Friday, April 10, 2020

*🔥అంతిమ ఘట్టం: యుద్ధం, క్విట్ ఇండియా, ఐ.ఎన్.ఎ , యుద్ధానంతర తిరుగుబాట్లు🔥*

*🔥అంతిమ ఘట్టం: యుద్ధం, క్విట్ ఇండియా, .ఎన్., యుద్ధానంతర తిరుగుబాట్లు🔥*



*💐భారతదేశం మెత్తంమీద భారతీయులు రెండవ ప్రపంచయుద్ధంలో విభజింప బడ్డారు. ఎన్నికైన భారత ప్రతినిధులను సంప్రధించకుండా ఏక పక్షంగా బ్రిటీష్ వైస్రాయి భారతదేశం మిత్ర రాజ్యాల తరుపున యుద్ధాలోకి దుమికిందని ప్రకటించటంతో నిరసనగా మెత్తం కాంగ్రెస్ నాయకత్వం స్థానిక ప్రభుత్వ సంస్థలనుండి వైదొలిగింది. అయితే బ్రిటీష్ వారికి యుద్ధంలో సహాయ పడాలని చాలామంది భావించారు. 205,000 మంది పరివారంతో యుద్ధంలో పాల్గొన్న పెద్ద సైన్యాలలో ఒకటైన భారత బ్రిటీష్ సైన్యం ఇందుకు నిదర్శనం. బ్రిటన్ కొరకు జరిగిన పోరు సమయంలో గాంధీ సహాయ పెద్ద యెత్తున సహాయ నిరాకరణానికి పిలుపునివ్వాలని ఇంటా బైటా వచ్చిన వత్తిడులను తాను బ్రిటన్ శిథిలాలనుండి భారత స్వాతంత్ర్యయాన్ని కాంక్షించటంలేదంటూ వ్యతిరేకించారు. అయితే యుద్ధంలో మారిన జాతకాలకు అనుగుణంగా వచ్చిన రెండు ఉద్యమాలు వంద సంవత్సరాల భారత స్వతంత్ర ఉద్యమాన్ని పతాక ఘట్టానికి తీసుకు వెళ్ళాయి*.

*దీనిలో మెదటిది నేతాజీ సుభాస్ చంద్ర బోస్ నేతృత్వంలో అజాద్ హింద్ ఉద్యమము ప్రపంచ యుద్ధ మెదటి అంకంలో ప్రారంభమై అంక్షరాజ్యాల సహకారాన్ని అర్ధించింది. రెండవది 1942లో యుద్ధానంతరం అధికార బదిలీకి భారత నాయకత్వంతో ఏకాభిప్రాయానికి రావటానికి జరిగిన క్రిప్స్ రాయబారం విఫలమవటంతో ప్రారంభమైనది*



*🔥భారత జాతీయ సైన్యం🔥*



*🔶ఏకపక్షంగా జరిగిన భారత యుద్ధ ప్రవేశాన్ని 1937, 1939 లలో రెండు సార్లు కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైన సుభాస్ చంద్ర బోస్ తీవ్రంగా వ్వతిరేకించాడు. యుద్ధంలో పాల్గొనటానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ మద్దత్తుకు గట్టి ప్రయత్నం చేసి కాంగ్రెస్ నుండి బయటకి వచ్చి ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే నూతన పక్షాన్ని స్థాపించారు.యుద్ధం విరుచుకు పడటంతో బ్రిటీష్ ప్రభుత్వం అతనిని 1940లో కలకత్తాలో గృహ నిర్భందం చేసింది. ఐరోపా, ఆసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చిన సమయంలో సుభాస్ చంద్ర బోస్ తప్పించుకుని భారత జాతీయ సైన్యాన్ని సమీకరించి బ్రిటీష్ సృంఖలాల పై పోరాడటానికి అంక్ష రాజ్యాల సహకారాన్ని కోరుటకు అఫఘనిస్తాన్ మీదగా జర్మనీ చేరుకున్నారు.అచ్చట రొమ్మెల్ యొక్క పట్టుబడిన భారత బ్రిటీష్ సిపాయిలతో స్వతంత్ర పటాలాన్నిసమకూర్చుకున్నాడు. ఇదే ఫ్రీ ఇండియన్ లీజున్గా పేరొందినది. భారత విముక్తి సైన్యాన్ని స్థాపించి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడాలని మొలకెత్తుతున్న బోస్ కలలనుండి ఈ స్వతంత్ర పటాలం ఉద్భవించింది. అయితే ఐరోపాలో మారుతున్న యుద్ధ పరిణామాల కారణంగా బోస్ జపాన్ చేరి జపాన్ ఆక్రమిత ఈశాన్య ఆసియా నుండి ప్రవాస స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించి జపాన్ వారి సహకారంతో భారత జాతీయ సైన్యాన్ని స్థాపించారు. పోరాట శక్తిగా భారతదేశం చేరి ప్రజలలో తీవ్ర బ్రిటీష్ వారిపై వ్యతిరేకతను పెంచి భారత సైనికులను తిరుగుబాటుకు ప్రేరేపించి బ్రిటీష్ పాలనను అంతమొందించటం దాని ముఖ్య ఉద్దేశం*.


*🥀.ఎన్.ఎ అప్పటికి భారత బ్రిటీష్ సైన్యంతో కలసిన మిత్రరాజ్యాల మిత్రరాజ్యాల బలగాలతో జపాన్ వారి 15వ దళంతో కలిసి బర్మా, అస్సాం అడవులలో పోరాటం చేసి ఇంఫాల్, కోహిమా లను చేజిక్కించుకో వలిసి ఉంది.యుద్ధంలో జపాన్ అండమాన్ నికోబార్ దీవులను ఆక్రమించి ఐ.ఎన్.ఎకి అప్పగించటం జరిగింది.సుభాస్ చంద్ర బోస్ వాటికి షాహిద్, స్వరాజ్ అని నామకరణం చేసారు*.
*🎀అయితే ఐ.ఎన్.ఎకి జపాన్ వారినుండి సరియైన ఆయుధ సరఫరా, శిక్షణ లేనికారణంగా అపజయాల బాట పట్టింది.అంతు చిక్కని రీతిలో సుభాస్ చంద్ర బోస్ మరణించటంతో ఆజాద్-హిద్ ఉద్యమం అంత్యదశకు చేరింది. యుద్ధంలో జపాన్ లొంగు బాటుతో భారత జాతీయ సైన్యానికి చెందిన సిపాయిలను భారత దేశానికి తీసుకురావటంతో పాటు వారిలో అనేకురి పై రాజద్రోహం ఆరోపింపబడింది. అయితే ఈ అప్పటకి బోస్ సాహస కృత్యాలు, క్రియాశీల కార్యకలాపాలు ప్రజల దృష్టిలో ఆదరణ పొందటంతో దేశీయ సిపాయల విశ్వాసం బ్రిటీష రాణి పట్లనుండి దూరమై భారత జాతీయ సైన్యానికి సహకరించిన వారిగా బ్రిటీష్ వారిచే భావించబడినవారిపైకి మరలింది. భారత జాతీయ సైనికుల పై విచారణ జరపటం ద్వారా బ్రిటీష్ భారత సైన్యంలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిచవచ్చన్న బ్రిటీష్ ప్రభుత్వ భావన ఆచరణలో ఆశాంతిని రేకెత్తించి సైనికులలో బ్రిటీష్ వారికి సహకరించామనే అపరాధ భావనను రేకెత్తించింది. బోస్, భారత జాతీయ సైన్యం న్యాయం కోరకు పోరాడిన వీరులుగా యావత్తు భారత దేశం భావించటంతో బ్రిటీష్ భారత సైన్యం అన్యాయం వైపు పోరాడీన పక్షంగా పరిగణింప బడింది. ఈ పరిణామాలతో బ్రిటీష్ ప్రభుత్వ అస్థిత్వానికి వెన్నెముకైన భారత బ్రిటీష్ సైన్యం ఇంకెత మాత్రము విశ్వసింపదగినది కాదని ప్రభుత్వానికి తేటతెల్లం మయ్యింది. చివరకి ఈ పరిణామాలు ఎలా పరిణమించాయంటే సుభాస్ చంద్ర బోస్ ఆత్మ బ్రిటీష్ వారిని ఎర్రకోట బురుజులవరకూ వెంటాడిందని చెప్పటం ఆతిశయోక్తి కాజాలదు. అప్పటి కప్పుడు ఆకాశానికి ఎత్తబడిన సుభాస్ చంద్ర బోస్ వ్వక్తిత్వం బ్రిటీష్ వారిని ఆలోచనా విదానంలో గణనీయమైన మార్పుతీసుకు వచ్చి చర్చలద్వారా స్వతంత్రానికి బాటలు పరిచింది. యుద్ధం తరువాత భారత జాతీయ సైనికులపై జరిగిన విచారణలో అజాద్ హింద్ ఉద్యమం, భారత జాతీయ సైన్యం గురించిన కథలు ప్రజల్లోకి వచ్చాయి. అవి ఎంత భావోద్వేగాన్ని కలిగించాయంటే 1945లో భారత దేశంలోనే కాక ఇతర వలస రాజ్యాలలో తిరుగుబాటుకు భయపడి ప్రభుత్వం వాటి ప్రసారాన్ని నిలిపివేయవలసిందిగా బి.బి.సిని కోరింది. వార్తా పత్రికలు భారత జాతీయ సైనికులకు మరణ దండన విధించటాన్ని ప్రజలకు తెలియచెప్పాయి. తత్ఫలితంగా తరువాతి కాలంలో అనేక తిరుగుబాట్లు తలెత్తాయి. కోదరు చరిత్ర కారులు భారత జాతీయ సైన్యం, అజాద్ హింద్ ఉద్యమం చే ప్రేరణ పోదబడిన బ్రిటీష్ భారత సైన్యం భారత దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టాయని భావిస్తారు*.


No comments:

Post a Comment