Friday, April 10, 2020

బెంగాల్ గవర్నర్ జనరల్స్


*🔥బెంగాల్ గవర్నర్ జనరల్స్🔥*



*🔥వారన్ హేస్టింగ్స్ (1772- 1785)🔥*



*🔸1772 లో బెంగాల్ గవర్నర్ .బెంగాల్లో ద్వంద పరిపాలన ను రద్దు చేశాడు (1772). 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం తొలి గవర్నర్ జనరల్ గా నియమితుడయ్యాడు.ఈ చట్టం ద్వారా కలకత్తాలో సుప్రీం కోర్టును ఏర్పాటు చేశారు.1775 లో నందకుమార్ ను ఉరి తీయించాడు 1784లో సర్ విలియం జోక్స్ ఏషియాటిక్ సొసైటీ బెంగాలీలో స్థాపించాడు*.



*🔥లార్డ్ కారన్ వాలిస్ (1726- 1793 ):🔥*



*🔹ఈయన భారతీయ సివిల్ సర్వీసు పితామహుడిగా ప్రసిద్ధి చెందాడు. పోలీసు వ్యవస్థను ప్రవేశ పెట్టాడు. కోర్టులకు అందరి బాధ్యత వహించే విధంగా చట్టంలో మార్పులు చేశాడు.1793 లో (బెంగాల్ మరియు బీహార్ల)లో శాశ్వత శిస్తు నిర్ణయ విధానం ప్రవేశ పెట్టాడు రెవెన్యూ పరిపాలన మరియు న్యాయ పరిపాలన వేరు చేశాడు*.



*🔥సర్ జాన్ షోర్ (1793- 1798 ):🔥*



*🔸1793 లో శాశ్వత శిస్తు నిర్ణయ పద్దతి ప్రవేశపెట్టడంలో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అధ్యక్షుడిగా కీలక పాత్ర పోషించాడు 1793 లో చార్టర్ చట్టం రూపొందించాడు.1795 బాలిక శిశు హత్యలు నిరోధానికి చట్టం రూపొందించాడు*.



*🔥లార్డ్ వెల్లస్లీ (1798 -1805) :🔥*



*🔹బెంగాల్ టైగర్ గా ప్రసిద్ధి చెందాడు.1794లో ట్రేడ్ బోర్డును ఏర్పాటు చేశాడు భారత్లో సైన్య సహకార విధానాన్ని అమలు చేశాడు .సైనిక సహకార పద్ధతి లో చేరిన మొదటి సంతానం హైదరాబాద్.1799లో నాలుగవ మైసూరు యుద్ధంలో టిప్పుసుల్తాన్ ను ఓడించి మైసూర్లో చాలా భాగాలు ఆక్రమించాడు.ప్రెస్ పై నియంత్రణ చట్టం వేశాడు.పోర్టు విలియమ్స్ కాలేజీ స్థాపించాడు అందులో హిందూస్థాని భాషల విభాగం అధిపతిగా జాన్ గిల్క్రిస్ట్ నునియమించాడు.1799 అక్టోబర్ 25న తంజావూరు పరిపాలన మరియు 1800 మార్చిలో సూరత్ పరిపాలన మరియు 1801 జూలై 31న కర్ణాటక పరిపాలన బాధ్యతలు స్వీకరించాడు.1802లో బెస్సీన్ తో సైన్య సహకార ఒప్పందం మరియు 1803 5లో ఆంగ్లో- మరాఠా యుద్ధాలు జరపడంతో సింధియా మరియు హోల్డర్స్ లు ఓడిపోయారు. కర్ణాటక మరియు తంజావూరు రాజ్యాలను కూలదోసిన అనంతరం మద్రాసు ప్రెసిడెన్సీలో ఏర్పాటు చేశాడు 1803లో లార్డ్ ఆధ్వర్యంలో ఢిల్లీ మరియుఆగ్రాను ఆక్రమించాడు*.



*🔥జార్జి బార్లో (1805- 1807)🔥*



*🔸1806 వేలూరు ముట్టడి. రెండవ ఆంగ్ల-మరాఠా యుద్ధం పరి సమాప్తం*.



*🔥లర్డ్ మింటో- 1 (1807 -1813 )🔥*



*🔹1809 రంజిత్ సింగ్ తో అమ్రిత్సర్ ఒప్పందం. ట్రావెన్కోర్ లో తిరుగుబాటు*.



*🔥మార్కేస్ట్ హేస్టంగ్స్ (1813 -1823)🔥*




*🔸1814 -1816 మధ్యలో ఆంగ్లో నేపాల్ యుద్ధాలు. 1818లో ముంబై ప్రెసిడెంట్ ను ఏర్పాటు చేశాడు.మరాఠా లో బ్రిటిష్ వాళ్లను అణచివేశాడు 1820లో మద్రాసు గవర్నర్ ఆధ్వర్యంలో రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు 1822లో బెంగాల్ కౌలుదారు చట్టం రూపకల్పన.1823 లో ఫోర్ట్ గ్లోస్టర్ లో తొలిసారి కాఫీ తోటలు పెంపకం ప్రారంభం.చార్ లాటన్ మరియు రాబర్ట్ బ్రూస్ ల సహాయంతో అస్సాంలో తేయాకు తోటల పెంపకం.*



No comments:

Post a Comment