మాట్లాడేటప్పుడు ఊపిరి పీల్చుకోవడం సాధ్యం కాదు. ఎందుకని?
*🗣మాట్లాడేటప్పుడు ఊపిరి పీల్చుకోవడం సాధ్యం
కాదు. ఎందుకని?*
✳మాట్లాడ్డం
అంటేనే వూపిరిని బయటకు వదిలే
నిశ్వాస (expiration)
ప్రక్రియకు
ధ్వని కూడా తోడవడమే.
గొంతులో
ఉన్న శ్వాసపథ (lerynx),
ఆహారపథ
(pharynx) కలిసే
చోట శబ్ద పేటికలు (vocal
chords) ఉంటాయి.
ఆ శబ్ద
పేటికల కంపనమే శబ్దం.
అది తన
కంపనాలను నిశ్వాసంలో వూపిరితిత్తుల
నుంచి బయట పడుతున్న గాలిలోకి
నింపుతుంది. ఇలా
శబ్ద కంపనాలను నింపుకున్న
గాలి కంపనాలను భాషకు అనుకూలంగా
గొంతు, అంగిటి,
నాలుక,
దవడలు,
పలువరుస,
పెదాలు,
ముక్కు
సమన్వయం చేసుకుంటూ మాటల రూపంలో
వ్యక్తం చేస్తాయి.
మాటకు,
మాటకు
మధ్య లేదా వాక్యానికి,
వాక్యానికి
మధ్య మనం గాలిని లోపలకి
పీల్చుకుంటామే తప్ప మాట్లాడే
క్రమంలోనే ఉచ్ఛ్వాసం(inspiration)
చేయడం
చాలా కష్టం.
No comments:
Post a Comment