*🔥అత్యవసర పరిస్థితి రద్దు🔥*
*🟣జాతీయ
అత్యవసర పరిస్థితిని గరిష్ట
కాలపరిమితి లేదు.
పార్లమెంటు
తీర్మానంతో ఎంతకాలమైన
పొడిగించవచ్చు.
రాష్ట్రపతి
ఒక ప్రకటన ద్వారా ఎప్పుడైనా
రద్దు చేయవచ్చు .44వ
రాజ్యాంగ సవరణ అనుసరించి
లోక్సభలోనే 1/10
వ వంతు
సభ్యుల సహకారాలతో అత్యవసర
పరిస్థితి రద్దు కోరుతూ ఒక
నోటీసును లోక్సభ స్పీకర్
చేయవచ్చు*.
*🔥రాష్ట్రపతి
పాలన (356వ
నిబంధన )🔥*
*🔸రాష్ట్రంలో
రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు
రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిన
పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం
యొక్క అన్ని దేశాల మేరకు
రాష్ట్రపతి పాలన బాధ్యతలను
అత్యవసర పరిస్థితి ద్వారా
నిర్వహిస్తారు .రాష్ట్రపతి
పాలన విధిస్తూ రాష్ట్రపతి
ప్రకటనను ఉభయసభలు సాధారణ
మెజారిటీతో ఆమోదించాలి రాజ్యసభ
లోక్సభల్లో ఏ ఒక్క సభ రాష్ట్రపతి
ప్రకటనను ఆమోదించకపోతే
రాష్ట్రపతి పాలన ప్రకటన
రద్దవుతుంది..రాష్ట్రంలో
విధించబడిన రాష్ట్రపతి పాలన
కాలపరిమితి ఆరు నెలలు.
గరిష్ట
కాలపరిమితి ఆరు నెలలు*
.
*🔥ఆర్థిక
అత్యవసర పరిస్థితి (360
వ నిబంధన)🔥*
*🥀దేశంలో ఆర్థిక పరిస్థితులు బాగా లేనప్పుడు ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని రాష్ట్రపతి భావించి ఆర్థిక పరిస్థితిని ప్రకటించవచ్చు ఆర్థిక అత్యవసరపరిస్థితిని ప్రవేశపెట్టిన తర్వాత రెండు నెలల లోపు పార్లమెంటు ఉభయసభల ఆమోదం పొందాలి*.
*🥀ఉభయ సభల భిన్నాభిప్రాయాలు నేపథ్యంలో అత్యవసర పరిస్థితి రద్దు అవుతుంది.ఆర్థిక అత్యవసర పరిస్థితి కాలపరిమితి ఆరు నెలలు పార్లమెంటు తీర్మానం ద్వారా మరో ఆరు నెలలు పొడిగించవచ్చు దీనికి గరిష్ట కాలపరిమితి లేదు*.
*🔥రాష్ట్రపతి
వీటో అధికారాలు🔥*
*🔥నిరపేక్ష(Absolute)
వీటో🔥*
*🎀నిబంధన 111 ప్రకారం రాష్ట్రపతి పార్లమెంటు ఆమోదించిన బిల్లును ఆమోదించడం లేదా రద్దు చేయడం జరుగుతుంది.కేబినెట్ ఆమోదం పొందిన ప్రభుత్వ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపబడి రాష్ట్రపతి ఆమోదించక ముందే మంత్రి మండలి రాజీనామా చేస్తే కొత్త మంత్రి మండలి ఆ బిల్లును ఆమోదించవద్దని రాష్ట్రపతికి సలహా ఇచ్చినప్పుడు కొన్ని బిల్లులు రాష్ట్రపతి ఈ అధికారాన్ని వినియోగించుకోవచ్చు.
*🔥క్వాలిఫైడ్
వీటో🔥*
*🥀పార్లమెంటు చేత ఆమోదించబడిన బిల్లు రాష్ట్రపతి ఆమోదానికి పంపితే ఆ బిల్లును రాష్ట్రపతి తిరస్కరిస్తే రెండవ పర్యాయం అదే బిల్లును రెండు/ మూడు వంతుల మెజారిటీతో ఆమోదం పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి .ఆ తరహా విటో అధికారం భారత రాష్ట్రపతికి లేదు .ఈ అధికారం అమెరికా అధ్యక్షునికి ఉంది*.
*🔥తాత్కాలిక వీటో🔥*
*🔸పార్లమెంట్ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపితే ఆయన దానిని పునః సమీక్షించమని కోరవచ్చు దీనిని తాత్కాలిక వీటో అంటారు*.
*🔥పాకెట్
విటో🔥*
*🔹పార్లమెంట్ ఆమోదించిన బిల్లు రాష్ట్రపతి ఆమోదం తెలిపితే చట్టం అవుతుంది ఆమోదం తెలుపు తన దగ్గరే నిలిపి వేసి దానిని పాకెట్ వీటోఅంటారు .రాష్ట్రపతి వీటో చేయడానికి అవకాశం లేని బిల్లులు:రాజ్యాంగ సవరణ బిల్లు ద్రవ్య బిల్లు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు*
No comments:
Post a Comment