Friday, April 10, 2020

భారత ఎన్నికల కమిషను

*🔥భారత ఎన్నికల కమిషను🔥*

*ఎన్నికల నిర్వహణ సంస్థ*

*స్వతంత్ర భారత దేశంలో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగం ఏర్పాటు చేసిన సంస్థ, భారత ఎన్నికల కమిషను. 1950 జనవరి 25 👌న ఏర్పాటు చేయబడిన ఈ కమిషను సుప్రీం కోర్టు వలెనే, రాజ్యాంగం ఏర్పరచిన స్వతంత్ర వ్యవస్థ, ప్రభుత్వ నియంత్రణకు లోబడి ఉండదు*.

*🔥భారత రాష్ట్రపతి🔥*


*💐సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమైన భారత దేశానికి దేశాధినేత రాష్ట్రపతి (Rashtrapati / President). రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు, సర్వ సైన్యాధ్యక్షుడు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి కార్యనిర్వాహక దేశాధినేత. శాసన విభాగమైన పార్లమెంటు ఉభయ సభల్ను రాష్ట్రపతి సమావేశపరుస్తారు, ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రిని నియమిస్తారు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు. అయితే, వాస్తవానికి కార్యనిర్వాహక అధికారాలన్నీ ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రివే. ప్రధానమంత్రి సలహా మేరకే, రాష్ట్రపతి సంతకంతో ఉత్తర్వులు జారీ అవుతాయి. రాష్ట్రపతి పదవి అలంకార ప్రాయమైనది*.


*🔥ఉప రాష్ట్రపతి🔥*


*ఉప రాష్ట్రపతి భారత ప్రభుత్వంలో రెండో అత్యున్నత స్థానం. భారత రాజ్యాంగంలోని 63 వ అధికరణంలో ఉప రాష్ట్రపతి పదవి గురించిన ప్రస్తావన ఉంది. ఈ పదవికి సంబంధించి భారత్ కు ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోని మరే పెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోను లేని అంశం ఇది. పెద్ద ప్రజాస్వామ్యాలలో, అమెరికాలో మాత్రమే ఈ పదవి ఉంది. అయితే భారత్, అమెరికాలలో ప్రజాస్వామ్య విధానాలు వేరు (భారత్‌లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యము, అమెరికాలో అధ్యక ప్రజాస్వామ్య పద్ధతి ఉన్నాయి) కనుక, ఉప రాష్ట్రపతి విధులకు, అమెరికా ఉపాధ్యక్షుడి విధులకు చాలా తేడా ఉంది*


*🔥భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు🔥*


*💐భారత ప్రధాన న్యాయస్థానంను సుప్రీం కోర్టుగా పిలుస్తారు. 1950 జనవరి 26 న భారతదేశం రిపబ్లిక్ జననం తర్వాత 42 మంది భారతదేశం యొక్క (సిజెఐ) (చీఫ్ జస్టిస్) ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు.[1] సుప్రీం కోర్టులో పనిచేసిన ప్రధాన న్యాయమూర్తులు వారి జాబితా క్రింద పొందు పరచడమైనది*.
*భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రథమం (సిజెఐ) గా హరిలాల్ జె. కనియా ఉండగా, 2014 సెప్టెంబరు 28 న అధికారికంగా భారతదేశం యొక్క ప్రధాన న్యాయమూర్తిగా హెచ్ ఎల్ దత్తు నియమితులైనారు. ప్రస్తుత అధికారంలో లేని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ వై వి. చంద్రచూడ్ దీర్ఘకాలం (1978 ఫిభ్రవరి 22 నుండి 1985 జూలై 1 వరకు) పనిచేశారు.ప్రస్తుతం భారతదేశం యొక్క ప్రధాన న్యాయమూర్తిగా టి.ఎస్.టక్కర్ నియమితులైనారు*




*🔥శాసనసభ🔥*


*🥀ప్రతి రాష్ట్రానికి ప్రజలు ఎన్నుకునే సభ్యులతో కూడిన ఒక సభ ఉంటుంది. దీన్ని శాసనసభ లేదా విధానసభ అంటారు. కొన్ని రాష్ట్రాల్లో రెండు సభలుంటాయి. ఈ రెండో సభను శాసనమండలి అంటారు. రాజ్యాంగం ప్రకారం ఏ రాష్ట్రం లోనైనా శాసనసభలో 500 కంటే ఎక్కువ కాకుండాను, 60 కంటే తక్కువ కాకుండాను స్థానాలు ఉండాలి*.

No comments:

Post a Comment