Friday, April 10, 2020

స్వతంత్ర భారతదేశం (1947 - 1977)


స్వతంత్ర భారతదేశం (1947 - 1977)



1. భారత ప్రజాస్వామ్యాన్ని అత్యవసర పరిస్థితి ఏ విధంగా వెనక్కి తీసుకెళ్లింది?: * శాంతిని కాపాడాలనే పేరుతో అత్యవసర పరిస్థితిలో ప్రభుత్వం ప్రజల హక్కులకు నష్టం కలిగించే అనేక చట్టాలను తీసుకువచ్చింది.* ప్రాథమిక హక్కులను నిలిపివేశారు.* కారణం లేకుండా అరెస్టులు, అకారణంగా హింసించడం లాంటి అనేక సంఘటనలు జరిగాయి.* ఈ సమయంలో ధరల నియంత్రణ, నల్లబజారు, వెట్టిచాకిరీలకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమాలకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు.* కుటుంబ నియంత్రణ పేరుతో బలవంతంగా అపరేషన్లను చేయించారు.* మురికివాడల తొలగింపు ప్రజలకు ఆగ్రహం తెప్పించింది.* అత్యవసర పరిస్థితిలో అనేక ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు ప్రభుత్వం పాల్పడింది.* ప్రజల్లో ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం తగ్గే విధంగా వారి చర్యలు ఉన్నాయి.2. స్వాతంత్య్రం వచ్చిన తొలి సంవత్సరాల్లో సామాజిక, ఆర్థిక మార్పు తీసుకురావడానికి ఏ చర్యలు చేపట్టారు?: * స్వాతంత్య్రం వచ్చిన తొలి సంవత్సరాల్లో నెహ్రూ ప్రభుత్వం కింది చర్యలను చేపట్టింది. భూ సంస్కరణలు, వ్యవసాయ సహకార సంఘాలు, స్థానిక స్వపరిపాలన.* భూసంస్కరణలు: జమీందారీ వ్యవస్థ రద్దు, కౌలు విధానాల్లో సంస్కరణలు, భూపరిమితి.* వ్యవసాయ సహకార సంఘాలు: రుణవసతిని వ్యవసాయానికి ఇవ్వడమే కాకుండా తక్కువ ధరకు రసాయనాలు, ఎరువులు, విత్తనాలను రైతులకు అందించడం.* స్థానిక స్వపరిపాలన: భూసంస్కరణలు, సహకార సంఘాలు అమలయ్యేలా చూడటం.



No comments:

Post a Comment