Friday, April 10, 2020

🔳జాతీయ పార్టీని ఎలా గుర్తిస్తారు?

🔳జాతీయ పార్టీని ఎలా గుర్తిస్తారు?

భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ

జాతీయ పార్టీని ఎలా గుర్తిస్తారు?

1. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని కొన్ని అంశాలు తెలపండి.: * పార్టీలువారు లేదా అభ్యర్థులు జాతి, కుల, మత పరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించరాదు.* అభ్యర్థుల వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావించరాదు, వ్యక్తిగత దూషణలు చేయరాదు.* పాఠశాలలు, దేవాలయాలు, చర్చి, మసీదుల్లో ఎన్నికల ప్రచారం నిషేధం.* పోలింగ్‌ స్టేషన్‌కు 100 మీటర్ల పరిధిలో ప్రచారం చేయరాదు.* సమయం ముగిసిన తర్వాత కూడా ప్రచారం చేయరాదు.* ఓటింగు కోసం ఓటర్లను తీసుకురావడం, తీసుకుని వెళ్లడం చేయకూడదు.* అనుమతి లేకుండా ఇతరుల ఇళ్లపై బ్యానర్లు, జెండాలు కట్టరాదు.* ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలిగించరాదు.

జాతీయ పార్టీని ఎలా గుర్తిస్తారు?



2. ఎన్నికల సంఘం నిర్వర్తించే విధుల ఏవి?: * ఎన్నికలు స్వేచ్ఛ, స్వతంత్ర వాతావరణంలో జరిగేటట్లు చూడటం. * పునర్విభజనకు సంబం ధించిన చట్టాల ప్రకారం నియోజకవర్గాల భౌగోళిక పరిధిని నిర్ణయించడం. * ఎన్నికల షెడ్యూలును ప్రకటించడం. * నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, పోలింగ్‌ తేదీల ఖరారు. * రాజకీయ పార్టీలను గుర్తించడం, గుర్తులను కేటాయించడం. * ఎన్ని కల సమయంలో పార్టీలు పాటించాల్సిన ఎన్నికల నియమావళిని రూపొందించి అమలు చేయడం. * ఎన్నికల సిబ్బందిని నియమించడం. * ఎన్నికలకు సంబంధించి రాష్ట్రపతి, గవర్నర్‌లకు సూచనలు ఇవ్వడం.


No comments:

Post a Comment