Friday, April 10, 2020

భారత పౌరసత్వం పొందే పద్ధతులు

*_🔥భారత పౌరసత్వం పొందే పద్ధతులు🔥_*



*_🔸1950 జనవరి 26 తర్వాత భారత దేశంలో జన్మించిన ప్రతి వ్యక్తి భారతీయ పౌరసత్వం పొందుతారు.1987 జూలై 1 తర్వాత భారతదేశంలో పుట్టిన వారు భారత పౌరసత్వాన్ని పొందాలంటే తల్లిదండ్రులలో ఎవరో ఒకరు భారతీయ పౌరుడై ఉండాలి.2004 డిసెంబర్ 3న చేసిన సవరణ ప్రకారం తల్లితండ్రులు ఇద్దరూ కూడా భారతీయ పౌరులు ఉంటేనే వారి పిల్లలకు భారత పౌరసత్వం వస్తుంది._*

*_🔹1950 జనవరి 26 తర్వాత మరియు 1992, డిసెంబర్ 10 లోపు భారతదేశం బయట జన్మించిన వారి యొక్క తండ్రి భారతీయ పౌరుడైనచో ఆ సంతానానికి భారతీయ పౌరసత్వం వస్తుంది.కొన్ని వర్గాల వారు భారత ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వాన్ని పొంది ఉంటారు వారి రిజిస్ట్రేషన్ సంబంధిత అధికారి ముందుకు జరిగి ఉండాలి_*.

*_🔸భారత పౌరసత్వం పొందిన నియమ నిబంధనలకు లోబడి విదేశీయులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి లభిస్తుంది.ఇతర భూభాగాలు మన దేశంలో విలీనం చెందినప్పుడు ఆ ప్రాంతంలో నివసించే ప్రజలకు మన దేశ పౌరసత్వం లభిస్తుంది_*.


No comments:

Post a Comment