క్విట్ ఇండియా
*🔥క్విట్
ఇండియా🔥*
*💐భారతీయులను
రెండవ ప్రపంచ యుద్ధంలోకి
పంపిచటానికి నిరసనగా భారతదేశ
స్వాతంత్ర్యానికి గాంధీ
ఇచ్చిన పిలుపు నందుకుని 1942
ఆగస్టులో
క్విట్ ఇండియా ఉద్యమము
ప్రారంభమైనది.యుద్ధం
ప్రారంభమైన తరువాత 1939
సెక్టెంబరు
మాసంలో వార్ధాలో జరిగిన
కాంగ్రెస్ పక్ష కార్యనిర్వహణ
సంఘ సమావేశాలలో ఫాసిజానికి
వ్యతిరేకంగా షరతులతో కూడిన
మద్ధతునిస్తూ కాంగ్రెస్
తీర్మానించింది.అందుకు
ప్రతిఫలంగా కోరిన యుద్ధానంతర
భారత స్వాతంత్ర్యయాన్ని
బ్రిటీష్ వారు త్రిరస్కరించటం
జరిగింది*.
*1942
లో ఐరోపా,
ఆగ్నేయ
ఆసియాలో ప్రతికూలించిన యుద్ధ
పరిస్ధితులలో భారత ఉపకండం
అన్యమస్కంగా యుద్ధంలో పాల్గొనటం,
బ్రిటీష్
భారత సైన్యంలో,
భారతీయులలో
పెరిగిన అసంతృప్తి బ్రిటీష్
వారిని భారతదేశాన్ని
బుజ్జగించేదుకు ప్రేరేపించాయి.
యుద్ధానంతరం
భారతీయులకు అధికార బదలాయింపుకు
ప్రతిఫలంగా యుద్ధంలో భారతీయుల
సంపూర్ణ మద్దత్తు కూడగట్టటానికి
బ్రిటీష్ వారు క్రిప్స్
ఆధ్వర్యంలో రాయబార బృందాన్ని
భారతదేశానికి పంపించటం
జరిగింది. అయితే
స్వపరిపాలనకు నిర్ధిష్ట
సమయాన్ని సూచించలేకపోవటం,
ఆధికార
బదలాయింపుకు సరైన నిర్వచనాన్ని
ఇవ్వలేక పోవటంతో పరిమితమైన
పాలనాధికారాన్ని మాత్రమే
ఇవ్వజూపిన క్రిప్స్ రాయబారం
భారత ఉధ్యమకారులకు
ఆమోదయోగ్యంకాలేదు.దీనితో
చర్చ విఫలమైనాయి.కాంగ్రెస్
క్విట్ ఇండియా ఉద్యమాన్ని
ప్రారంభించింది.
ఉద్యమం
యొక్క ముఖ్య ఉద్దేశం బ్రిటీషు
ప్రభుత్వాన్ని రెండవ ప్రపంచ
యుద్ధంలో చేసిన సహాయాన్ని
అడ్డంపెట్టుకుని బేరసారాలకి
దించడమే*.
*🌹కాంగ్రెస్
వర్కింగ్ కమిటీ 1942
ఆగస్టు
8న
క్విట్ ఇండియా తీర్మానాన్ని
ఆమోదించింది. ఆ
తీర్మానంలో కాంగ్రెస్ బ్రిటీష్
ప్రభుత్వం భారత ప్రజల కోరికలను
ఆమోదించనట్లయితే దేశవ్యాప్త
సత్యాగ్రహానికి పిలుపునిచ్చింది.
బొంబాయి
లోని గొవలియ టాంక్ మైదానంలో
(తరువాత
క్రాంతి మైదానంగా మార్చబడినది)
ఆగస్టు
8న
సత్యాగ్రహంతో చావో-బ్రతుకో
తేల్చుకోవాల్సిందిగా గాంధీ
గారు ఇచ్చిన పిలుపు ఉద్యమంమీద
ఆయన నమ్మకానికి మచ్చుతునక.
ఆ ఉపన్యాసంలో
ప్రజలను స్వతంత్ర భారత పౌరులుగా
జీవించాలని,
బ్రిటీష్
ప్రభుత్వ ఆజ్ఞలను ధిక్కరించాలని
పిలుపునిచ్చారు.
అప్పటికే
భారత-బర్మా
సరిహద్దులలో జాపాన్ సైన్య
పురోగతితో అప్రమత్తమైన
ప్రభుత్వం గాంధీని అఘాకాన్
పాలెస్లో, కాంగ్రెస్
వర్కింగ్ కమిటీని,
జాతీయ
నాయకత్వాన్ని అహ్మద్ నగర్
కోటలో బంధించింద.
కాంగ్రెస్
ని నిషేధించటంతో పాటు గాంధీ
గారి ఉపన్యాసం తరువాత 24
గంటల
లోపే దాదాపు అందరు కాంగ్రెస్
నాయకులను ప్రభుత్వం నిర్బందించింది,
వీరందరూ
యుద్ధం సమయంలో జైలు జీవితం
గడిపారు. దేశ
వ్యాప్తంగా పెద్దయెత్తున
ప్రదర్శనలు అందోళనలు జరిగాయి.
కార్మికులు
పెద్దయెత్తున సమ్మె చేసారు.
ఉద్యమంలో
పెద్దయెత్తున హింస చోటుచేసుకుంది.
భారత
విప్లవ సంఘాలు మిత్రరాజ్య
సరఫరా వ్యవస్థలమీద బాంబు
దాడులు చేశారు,
ప్రభుత్వ
ఆస్తులకు నిప్పు పెట్టారు.
కాంగ్రెస్
ముస్లింలీగ్ వంటి ఇతర రాజకీయ
శక్తుల మద్దత్తు పోందలేక
పోయినప్పటికీ పెద్దయెత్తున
ముస్లింల మద్దత్తు సంపాదించింది.
బ్రిటష
ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి
దేశ వ్యాప్తంగా లక్షమందికి
పైగా జైళ్ళకు పంపింది.
ప్రజాందోళన
మీద లాఠీ దాడి చేయటంమే కాక
అపరాధ రుసుమును విధించింది.
త్వరలోనే
ఉద్యమం నాయకత్వంలేని ఆందోళనగా
మారి అనేక ప్రాంతీయ విప్లవ
సంఘాల చేతులలోకి మళ్ళంది.గాంధీ
గారి అహింసాయుత సిద్దాంతాలకు
వ్యతిరేకంగా అనేక సంఘటనలు
చోటుచేసుకున్నాయి.
అయితే
1943 వ
సంవత్సరానికి క్విట్-ఇండియా
ఉధ్యమం నీరసించింది*
*🔥రాయల్
ఇండియన్ నేవీ తిరుగుబాటు(RIN
Mutiny)🔥*
*📚1946
ఫిబ్రవరి
18లో
ముంబాయిలో ఓడలలోను,
రేవులలోను
"రాయల్
ఇండియన్ నేవీ"లో
పనిచేసే భారతీయ నావికుల సమ్మె,
తదనంతర
తిరుగుబాటు,
రాయల్
ఇండియన్ నేవీ తిరుగుబాటు
(RIN Mutiny) గా
పిలువబడ్డాయి.
ముంబయి
రేవులో మొదలైన తిరుగుబాటు
కరాచీ నుండి కలకత్తా వరకు
వ్యాపించింది.
ఇందులో
78 ఓడలు,
20 రేవులు,
20వేల
నావికులు పాలు పంచుకున్నారు*.
*🔷నావికాదళంలోని
సాధారణ పరిస్థితులు,
భోజన
సదుపాయాల కారణంగా మొదలైన ఈ
సమ్మెకు, బ్రిటిషు
అధికారుల జాతి వివక్ష,
జాతీయ
వాద సమర్ధకులపై క్రమశిక్షణా
చర్యలు అంతర్వాహినులుగా
ఉన్నాయి. 18న
మొదలైన ఈ సమ్మెకు,
19 సాయంత్రానికల్లా
"కేంద్ర
నావికా సమ్మె కమిటీ"
ఎన్నికయింది.
సిగ్నల్
మాన్ లలో ముఖ్యుడైన ఎం.
ఎస్.
ఖాన్
అధ్యక్షుడిగాను,
పెట్టీ
ఆఫీసర్ టెలిగ్రాఫిస్టు మదన్
సింగ్ ఉపాధ్యక్షుడిగాను
ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.[17].
భారత
జాతీయ సైన్యపు కథనాలతో
ఉత్తేజితులైన భారతీయులు ఈ
సమ్మెకు భారీ మద్దతునిచ్చారు.
పలు
ప్రదర్శనల ద్వారా ఈ తిరుగుబాటుకు
మద్దతు లభించింది.
వీటిలో
బోల్షివిక్-లెనినిస్ట్
పార్టీ ఆఫ్ ఇండియా,
సిలోన్
అండ్ బర్మా వారి పిలుపుతో
జరిగిన ఒక రోజు ముంబయ్ సార్వత్రిక
సమ్మె కూడా ఒకటి.
ఈ సమ్మె
ఇతర నగరాలకు వ్యాపించింది.
వాయుసేన,
ఆయా
నగరాల ప్రాంతీయ పోలీసులు
కూడా సమ్మెలో దిగారు.
నావికాదళ
సభ్యులు తమను తాము "భారత
జాతీయ నావికాదళం"గా
ప్రకటించుకొని,
బ్రితిషు
అధికారులకు ఎడమచేతి అభివాదాలు
(సెల్యూట్)
చేయనారంభించారు.
కొన్ని
చోట్ల, భారత
బ్రిటిషు సైన్యంలోని,
నాన్
కమిషన్డ్ అధికార్లు (NCOs)
బ్రిటిషు
ఉన్నతాధికార్ల ఉత్తర్వులను
బేఖాతరు చేసి ఉల్లంఘించారు.
చెన్నై,
పూనెలలోని
బ్రిటిష్ సైనిక శిబిరాలలో
సైతం తిరుగుబాటు గాలులు
వీచాయి. కరాచి
మొదలుకొని కలకత్తా వరకు భారీ
విధ్వంసకాండ జరిగింది.
ఓడలపై
మూడు జండాలు (కాంగ్రెసు,
ముస్లిం
లీగు, కమ్యునిస్టు
పార్టి ఆఫ్ ఇండియా ల),
తిరుగుబాటుదారుల
సామరస్యానికి ప్రతీకగా
ఎగురవేయబడటం ప్రఖ్యాతిగాంచింది..*
*🔥ఉద్యమాల
ప్రాధాన్యత🔥*
*💐స్వతంత్ర్య
పోరాటంలో భాగాలైన వివిధ
ఉద్యమాలు, సంఘటనల
ప్రాధాన్యం, వాటి
విజయాలు, వైఫల్యాలు
చరిత్రకారుల చర్చలో భాగం.
కొందరు
చరిత్ర కారులు క్విట్-ఇండియా
ఉద్యమాన్ని వైఫల్యంగా
భావిస్తారు. వీరు
అప్పటి బ్రిటిష్ ప్రధాని
భారతదేశాన్ని వదిలి వెళ్ళటానికి
భారతీయ సైన్యంలో ప్రబలిన
అసంతృప్తిని ముఖ్యకారణంగా
పేర్కొంటూ క్విట్-ఇండియాని
బలహీనమైన కారణంగా వర్ణించారు.
[18][19] అయితే
కొందరు భారత చరిత్రకారులు
"క్విట్-ఇండియా"
నే విజయం
సాధించిందని భావిస్తారు.
యుధ్దానంతరం
సన్నగిల్లిన బ్రిటిషు సామ్రాజ్య
ఆర్థిక, సైనిక,
రాజకీయ
వనరులతో పాటు,
క్విట్-ఇండియా
ద్వారా వ్యక్తమైన భారత ప్రజల
బలమైన వ్యతిరేకత బ్రిటీష్
ప్రభుత్వ స్థైర్యాన్ని
దెబ్బతీసిందని నిస్సందేహంగా
చెప్పవచ్చు.
అయితే
వారు 1947లో
జరిగిన అధికార బదలాయింపుకు
విప్లవ పోరాటాల పాత్రను
విస్మరిస్తారు.
ఏది
ఏమైనప్పటికీ[20][21]
కోట్లాది
ప్రజలు, చరిత్రలో
అపూర్వమైన విధంగా,
ఒక
త్రాటిపై నిలచి,
ఏకకంఠంతో
స్వాతంత్ర్యమే వారి ఏకైక
లక్ష్యమని ప్రకటించడమే
స్వాతంత్ర్యసాధనకు ముఖ్యకారణమని
విస్మరించరాదు.
ప్రతి
తిరుగుబాటు,
ఎదిరింపు
చర్యలు ఆ అగ్నికి ఆజ్యం పోశాయి.
దీనికి
తోడుగా అప్పుడే యుధ్ధపరిణామాల
నుండి తేరుకుంటున్న తమ
సామ్రాజ్యంలో,
అణచివేతకు
బ్రిటిషు ప్రజల,
సైన్యాల
మద్దతు లేకపోవటం కూడా ఒక
కారణం*.
No comments:
Post a Comment