Sunday, April 5, 2020

హక్కులు

*🔥దోపిడిని నివారించే హక్కు🔥*


*🔹he right against exploitation, అధికరణలు 23, 24 ల ప్రకారం, కట్టు బానిసత్వం, బాలకార్మిక విధానాలు నిషేధం.[10], 14 సంవత్సరాలకు లోబడి గల బాలబాలికలకు అపాయకరమైన పనులు (కర్మాగారాలలో, గనులలో) చేయించుట నిషేధం. బాలకార్మిక విధానం, రాజ్యాంగ ఊపిరికే విఘాతం లాంటిది.[11] కట్టు బానిసత్వం, విధానంలో భూస్వాములు లేదా పెత్తందార్లు, మానవహక్కులకు విఘాతాలు కలుగజేసేవారు. మానవులకు కట్టుబానిసలుగా ఉంచుకుని, తరతరాల స్వాతంత్ర్యాన్ని హరించివేసేవారు. ఈ దురాగతాన్ని మాన్పించడానికే ఈ హక్కు కల్పించబడింది. మానవులకు 'బానిస వర్తకాలు', 'వ్యభిచారం' లాంటి అశ్లీల వృత్తులయందు బలవంతంగా ప్రవేశించేలా చేయువారికి చట్టప్రకారం కఠిన శిక్షలున్నాయి. కానీ కొన్ని అత్యవసర సమయాలలో ప్రభుత్వాలు, జీతభత్యాలు లేని ఉద్యోగాలు,, తప్పనిసరి సైనిక భర్తీలను చేపట్టుట, లాంటి వాటిని, ప్రత్యేక పరిస్థితులలో అనుమతించవచ్చును*


*🔥మతస్వాతంత్రపు హక్కు🔥*


*🔶భారతదేశంలో పౌరులందరికీ మతస్వాతంత్ర్యపు హక్కును, అధికరణలు (ఆర్టికల్స్) 25, 26, 27, 28 ల ప్రకారం ఇవ్వబడింది. ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యం సెక్యులరిజం సూత్రాలను స్థాపించుటకు ఉద్ద్యేశించినవి. భారత రాజ్యాంగం ప్రకారం, భారతదేశంలోని అన్ని మతాలు సమానమే, ఏమతమూ ఇతర మతంపై ప్రాధాన్యతను కలిగి లేదు. ప్రతి పౌరుడు తన ఇష్టానుసారం మతాన్ని అవలంబించుటకు స్వేచ్ఛ కల్పింపబడ్డాడు. పౌరులు తమ మతాలగూర్చి ఉపన్యసించవచ్చు, అవలంబించవచ్చు, మతవ్యాప్తికొరకు పాటుపడవచ్చు. అలాగే, మతపరమైన సంప్రదాయాలను ఉదాహరణకు సిక్కులు కిర్పాన్ లను తమ ఉద్యోగాలు చేయు సమయాన ధరించడానికి, ప్రజల శ్రేయస్సును, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి, నిరోధించవచ్చు.[12]*
*🥀ధార్మిక సంస్థలు, ప్రజాపయోగ స్వచ్ఛంద సంస్థలను స్థాపించుకొనవచ్చు. ఇతరత్రా, మతసంబంధం కాని కార్యకలాపాలను, ప్రభుత్వం నిర్దేశించిన చట్టాల ప్రకారం చేపట్టవచ్చు. చారిటబుల్ సంస్థలను కూడా ప్రజాపయోగం, సుహృద్భావన, నియమాలను పునస్కరించుకొని, తమ కార్యకలాపాలు చేయునట్లుగా ప్రభుత్వం నిర్దేశించవచ్చును.[13] మతపరమైన కార్యకలాపాల కొరకు ఏలాంటి పన్నులను విధించగూడదు, నిర్దేశించగూడదు.[14] ప్రభుత్వాలు నడిపే విద్యాసంస్థలలో, ప్రత్యేక మతాన్ని రుద్దే బోధనలు చేపట్టకూడదు.[15] అలాగే, ఈ ఆర్టికల్స్ లోని విషయాలు, ప్రభుత్వాలు చేపట్టే ప్రజోపయోగ కార్యక్రమాలపై ఏలాంటి విఘాతాలు కలిగించగూడదు. ప్రభుత్వాలు చేపట్టే ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ విషయాలలో, ధార్మిక సంస్థల కార్యకలాపాలు అడ్డంకులుగా వుండరాదు.[12]*


*🔥సాంస్కృతిక, విద్యాహక్కులు🔥*


*💐భారతదేశం, అనేక మతాలకు, భాషలకు, సంస్కృతులకు నిలయం. రాజ్యాంగం వీరికి కొన్ని ప్రత్యేక హక్కులను ఇస్తూంది. అధికరణ 29, 30 ల ప్రకారం, మైనారిటీలకు కొన్ని హక్కులు ఇవ్వబడినవి. ఏ మైనారిటీలకు చెందినవాడైననూ, ప్రభుత్వం వీరికి, ప్రభుత్వ, ప్రభుత్వసహాయం పొందిన సంస్థలలో ప్రవేశానికి నిషేధించరాదు.[16]*
*మైనారిటీలు, అనగా మతం, భాష, సాంస్కృతిక పరమైన మైనారిటీలు, తమ మతాన్ని, భాషలనూ, సంస్కృతినీ రక్షించుకొనుటకు, మైనారిటీ సంస్థలు స్థాపించుకొనవచ్చును. ఆ సంస్థలద్వారా వారు, తమ అభ్యున్నతికి పాటుపడవచ్చును.[17] ఈ సంస్థలలో దుర్వినియోగాలు జరుగుతున్న సమయాన ప్రభుత్వాలు తమ ప్రమేయాలు కలుగజేసుకోవచ్చును.*


*🔥రాజ్యాంగ పరిహారపు హక్కు🔥*


*🔷ప్రాథమిక హక్కులకు ఏపాటియైనా భంగం కలిగితే, రాజ్యాంగ పరిహారపు హక్కును కోరుతూ న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ఉదాహరణకు, పౌరుడు, జైలు శిక్షను పొందితే, ఆ వ్యక్తి, న్యాయస్థానాలను ఆశ్రయించి, ఇది దేశచట్టాలనుసారంగా వున్నదా లేదా అని ప్రశ్నించే హక్కును కలిగి ఉన్నాడు. ఒకవేళ, న్యాయస్థానం నుండి జవాబు "కాదు" అని వస్తే, ఆవ్యక్తికి తక్షణమే విడుదలచేయవలసి వస్తుంది. పౌరుల హక్కులను వాటి సంరక్షణలను గూర్చి న్యాయస్థానాలను అడిగే విధానాలు కొన్ని ఉన్నాయి. న్యాయస్థానాలు కొన్ని దావాలను ప్రవేశపెట్టవచ్చు. ఆ దావాలు, హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కో వారంటో, సెర్టియోరారి. ఒక వేళ దేశంలో అత్యవసర పరిస్థితి యేర్పడితే, ఈ హక్కులన్నీ కేంద్ర ప్రభుత్వంచే 'సస్పెండు' చేయబడుతాయి.[18]*

No comments:

Post a Comment