Saturday, April 11, 2020

సోషల్ మొబిలిటీ సూచీలో భారత్‌కు 76వ స్థానం


*📝సోషల్ మొబిలిటీ సూచీలో భారత్‌కు 76వ స్థానం📝*



🍁వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 82 దేశాలతో రూపొందించిన ఈ సూచీలో డెన్మార్క్ అగ్రస్థానం నిలిచింది. ఆర్థిక, సామాజిక నేపథ్యంతో పనిలేకుండా అందరూ పూర్తి స్థాయిలో ఎదిగేందుకు సమాన అవకాశాలు ఏ దేశంలో ఎంత మేర లభిస్తున్నాయన్నది తెలిపేందుకు ఈ సూచీ ఉపయోగపడుతుంది. ప్రధానంగా విద్య, వైద్యం, టెక్నాలజీ తదితర 5 అంశాల ప్రాతిపదికన దీన్ని లెక్కిస్తారు.సోషల్ మొబిలిటీ విషయంలో మెరుగైన ప్రదర్శన కనబరిస్తే అత్యధికంగా లాభపడే దేశాల్లో చైనా, అమెరికా తర్వాత భారత్ కూడా ఉంటుందని సంబంధిత నివేదికలో డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది.



సోషల్ మొబిలిటీ సూచీ 2020ర్యాంకుదేశం1డెన్మార్క్2నార్వే3ఫిన్‌లాండ్4స్వీడెన్5ఐస్‌లాండ్27అమెరికా45చైనా59}లంక76భారత్77దక్షిణాఫ్రికా78బంగ్లాదేశ్79పాకిస్థాన్80కామెరూన్81సెనెగల్82కోట్ డి ఐవోరీ


No comments:

Post a Comment