Friday, April 10, 2020
స్వాతంత్ర్యము, 1947 - 1950 మధ్య పరిణామాలు
*🔷చివరి
బ్రిటీష్ గవర్నర్ జనరలైన
విస్కౌట్ లుయీస్ మౌంట్బాటెన్
1947 జూన్
3 న
బ్రిటీష్ ఇండియాని లౌకిక
భారత దేశంగాను,
ఇస్లామిక్
పాకిస్తాన్ గాను విభజిస్తున్నట్లు
ప్రకటించారు.
1947 ఆగస్టు
14న
పాకిస్తాన్, 1947
ఆగస్టు
15 న
భారత దేశం స్వతంత్ర దేశాలుగా
అవతరించాయి.
స్వాతంత్ర్యానంతరం
హిందూ ముస్లిం ల మధ్య తీవ్ర
మతఘర్షణలు తలెత్తాయి.
అప్పటి
భారత ప్రధాని నెహ్రూ,
ఉపప్రధాని
వల్లభాయ్ పటేల మౌంట్బాటెన్
ని గవర్నర్ జనరల్ గా కొనసాగవలసిందిగా
కోరారు. 1948 లో
అయన స్థానంలో చక్రవర్తి
రాజగోపాలాచారి గవర్నర్ జనరల్
గా నియమితులైనారు.
565 సంస్థానాలని
భారతదేశంలో విలీనం చేసే
బాధ్యతను పటేల్ స్వీకరించారు.
ఆయన తన
ఉక్కు సంకల్పం నిజాయితీలతో
కూడిన విధానాలతో ఏకీకరణ
సాధించారు.
బలప్రయోగంతో
జూనాఘడ్,
జమ్మూ-కాశ్మీర్,
హైదరాబాద్
ఆపరేషన్ పోలో సంస్థానాల
విలీనాలు ఆయన ఉక్కు సంకల్పానికి
మచ్చుతునకలు*.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment