ఇళ్లలో ఉండే ట్యూబ్‌లైట్‌ను మాటిమాటికీ వేసి, ఆర్పితే జీవితకాలం తగ్గిపోతుందంటారు. ఎందువల్ల?
*ఇళ్లలో
ఉండే ట్యూబ్‌లైట్‌ను మాటిమాటికీ
వేసి, ఆర్పితే
జీవితకాలం తగ్గిపోతుందంటారు.
ఎందువల్ల?*
✳మామూలు
విద్యుత్ బల్బులలో ఫిలమెంట్
వేడెక్కడం వల్ల కాంతి
ప్రసరిస్తుందనే విషయం తెలిసిందే.
ట్యూబ్‌లైట్లో
అలా జరగదు. పొడవైన
గొట్టాల ఆకారంలో ఉండే ఈ లైట్లలో
పాదరసపు వాయువు(mercury
vapour) నింపుతారు.
ఈ వాయు
కణాలు విద్యుత్‌శక్తితో
ప్రేరేపింపబడి అయనీకరం
చెందుతాయి. అప్పుడు
ఏర్పడిన వికిరణాల మూలంగా
కాంతి ఉత్పన్నమవుతుంది.
ఈ వికిరణాలు
కంటికి కనిపించని అతినీలలోహిత
కిరణాలు (ultra violet
rays). ఈ
కిరణాలు ట్యూబ్‌లైట్ గొట్టం
లోపలి గోడలపై పూసిన ఫాస్పర్
పూతపై పడి కంటికి కనిపించే
కాంతిగా మారి ఆ ప్రాంతమంతా
ప్రసరిస్తుంది.
ఇలా
వాయువు అయనీకరణం చెందాలంటే
అత్యధిక విద్యుత్ వోల్టేజి
అవసరమవుతుంది.
ఇది
ట్యూబ్‌లైట్ స్టార్టర్,
చోక్‌ల
ద్వారా అందుతుంది.
ఒకసారి
అయనీకరణం చెందాక ఆపై తక్కువ
వోల్టేజి సరిపోతుంది.
అందువల్ల
స్టార్టర్,
చోక్‌ను
కటాఫ్ చేస్తుంది.
ఈ నేపథ్యంలో
మాటిమాటికీ ట్యూబ్‌లైట్‌ను
స్విచాన్,
స్విచాఫ్
చేస్తుంటే ప్రతిసారీ అధిక
వోల్టేజి అవసరమవడంతో అందులోని
వాయువు అయనీకరణం చెందే
ప్రక్రియకు తరచు అంతరాయం
ఏర్పడుతుంది.
అందువల్ల
ట్యూబ్‌లైట్ జీవితకాలం
తగ్గిపోతుంది.
No comments:
Post a Comment