Wednesday, April 8, 2020

కుతుబ్ షాహీ వంశము

*🔥కుతుబ్ షాహీ వంశము🔥*


*💐కుతుబ్ షాహీ వంశము (ఈ వంశస్థులను కుతుబ్ షాహీలు అంటారు) దక్షిణ భారతదేశము లోని గోల్కొండ రాజ్యము యొక్క పాలక వంశము. ఈ వంశస్థులు తుర్కమేనిస్తాన్-ఆర్మేనియా ప్రాంతములోని తుర్కమేన్ తెగకు చెందిన షియా ముస్లింలు*

*రాజధాని*

హైదరాబాద్


*భాష(లు)*

దక్కని, తర్వాత ఉర్దూGovernmentMonarchy - 1869-1911Mahbub Ali Khan, Asaf Jah VI

చరిత్ర
*- ఆవిర్భావం*

1518


*- పతనం*

1687




*🔥స్థాపన🔥*


*🏮కుతుబ్ షాహీ వంశ స్థాపకుడు సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్, 16వ శతాబ్దము ప్రారంభములో కొందరు బంధువులు, స్నేహితులతో కలసి ఢిల్లీకి వలస వచ్చాడు. తరువాత దక్షిణాన దక్కన్ పీఠభూమికి వచ్చి బహుమనీ సుల్తాన్ మహమ్మద్ షా కొలువులో పనిచేసాడు. అతడు గోల్కొండను జయించి హైదరాబాద్ రాజ్యానికి అధిపతి అయ్యెను. 1518లో బహుమనీ సామ్రాజ్యము పతనమై ఐదు దక్కన్ సల్తనత్ ఆవిర్భవించుచున్న సమయములో బహుమనీ సుల్తానుల నుండి స్వతంత్రము ప్రకటించుకొని, "కుతుబ్ షా" అనే పట్టము స్వీకరించి గోల్కొండ కుతుబ్ షాహీ వంశమును స్థాపించాడు*.




*🔥పరిపాలన🔥*


*🔷ఈ వంశము తెలుగు వారిని పరిపాలించిన తొలి ముస్లిం వంశము. ఇది అంధ్ర దేశమును ముస్లింలు పరిపాలి‌చిన (తెలంగాణ ప్రాంతము), హిందూ పరిపాలనలో ఉన్న ఇతర ప్రాంతములుగా విభజించింది. ఈ వంశము 1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు యొక్క సైన్యాలు దక్కన్ని జయించేవరకు, 171 సంవత్సరాలు గోల్కొండను పరిపాలించింది. ఆ తరువాత 1948లో హైదరాబాదు రాజ్యము, న్యూఢిల్లీ యొక్క సైనిక జోక్యం (పోలీసు చర్య) తో భారత దేశములో విలీనము అయ్యేవరకు ముస్లింల పరిపాలనలోనే ఉంది*.
*కుతుబ్ షాహీ పాలకులు గొప్ప కళా, శాస్త్ర పోషకులు. వీరు పర్షియన్ సంస్కృతిని పోషించడమే కాకుండా, ప్రాంతీయ దక్కన్ సంస్కృతికి చిహ్నమైన తెలుగు భాష, కొత్తగా అభివృద్ధి చెందిన ఉర్దూ (దక్కనీ) ను కూడా పోషించారు. తెలుగు ప్రాంతమైన తెలంగాణ గోల్కొండ రాజ్యములో ఒక ప్రముఖ భాగమైనందున, వాళ్ల మాతృ భాష కాకపోయినా, గోల్కొండ పాలకులు తెలుగు భాష అభ్యసించారు. గోల్కొండ, ఆ తరువాత హైదరాబాదు రాజ్యమునకు రాజధానులుగా ఉండేవి, ఉభయ నగరములును కుతుబ్ షాహీ సుల్తానులే అభివృద్ధి చేశారు*.

*🔥వంశ క్రమము🔥*


*వంశము యొక్క ఎనిమిది రాజులు క్రమముగా:*


సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ (1518-1543)
జంషీద్ కులీ కుతుబ్ షా (1543-1550)
సుభాన్ కులీ కుతుబ్ షా (1550)
ఇబ్రహీం కులీ కుతుబ్ షా (1550-1580)
మహమ్మద్ కులీ కుతుబ్ షా (1580-1612)
సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా (1612-1626)
అబ్దుల్లా కుతుబ్ షా (1626-1672)
అబుల్ హసన్ కుతుబ్ షా (1672-1687)

No comments:

Post a Comment