ,
గనరల్
నియాజి '25/1971 మార్చి
26 తేదీల
మధ్య రాత్రి జనరల్ తిక్కా
విరుచుకుపడ్డాడు.
శాంతియుతమైన
రాత్రి, దహనకాండతో,
ఏడుపులతో,
ఆక్రందనలతో
ప్రతిధ్వనించింది.
తప్పుదోవ
పట్టిన తన సొంత ప్రజల పైన
అన్నట్లుగా కాకుండా,
శత్రువు
పైన దాడి చేసినట్లుగా,
జనరల్
టిక్కా తన అమ్ములపొదిలోని
ప్రతి అస్త్రాన్నీ ప్రయోగించాడు.
బుఖారా,
బగ్దాద్
లపై చెంగిజ్‌ఖాన్, హలకు
ఖాన్ చేసిన నరమేధాల కంటే
నిర్దయగా ఉన్న సైనిక చర్య,
అతి దారుణమైన
క్రూరత్వానికి ప్రతీకగా
నిలుస్తుంది. జనరల్
తిక్కా....నాగరికులని
చంపడం భూమికి నిప్పుపెట్టే
విధానం అవలంబించాడు.
తన బలగాలకు
అతను ఇచ్చిన ఉత్తర్వులు
ఏమిటంటే: 'నాకు
భూమి కావాలి మనుషులు కాదు....'
మేజర్ జనరల్
ఫర్మన్ తన టేబుల్ డైరీలో ఇలా
వ్రాసాడు, "తూర్పు
పాకిస్తాన్ యొక్క పచ్చటి
భూమి ఎరుపు రంగు పులమబడుతుంది."
బెంగాలీ
రక్తంతో అది ఎరుపురంగుగా
మారిపోయింది.[22]*
*జాతీయ
భారత ప్రభుత్వం అంతర్జాతీయ
సముదాయాన్ని కదిలించడానికి
పదే పదే విజ్ఞాపనలు చేసింది,
కానీ
ప్రతిస్పందన[23] రాలేదు.
ప్రధానమంత్రి
ఇందిరా గాంది 1971 మార్చి
27న
తూర్పు పాకిస్తాన్ ప్రజలు
చేస్తోన్న స్వాతంత్ర్య
పోరాటానికి సంపూర్ణ మద్దతు
ప్రకటించారు. ప్రధానమంత్రి
ఇందిరా గాంధీ నేతృత్వంలోని
భారత నాయకత్వం, శరణార్ధుల
శిబిరాలలోకి చేరుతోన్న
శరణార్ధులకు శరణు ఇవ్వడం
కన్నా, జాతి
నిర్మూలనకాండకు ఒడిగట్టిన
పాకిస్తాన్ పై సాయుధ చర్య
ప్రభావవంతంగా ఉంటుందని వేగంగా
నిర్ణయం తీసుకుంది.[21]
పరిస్థితుల
ప్రాబల్యం వల్ల బహిష్కృతులైన
తూర్పు పాకిస్తాన్‌కు చెందిన
సైనిక అధికారులూ, భారత
గూఢచారి వ్యవస్థకు చెందిన
సభ్యులు, వెంటనే,
శరణార్ధుల
శిబిరాలను ముక్తి బాహిని
గెరిల్లాలను నియమించి,
తర్ఫీదు
ఇవ్వడం కోసం ఉపయోగించడం
మొదలుపెట్టారు.[24]*
*🔥యుద్ధ
పరిణామాలు🔥*
*✔️ఈ
యుద్ధం వల్ల బంగ్లాదేశ్‌కు
స్వాతంత్ర్యం లభించింది.
పాకిస్తాన్
అధ్యక్షుడు అయిన యహ్యా ఖాన్
రాజీనామా చేసాడు. ముజీబుర్
రెహ్మాన్ తిరిగి బంగ్లాదేశ్‌కు
వెళ్ళి అధికారం చేపట్టాడు.
దాదాపు
3,843 భారత
సైనికులు మృతి చెందగా 9,851
మంది
క్షతగాత్రులయ్యారు.
పాకిస్తాన్
తనకున్న నేవీలో సగభాగం,
ఎయిర్
ఫోర్స్‌లో పాతిక, దాదాపు
మూడొంతుల సైన్యాన్ని నష్టపోయింది.
90,000 పాకిస్తాన్
దేశస్తులు యుద్ధఖైదీలుగా
పట్టుబడ్డారు*.
*తూర్పు
పాకిస్తానులో ప్రాణాలు
పోగొట్టుకున్నవారి సంఖ్య
ఇదమిత్థంగా తెలీదు.
పదిలక్షల
నుండి ముప్పైలక్షల వరకు
మరణించి ఉంటారని ఆర్.జె.
రమ్మెల్
అంచనా వేసాడు.[45] ఇతర
అంచనాల ప్రకారం ఈ సంఖ్య 300,000
వరకు
ఉండవచ్చు. డిసెంబరు
14 న
ఓటమి అంచున ఉండగా,
పాకిస్తాను
సైన్యం, స్థానిక
సహచరులతో కలిసి, ఒక
పద్ధతి ప్రకారం పెద్ద సంఖ్యలో
బెంగాలీ డాక్టర్లు,
ఉపాధ్యాయులు,
మేధావులను
హతమార్చింది.[46][47]. మేధావి
వర్గానికి చెందిన హిందూ
మైనారిటీలపై జరిగిన ఊచకోతలో
భాగమే ఇది.[48][49] తిరుగుబాటు
చెయ్యగలరని భావించిన విద్యార్థులు,
యువకులు
కూడా ఈ దాడులకు గురయ్యారు*
*మొదటి
ప్రపంచ యుద్ధం తరువాత జరిగిన
అతిపెద్ద సైనిక లొంగుబాటు
ఈ యుద్ధంలోనే సంభవించింది.
యుద్ధనేరాలకు
గాను 200 మంది
ఖైదీలను విచారించాలని తొలుత
భారత్ భావించినప్పటికీ,
సంధికి
చొరవ తీసుకొనే దిశగా ఖైదీలందరినీ
విడుదల చేసేందుకు అంగీకరించింది.
ఆ మరుసటి
సంవత్సరంలో కుదుర్చుకొన్న
సిమ్లా ఒప్పందంతో యుద్ధంలో
తాను గెల్చుకున్న 15,000
చ.కి.మీ
పైచిలుకు పాకిస్తాను భూభాగాన్ని
భారత్ తిరిగి పాకిస్తానుకు
ఇచ్చివేసింది. పొరుగు
దేశాలను ఆక్రమించుకొనే ఉద్దేశం
లేదన్న సూచనగాను,
పాకిస్తానుతో
చిరకాల శాంతిని నెలకొల్పేందుకుగానూ
భారత్ ఈ ఒప్పందం కుదుర్చుకుంది*.
No comments:
Post a Comment