పాము
*పాముకి
చెవులుండవంటారు.
అయితే
అవి వినగలవని విన్నాను.
పాము
పాలు తాగదంటారు కానీ దాని
నోరు తెరిచి దారం ద్వారా
పట్టడం గమనించాను.
పాము
కాటు వేస్తే ముంగిసకు విషం
ఎక్కదా? వాటి
పోరాటంలో పాము గెలవదా?*
✳పాముకి
చెవులుండవంటే దానర్థం వినడానికి
ఉపయోగపడే బాహ్య అవయవాలు
దానికుండవని.
కేవలం
లోపలి చెవి భాగాల రూపాలుంటాయి
కానీ అవి పని చేయవు.
కేవలం
పొట్ట చర్మం ద్వారానే పాములు
శబ్దాలను గ్రహిస్తాయి.
ఇక
పగపట్టేంత తెలివి తేటలు,
జ్ఞాపకశక్తి
వాటికి లేవు.
పాము
నోటి నిర్మాణం ద్రవాలను
పీల్చుకునేందుకు వీలుగా
ఉండదు. అందుకే
దారం ద్వారా పాలు పడతారు.
ఇది దాని
నైజానికి విరుద్ధం కాబట్టి
పాలు పోస్తే వాటికి ప్రమాదం
కల్గించినట్టే.
విషపూరితమైన
పాము కాటేస్తే ముంగిసకే కాదు,
ఏ జంతువుకైనా
విషం ఎక్కాల్సిందే.
పిల్లీఎలుకల్లాగా
పాము, ముంగిసలు
ప్రకృతి సిద్ధమైన శత్రువులు
కావు. అనుకోకుండా
తారసపడితే గొడవపడవచ్చు.
ఆ గొడవలో
ఎవరికి పెద్ద గాయమైందనే
విషయాన్ని బట్టి ఓసారి పాము,
మరోసారి
ముంగిస చనిపోవచ్చు.
ఎక్కువ
సార్లు ఇవి సర్దుకుని
పారిపోతుంటాయి.
మనలో
మూడు రకాల చెవులు కనబడతాయి
-మనకు
కనిపించే చెవినే బాహ్మచెవి
అంటారు--కర్ణభేరి
వెనకాల మధ్య చెవి వుంటుంది.
ఇందులో
మాలియస్, ఇన్‌కస్,
స్టేపిస్
అనే మూడు చిన్న ఎముకల గొలుసు
ఉంటుంది.స్టేపిస్
వెనకాల మొత్తని మృదులాస్థితో
నిర్మించబడిన లోపలి చెవి
కనిపిస్తుంది.
దీనినే
'త్వచా
గహనము' అంటారు.దీనినుండి
బయలుదేరిన శ్రవణనాడి మొదడును
చేరుకుంటుంది.
శబ్ద
తరంగాలను చేరవేస్తుంది.ఆ
శబ్దాన్నే మనం వినగలుగుతాము.
పాములకు
వెలుపలి చెవులులేవు .
వెలుపలి
చెవులు అదృశ్యమైన చోట 'కర్ణభేరీ
రంధ్రం' అనే
ఒక రంధ్రం ఉంటుంది.
అది మధ్య
చెవిలోకి దారితీస్తుంది.
మధ్య
చెవిలో 'కాలుమెల్లా
ఆరిస్' అనబడే
'కర్ణస్తంభిక'
అనే ఒక
ఎముక ఉంటుంది.
ఈ
కర్ణస్తంభిక ఒకవైపు లోపలి
చెవికి కలుపబడితే...మరో
వైపు చర్మానికి కలిసి ఉంటుంది.
పాము
చర్మం నేలను తాకి ఉండడం వల్ల
నేలలో ప్రయాణించే ధ్వని
తరంగాలు మాత్రమే కర్ణస్తంభిక
గ్రహించి లోపలి చెవికి
చేరగలుగుతుంది.
అందువల్ల
నేలలోని తరంగాలు మాత్రమే అది
గ్రహించగలుగుతుంది.గాలిలో
తరంగాలు అది గ్రహించలేదు.
గాలిలోని
శబ్ద తరంగాలు అది ఏమాత్రం
గ్రహించలేదు.నాగస్వరానికి
ఊగుతున్న నాగుల్లా...అంటూ
పడగవిప్పి నాగస్వరం ముందు
ఆడే పాముల్ని చూపిస్తున్నారు
అంతా అబద్ధమే.
పాములవాడు
నాగస్వరం ఊదేముందు నేలమీద
చేతితో చరుస్తాడు.
నేలద్వారా
శబ్దతరంగాలు అందుకున్న
నాగుపాము పడగవిప్పుతుంది.దాని
కళ్ళముందు ఓ వస్తువు ఊగుతూ
కనిపిస్తోంది.
అది ఆగిన
వెంటనే దానిని కాటు వేయాలని
పాము చూస్తుంది.
అందుకే
అది ఎటు ఊగితే నాగుపాము పడగ
అటు ఊగుతుంది.
అంతేకానీ...
నాగ
స్వరానికి తల ఊపి ఆడడం మాత్రం
కాదు.నాగస్వరం
కాకుండా ఏది దానిముందు ఊపినా
పడగ తప్పకుండా ఊపుతుంది.
ఓ గుడ్డ
చేతితో ఆడించి చూపినా పాము
పడగ ఊపుతూనే వుంటుంది.
నాగస్వరమే
ఉండనక్కరలేదు.
నాగస్వరానికి
నాగుపాము తలాడించడం అంతా
వట్టిదే. నేలపై
తరంగాలను మాత్రమే గుర్తించగలదన్నది
నిజము .
అందుకే...అతి
సున్నితమైన శబ్దాన్ని వినగలిగిన
సామర్థ్యమున్న వాళ్ళని
ఇప్పటికీ ''పాముచెవులు''
వున్న
వాళ్ళని అంటారు.
కనుకనే
''పాముచెవులు''
అనే మాట
ప్రసిద్ధి చెందింది.
No comments:
Post a Comment