Monday, April 6, 2020

భారత రాజ్యాంగం - ప్రాథమికహక్కులు


*🔥భారత రాజ్యాంగం - ప్రాథమికహక్కులు🔥*



*🔥ప్రాముఖ్యత, లక్షణాలు🔥*



*💐ప్రాథమిక హక్కులు, పౌరులకు తమ వ్యక్తిత్వాన్ని అభివృద్ధిపరచుకొనుటకు, బాధ్యతగలిగిన పౌరులుగా హుందాగా జీవించుటకు, ప్రభుత్వపరంగా, చట్టరీత్యా ఇవ్వబడిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు. ఇక్కడ ప్రభుత్వమనగా, భారతదేశంలో అధికారంగల అన్ని అంగాలు. వీటిలో భారత ప్రభుత్వము, పార్లమెంటు, భారతదేశంలోని రాష్ట్రాలూ, రాష్ట్రాలలో గల, జిల్లాపరిషత్తులూ, కార్పొరేషన్లు, నగరపాలికలు, పంచాయతీలు, గ్రామపంచాయతీలు వగైరా.*



*🔥సమానత్వపు హక్కు🔥*



*💐సమానత్వపు హక్కు, రాజ్యాంగం అధికరణలు 14, 15, 16, 17, 18 ల ప్రకారం ప్రసాదించబడింది. ఈ హక్కు చాలా ప్రధానమైనది, స్వేచ్ఛా సమానత్వాలు ప్రసాదించే ఈ హక్కు, క్రింది విషయాల గ్యారంటీనిస్తుంది :*

*చట్టం ముందు సమానత్వం : రాజ్యాంగ అధికరణ (ఆర్టికల్) 14 ప్రకారం, బారత భూభాగంలో ఉన్న వ్యక్తులందరూ సమానంగా, భారతచట్టాల ప్రకారం కాపాడబడవలెను. అనగా *ప్రభుత్వం [1] వ్యక్తుల పట్ల కుల, మత, వర్గ, వర్ణ, లింగ, పుట్టిన ప్రదేశాల ఆధారంగా ఏలాంటి వివక్ష చూపరాదు.[2]*
*పౌరప్రదేశాలలో సామాజిక సమానత్వం, సమాన* *ప్రవేశాలు : అధికరణ 15 ప్రకారం, పౌరులు పౌర (పబ్లిక్) ప్రదేశాలయిన, పార్కులు, మ్యూజియంలు, బావులు, స్నానఘాట్‌లు, దేవాలయాలు* *మొదలగు చోట్ల ప్రవేశించుటకు సమాన హక్కులు కలిగి ఉన్నారు. ప్రభుత్వాలు పౌరుల పట్ల ఎలాంటి వివక్ష చూపరాదు. కానీ కొన్ని సందర్భాలలో ప్రభుత్వం, స్త్రీలకు, పిల్లలకు ప్రత్యేక వసతులు కల్పించవచ్చు. అలాగే సామాజికంగా వెనుకబడినవారికి ప్రత్యేక* *సదుపాయాలు, ప్రభుత్వాలు *కలుగజేయవచ్చు.</ref>*
*పౌర ఉద్యోగాల విషయాలలో* *సమానత్వం : అధికరణ 16* *ప్రకారం, ఉద్యోగాలు పొందేందుకు, ప్రభుత్వాలు పౌరులందరికీ సమాన అవకాశాలు, హక్కులు కల్పించవలెను. ప్రభుత్వాలు, పౌరులకు ఏలాంటి వివక్షలూ చూపరాదు. 2003 'పౌర (సవరణ) బిల్లు' ప్రకారం, ఈ హక్కు, ఇతర దేశాల* *పౌరసత్వాలు పొందిన భారతీయులకు వర్తించదు.[3]*
*అంటరానితనం నిషేధాలు :* *అధికరణ 17 ప్రకారం,* *అంటరానితనాన్ని ఎవరైనా అవలంబిస్తూవుంటే చట్టం ప్రకారం శిక్షార్హులు.[4] అంటరానితనం నేర చట్టం (1955), 1976లో పౌరహక్కుల పరిరక్షణా చట్టం పేరుమార్పు పొందింది*.
*బిరుదుల నిషేధాలు :* *అధికరణ 18 ప్రకారం, భారత పౌరులు, ఏలాంటి బిరుదులూ పొందరాదు. ఇతరదేశాలనుండి కూడా ఏలాంటి బిరుదులు పొందరాదు.[5] ఉదాహరణకు బ్రిటిష్ ప్రభుత్వం, రాయ్ బహాదుర్, ఖాన్ బహాదుర్ లాంటి, "ప్రభుత్వ లేక రాజ్య సంబంధ బిరుదులు", సైన్యపరమైన బిరుదులూ ప్రకటించేది, ఇలాంటివి నిషేధం. కానీ విద్య, సంస్కృతీ, కళలు, శాస్త్రాలు మొదలగువాటి బిరుదులు ప్రసాదించనూవచ్చు, పొందనూ వచ్చు. భారత రత్న, పద్మ విభూషణ్ లాంటి వాటిని పొందినవారు, వీటిన తమ "గౌరవాలు"గా పరిగణించవచ్చుగాని, 'బిరుదులు'గా పరగణించరాదు.[6] 1995, 15 డిసెంబరు న సుప్రీంకోర్టు, ఇలాంటి బిరుదుల విలువలను నిలుపుదలచేసింది*.



*🔥స్వాతంత్ర్యపు హక్కు🔥*



*💐భారత రాజ్యాంగము, తన అధికరణలు 19, 20, 21, 22, ల ద్వారా స్వాతంత్ర్యపు హక్కును ఇస్తున్నది. ఇది వైయుక్తిక హక్కు. ప్రతి పౌరుడూ ఈ హక్కును కలిగివుండడం, రాజ్యాంగ రచనకర్తల అసలు అభిలాష. అధికరణ 19, క్రింది ఆరు స్వేచ్ఛలను పౌరులకు ఇస్తున్నది :[7]*



*వాక్-స్వాతంత్ర్యపు హక్కు, భావవ్యక్తీకరణ స్వాతంత్ర్యం,*

*సమావేశాలకు స్వేచ్ఛ, ఈ సమావేశాలు శాంతియుతంగా, ఆయుధాలుకలిగివుండరాదు*. *దేశం, ప్రజా శ్రేయస్సులను దృష్టిలో వుంచుకుని, ప్రభుత్వాలు వీటి అనుమతులు నియంత్రించనూవచ్చు*.
*సంస్థలు, సొసైటీలు స్థాపించే హక్కు. దేశ, ప్రజా శ్రేయస్సుల దృష్ట్యా ప్రభుత్వం వీటిని నియంత్రించనూ వచ్చు లేదా నిషేధించనూ వచ్చు*.
*భారత పౌరుడు, భారతదేశం అంతర్భాగంలో ఏప్రాంతంలోనైనా పర్యటించవచ్చు. కాని కొన్నిసార్లు ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు దృష్ట్యా అంటురోగం గల సమయాలలో వాటిని అరికట్టే ప్రయత్నాలలో, పౌరుల ప్రయాణాలను నిషేధించవచ్చు*.
*భారత అంతర్భాగంలో ఏప్రదేశంలోనైనా, పౌరులు, నివాసాన్ని ఏర్పరచుకోవచ్చు. కానీ, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్ తెగల పరిరక్షణ దృష్ట్యా, ప్రభుత్వం కొన్ని నియంత్రణలు చేయవచ్చును*.
*భారతదేశంలోని ఏప్రాంతంలోనైనా, పౌరులు వ్యాపారాలు, వర్తకాలూ, ఉద్యోగాలూ చేపట్టవచ్చును. కానీ, నేరాలుగల వ్యాపారాలు, చీకటి వ్యాపారాలు, నీతిబాహ్య వ్యాపారాలు చేపట్టరాదు*.
*ప్రాణాలు కాపాడే, కాపాడుకునే హక్కునూ రాజ్యాంగం కల్పిస్తున్నది. అధికరణ 20, ఈ విషయాన్నీ చర్చిస్తుంది*.
*ప్రాణాలు కాపాడుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ క్రిందనే పరిగణింపబడుతుంది. అధికరణ 21 ప్రకారం, ఏ పౌరుడూ తన స్వేచ్ఛనూ, జీవితాన్ని కోల్పోయే హక్కు కలిగిలేడు, చట్టాన్ని తప్పించి*

*🔥ఆస్తి హక్కు - క్రిత ప్రాథమిక హక్కు🔥*




*💐భారత రాజ్యాంగం, ఆర్టికల్ 19, 31 వరకు గల విషయాలలో ఆస్తి హక్కును పౌరుల ప్రాథమిక హక్కుగా పరిగణించింది. ఆర్టికల్ 19, పౌరులందరికీ, ఆస్తులను సంపాదించడం, వుంచుకొనడం, అమ్మడం లాంటి హక్కులను కలుగజేసింది. ఆర్టికల్ 31 'పౌరులెవ్వరూ తమ ఆస్తి హక్కును, ప్రభుత్వాల ద్వారా కోల్పోగూడదు'. ప్రభుత్వం ప్రజల అవసరాల రీత్యా పౌరుల ఆస్తిని గైకొన్న యెడల, ఆ ఆస్తిదారునికి 'కాంపెన్‌జేషన్' చెల్లించవలెనని కూడా నొక్కి వక్కాణిస్తుంది*.

*కానీ భారత రాజ్యాంగ 44వ సవరణ ద్వారా, 1978 లో ఈ ఆస్తి హక్కును, ప్రాథమిక హక్కుల జాబితానుండి తొలగించింది.[19] ఓ క్రొత్త ఆర్టికల్ 300-, సృష్టింపబడింది. ఈ ఆర్టికల్ ప్రకారం "చట్టం ప్రకారం, పౌరుడు పొందిన ఆస్తిని, భంగం కలిగించరాదు". ఆస్తి హక్కు రాజ్యాంగపరమైన హక్కుగా పరిగణించబడుతున్ననూ, ప్రాథమిక హక్కు హోదాను కోల్పోయింది.[20]*



*🔥విమర్శాత్మక విశ్లేషణ🔥*



*🌀ఈ ప్రాథమిక హక్కులను చాలా మంది పలువిధాలుగా విమర్శించారు. రాజకీయ సముదాయాలు, ప్రాథమిక హక్కులలో పని హక్కు, నిరుద్యోగస్థితి, వయసు మీరిన స్థితులలో ఆర్థికసహాయ హక్కు, మున్నగునవి చేర్చాలని డిమాండ్ చేస్తున్నాయి.[20] ఈ హక్కులన్నీ ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులులో క్రోడీకరించియున్నవి.[21] స్వాతంత్ర్యపు హక్కు, స్వీయస్వతంత్రం కూడా కొన్నిసార్లు విమర్శలకు లోనైనవి. ఇవి పరిధులకు మించి స్వేచ్ఛలు కలిగివున్నవని విమర్శింపబడినవి.[20] ఈ పౌరహక్కులు ఎమర్జన్సీ యందు, నిలుపుదల చేయబడుతాయి, ఇలా నిలుపుదల చేసే చట్టాలకు ఉదాహరణ; 'మీసా' (MISA Maintenance of Internal Security Act), జాతీయ రక్షణా చట్టం ఎన్.ఎస్.. NSA (National Security Act).[20] జాతీయ విపత్తుల (దేశ రాజకీయ అంతర్గత సంక్షోభం) సమయాలలో 'అత్యవసర పరిస్థితి' ని ప్రకటించి, ఈ కాలంలో పౌరహక్కులను తాత్కాలికంగా వెనక్కి తీసుకుంటారు.[20][22][23]*

*"పత్రికా స్వేచ్ఛ" స్వాతంత్ర్యపు హక్కులలో మిళితం చేయబడలేదు, ప్రజల ఉద్దేశ్యాల ప్రకటన, భావ ప్రకటనా స్వాతంత్ర్యం మున్నగు విషయాల కొరకు పత్రికాస్వేచ్ఛ అవసరం.[20] అపాయకర పనులలో బాలల చాకిరి కొంచెం తగ్గుముఖం పట్టినా, అపాయాలులేని పనులలో బాలల చాకిరి (Child Labour) అనేవి, భారతరాజ్యాంగ విలువలను కాలరాస్తున్నాయి. 1.65 కోట్లమంది బాలబాలికలు నేటికీ భారతదేశంలో వివిధ పనులలో ఉద్యోగాలు చేస్తున్నారు.[24] 2005 'ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్' అనే పత్రిక ప్రచురించిన ప్రచురణల ఆధారంగా, ప్రపంచంలో లంచగొండితనం గల 159 దేశాల జాబితాలో భారత్ 88వ స్థానాన్ని ఆక్రమిస్తోంది. ఈ లంచగొండులలో అధికారులు, రాజకీయనాయకులూ ఉన్నారు.[25] 2003 'పౌర బిల్లు' (సవరణ) ప్రకారం, ఉద్యోగ ప్రయత్నాలు చేసేందుకు సమాన హక్కులు పొందివుంటారు గాని, ఉద్యోగాలు పొందే విధానంలో సమానత్వపు హక్కు పరిగణలోకి రాదు. పోటీలో నెగ్గినవారే ఉద్యోగాలు పొందే అర్హత గలిగి వుంటారు*





*🔥సవరణలు🔥*



*🔷ప్రాథమిక హక్కులలో మార్పులు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. ఈ రాజ్యాంగ సవరణ పార్లమెంటు ఆమోదం పొందాలి. పార్లమెంటు ఆమోదానికి మూడింట రెండొంతుల పార్లమెంటు సభ్యుల ఆమోదం అవసరం. ఈ ఆమోదానికి పార్లమెంటులో ఓటింగ్ అవసరం*.

*ఆస్తి హక్కు ప్రథమ దశలో ప్రాథమిక హక్కుగా పరిగణింపబడింది. కాని 1978 లో జరిగిన భారత రాజ్యాంగ 44వ సవరణ ప్రకారం దీనిని ఓహక్కుగా కాకుండా, ప్రతి పౌరుడు తన ఆస్తిని కాపాడుకోవడానికి చట్టం ప్రకారం హక్కును కలిగి వున్నాడని చట్టం చేయబడింది. ఈ చట్టం, ప్రజాస్వామిక విలువలను కాపాడడానికి సామ్యవాద ఉద్దేశాలు సాధించడానికి, చేయబడింది.[19]*
*విద్యా హక్కు ను, 2002 లో, భారత రాజ్యాంగ 86వ సవరణ ప్రకారం ప్రాథమికహక్కుగా చేయబడింది. ఈ హక్కు ప్రకారం, ప్రతి బాలురు/బాలికలు, పౌరులు, ఎలిమెంటరీ స్థాయిలో ప్రాథమిక విద్యను ఓ హక్కుగా కలిగివుంటారు.


No comments:

Post a Comment