కల్పనా చావ్లా
*🔥కల్పనా
చావ్లా🔥*
*💐కల్పనా
చావ్లా (మార్చి
17, 1962 – ఫిబ్రవరి
1, 2003), ఈమె
ఒక ఇండియన్ -అమెరికన్
వ్యోమగామి మరియు వ్యొమనౌక
యంత్ర నిపుణురాలు*
*జాతీయత*
అమెరికా
మరియు భారత్
*ప్రస్తుతం*
చనిపోయారు
*జననం*
మార్చి
17, 1962
కర్నాల్,
హర్యానా,
భారతదేశం
*మరణం*
ఫిబ్రవరి
1, 2003 ( 40 సంవత్సరాలు)
టెక్సాస్
పై
*మునుపటివృత్తి*
విజ్ఞాని1994
NASA Group
*అంతరిక్షంలో
గడిపిన కాలం*
31d 14h
54m
*ఎంపికమిషన్*
STS-87,
STS-107
*🔥బాల్యం🔥*
*📚కల్పనా
చావ్లా భారత దేశంలోని హర్యానా
రాష్ర్టంలోని కర్నాల్ పట్టణంలో
1962 మార్చి
17 న
జన్మించింది. ఆమె
పాఠశాలలో చేరినప్పుడు రికార్డుల
ప్రకారం అధికార జన్మదినం
జూలై 1 1961కి
మార్చారు. తల్లిదండ్రులకు
ఈమె చివరి సంతానం.[1] సునీత,
దీప,
సంజయ్ ల
తర్వాత ఈమె జన్మించారు.
ఇంట్లో
అందరూ ముద్దుగా "మోంటు"
అని పిలుచుకొనే
కల్పనా చావ్లా కులీన కుటుంబంలో
పుట్టలేదు. తండ్రి
బనారసీలాల్ చావ్లా సాధారణ
వ్యాపారి కల్పనపై ఆయన ప్రభావం
ఎక్కువ. పేదరికం
నుంచే ఆయన పైకెదిగారు.
పట్టుదల,
అందుకు
తగిన కృషి ఉంటే సాధించలేనిది
ఏదీ లేదని నిరూపించిన వ్యక్తి
ఆయన. చిన్నగా
టైర్ల వ్యాపారాన్ని ప్రారంభించిన
ఆయన తొలుత ఎన్నో కష్టనష్టాలకు
గురయ్యారు. అయినా
దాన్ని వదలకుండా అనుకున్నది
సాధించేందుకు ముందుకు
సాగిపోయారు. అప్పటి
వరకూ టైర్ల తయారీకి విదేశీ
యంత్రాన్ని ఉపయోగించేవారు.
ఆ క్రమంలో
ఆయన దేశీయంగానే ఆ యంత్రాన్ని
రూపొందించారు. బనారసీలాల్
శ్రమ ఫలించింది. రాష్ట్రపతి
నుంచీ అభినందనలు అందుకున్నారు.
తర్వాత
డబ్బుకోసం బనారసీ కుటుంబం
ఇబ్బంది పడింది లేదు.
ఆడపిల్లే
అయినా జీవితంలో ఏదో సాధించాలన్న
తపన కల్పనలో పాదుకోవడానికి
తండ్రేకారణం. "పరిస్థితులు
ఎలాగున్నా... కన్న
కలల్ని నిజం చేసుకోవడమే అంతిమ
లక్ష్యం అన్న మాటలు నా తండ్రి
జీవితంలో నిజమయ్యాయి.
ఫలితంగా
అవే నాలోనూ జీర్ణించుకుకుపోయాయి.
అందుకు
నాన్నే కారణం." అంటూ
తొలి అంతరిక్షయానం తర్వాత
ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆలోచనలు
ఏ విధంగా ప్రభావితమయిందీ
కల్పన వివరించారు*.
*🔥విద్యాభ్యాసం🔥*
*💐కల్పనా
చావ్లా ముందుగా, కర్నాల్
లో ఉన్న టాగోర్ పబ్లిక్ స్కూల్లో
చదువుకున్నారు. తోటి
పిల్లలంతా కామిక్ పుస్తకాలు
చదువుతూ .....బర్బీ
బొమ్మల్లా అలంకరించుకునే
వయసులో... ఆమె
తెల్లవారు జామునే లేచి సైకిల్
పై స్కూలు కెళ్ళేవారు.
స్కూల్లో
డ్రాయింగ్ క్లాసులో విమానం
బొమ్మలు గీయటానికి ఇష్టపడేవారు.
ఈమె సోదరుడు
సంజయ్ చావ్లా కమర్షియల్ పైలట్
కావాలని కలలు కనేవాడు.
తన గదిలో
విమానాల బొమ్మలుంచేవాడు.
అవి కల్పనలో
స్ఫూర్తిని కలిగించాయి.
కల్పన తన
కలల్ని నిజం చేసుకోవటానికి
ఈమె సోదరుడు సంజయ్ ప్రోత్సాహం
ఎంతో ఉంది. ఇద్దరి
కలలూ ఒకటే - ఆకాశంలో
ఎగరడం. కర్నాల్
లోని టాగోర్ పాఠశాలలో ఈమె
ప్రాథమిక విద్య సాగింది*.
*పంజాబ్
ఇంజరీరింగ్ కాలేజీలో ఏరోనాటికల్
ఇంజనీరింగ్ చేశారు. 1982
లో ఈమె
అమెరికా వెళ్లి అక్కడ టెక్సాస్
విశ్వవిద్యాలయం నుండి "ఏరోస్పేస్
ఇంజనీరింగు" లో
మాస్టర్స్ డిగ్రీని 1984లో
పొందారు. 1986 లో
చావ్లా రెండవ మాస్టర్ అఫ్
సైన్సు డిగ్రీని మరియు ఏరోస్పేస్
ఇంజనీరింగ్ లో పిహెచ్ .డిని
బౌల్డెర్ లో ఉన్న కోలోరాడో
విశ్వవిద్యాలయం నుంచి పొందారు.
అందమైన
భవిష్యత్ కోసం కలలు కంటూ
గాలిలో మేడలు కట్టకుండా జీవిత
లక్ష్యాన్ని సాధించుకున్న
మహిళ కల్పనా చావ్లా.
చదువులో
ఎప్పుడూ ముందు ఉండేది.
ఈమెను
ఎక్స్‌ట్రావెర్ట్ గా ఉపాధ్యాయులు
పేర్కొనేవారు. సహజంగా
ఒక వ్యక్తి 20 నుండి
30 సంవత్సరాల
మధ్య వయసులో కెరియర్ ను
ప్రారంభించినా, అప్పటి
నుంచి ఓ 15 ఏళ్ళు
కష్టపడితే గాని పేరు రాదు.
కానీ కల్పన
పిన్నవయసులోనే గొప్ప వ్యక్తిగా
పేరు తెచ్చుకున్నారు.
ఈమె నాసాలో
ఉద్యోగానికి దరఖాస్తు చేసినపుడు
ఈమెతో 2 వేల
మంది పోటీ పడ్డారు. అయితే
ఈమె మాత్రమే నాసా శాస్త్రవేత్తగా
ఎంపికయ్యారు. తల్లిదండ్రులు
సంప్రదాయవాదులే అయినా కొత్తను
ఎప్పుడూ ఆహ్వానించేవారని
అంటారీమె. తన
కెరియర్ ను వారెప్పుడూ
అడ్డుకోలేదనని, తాను
కోరుకున్న దానికి ఆమోదం
తెలిపేవారని అన్నారు*.
*ఆమె
కాలిఫోర్నియాలో ఓ కంపెనీ
ఉపాధ్యక్షురాలిగా పనిచేసారు.
పరిశోధన
శాస్త్రవేత్తగా అక్కడెతో
అనుభవం గడించారు. ఏరో
డైనమిక్స్ ఉపయోగానికి సంబంధించిన
సమర్థమైన మెళకువలు నేర్చుకున్నారు.[2]
. సిమ్యులేషన్,
అనాలసిస్
ఆఫ్ ఫ్లో ఫిజిక్స్ తదితర
వైవిధ్యమున్న అంశాలను శోధించారు.
ఇదతా నేషనల్
ఏరోనాటిక్స్ అండ్ స్పేస్
అడ్మినిస్ట్రేషన్ (నాసా)
కు దరఖాస్తు
చేయకముందే జరిగింది*.
*ఆమె
1983 లో
విమానయాన శిక్షకుడు మరియు
విమాన చోదక శాస్త్ర రచయిత ఐన
జీన్-పియర్
హారిసన్ ను వివాహం చేసుకున్నారు,
1990 లో యునైటెడ్
స్టేట్స్ దేశ Samad పౌరురాలిగా
అయ్యారు.[3]*
*🔥కెరియర్
ప్లాన్ (నాసా
కి యిచ్చిన ఇంటర్వ్యూలో
కల్పన)🔥*
*తాజాగా
రోదసీకి వెళ్ళే ముందు నాసాకి
ఇచ్చిన ఇంటార్యూలో ఈమె తన
కెరియర్ ఎలా ప్లాన్ చేసుకున్నారో
వివరించారు*.
*📚మేం
ఉన్నత పాఠశాల లో చదువుకుంటున్నప్పుడు
మేం కర్నాల్ అనే చిన్న ఊర్లో
ఉండేవాళ్ళం. ఆ
ఊర్లో ప్లయింగ్ కల్బ్ ఉండటం
చాలా కలిసి వచ్చింది.
నేనూ,
మా సోదరుడూ
సైకిల్ తొక్కుతూ ఊళ్ళో
తిరుగుతుంటే ఆకాశంలో పుష్పక్
విమానాలు కన్పించేవి.
ఇద్దరికీ
వాటిల్లో ప్రయాణించాలని
ఉండేది. ఒకసారి
నాన్నను అడిగితే ప్లయింగ్
క్లబ్ కు తీసుకువెళ్ళి ఆ
విమానంలో ప్రయాణించే అవకాశం
కల్పించారు. ఏరోనాటికల్
ఇంజనీరింగ్ కు సంబంధించి ఇదే
నా తొలి అనుభవం. ఎదిగే
కొద్దీ జె.ఆర్.డి
టాటా గురించి కూడా తెలిసింది.
తొలిసారి
మన దేశంలో విమానాలను నడిపింది
ఈయనే. ఆనాడు
టాటా నడిపిన విమానాన్ని కూడా
చూశాను. విమానాన్ని
చూసిన రోజుల్లో ఆయనేం చేసిందీ
తెలుసుకోగానే నా ఆలోచనలు అలా
అలా మబ్బుల్లో తేలిపోయాయి.
హైస్కూలులో
చదువుతున్నప్పుదు 'నీవు
ఏం కావాలని అనుకుంటున్నావు
' అని
అడిగినపుడు 'ఏరోస్పేస్
ఇంజనీర్ ' అని
ఠక్కున* *చెప్పేదాన్ని.
అది నాకింకా
గుర్తే టెన్త్ క్లాసు తత్వాత
ఇంటర్ లో చేరాలంటె ఇంటర్ లో
ఏ గ్రూపు తీసుకోవాలన్నది
ముందే నిర్ణయించుకోవాల్సి
ఉండేది. నేను
ఏరో స్పేస్ ఇంజనీర్ నికావాలని
అనుకున్నందున లెక్కలు,
ఫిజిక్స్,
కెమిస్ట్రీ
చదవాలనినిర్ణయించుకున్నాను.
ఇంజనీరింగ్
ముందే లెక్కలు, ఫిజిక్స్,
కెమిస్ట్రీ,
లెక్కల్లో
ప్రావీణ్యం సపాదించాల్సి
ఉంటుంది. తత్వాత
పంజాబ్ ఇంజనీరింగ్ కళాశాలలో
ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో
సీటు వచ్చింది. అప్పట్లో
నా లక్ష్యం ఏరోస్పేస్ ఇంజనీర్
కావడమే. వ్యోమగామి
అవుతానని ఆ రోజుల్లో నేను
ఊహించలేదు. ఎయిర్
క్రాప్ట్ ఇంజనీర్ కావాలని
కోరుకున్నాను. ఇంజనీరింగ్
మొదటి సంవత్సరం కూడా క్లాసులో
అడిగినప్పుదు 'ప్లైట్
ఇంజనీర్ ' అవునాను
అని చెప్పాను*. *అప్పట్లో
ప్లైట్ ఇంజనీర్ అంటే ఏం చేస్తారో
కూడా నాకు అవగాహన లేదు.
నేను అనుకొన్న
ఎయిర్ క్రాప్ట్ డిసైనింగ్
కూ, ప్లైట్
ఇంజనీర్ కూ సంబంధం లేదు.
వ్యోమగామిగా
ఒక రకంగా చెస్తున్నది.
ప్లైట్
ఇంజనీర్ గానే కదా.
ఇంజనీరింగ్
కాలేజీలో నాతో పాటే ఏడుగురే
అమ్మాయిలం ఉండేవాళ్ళం.
వాళ్ళల్లో
ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చేసింది
నేనొక్కర్తినే. ఏరోస్పేస్
ఇంజనీరింగ్ కావాలన్నప్పుదు
మా ప్రిన్సిపాల్ వద్దన్నారు.
చాలా కష్టమని,
ఎలక్ట్రికల్
గానీ, మెకానికల్
గానీ తీసుకోమన్నారు.
ఏరోస్పేస్
ఇంజనీరింగ్ ఇవ్వండి.
లేదంటే
ఇంటికి వెళ్ళిపోతానంటూ
చెప్పాను. చివరికి
ఇవ్వక తప్పిందికాదు.
'నీకు
అందుబాటులో ఉన్నదీ లేదూ అని
కాదు. ఒక
లక్ష్యాన్ని ఏర్పరచుకున్న
తత్వాత ఆ వైపు మాత్రమే
ప్రయాణించాలి ' అని
మాత్రమే నేను యువతకు సూచించగలను ”*
—కల్పనా
చావ్లా (నాసాకు
యిచ్చిన ఇంటర్వ్యూలో)
*🔥ఊహా
లోకంలో🔥*
*🎉స్నేహితులన్నా,
కుటుంబ
సభ్యులన్నా, చదువు
చెప్పిన ఉపాధ్యాయులన్నా
కల్పనకు ఎనలేని అభిమానం,
ఎక్కడున్నా
మనసుకు దగ్గరైన వారందరితోనూ
భావాలను పంచుకునేవారు.
కొత్త కొత్త
లోకాలకు వెళుతున్నట్లు
భావిస్తూ ఊహల లోకాల్లో
విహరించేది తరచూ స్నేహితులందరితో
కలసి పార్కులకు వెళుతుండేది.
అలా ఒకసారి
పార్కుకు వెళ్ళిన కల్పనా
..." మనం
ఇక్కడ లేనట్లు ఊహించుకుందాం.
ఇపుడు
ఎక్కడో తెలియని దిగంతాల ఆవలికి
వెళ్ళీపోయాం. అక్కదే
ఎంతో ఆనందంగా ఉన్నాం"
అంటూ తనతో
పాటు స్నేహితులను కూడా
ఊహాలోకాల్లోకి తీసుకుపోయేవారు.
ఈమె ఊహలు
ఈమె ఊహించని దానికన్నా ఎక్కువగా
.... ఈరాలను
దాటి వెళ్ళాయి. తర్వాత
తర్వాత ఈమె వ్యోమగామిగా,
అంతరిక్ష
శాస్త్రవేత్తగా ఎదగడానికి
పునాదిగా ఈ ఊహలే ఉపకరించాయి*.
*ఇంటర్
పాసయిన తర్వాత కల్పనకు సమస్య
ఎదురైంది. ఏరోనాటికల్
ఇంజనీరింగ్ కావాలన్న కోరికను
తండ్రివద్ద బయటపెట్టారు.
తండ్రి
అంగీకరించలేదు. గౌరవప్రదమైన
వైద్య వృత్తిని స్వీకరించాలని
సూచించారు. ఏదైనా
విషయాన్ని ఒకటికి రెండు సార్లు
నమ్మకంగా చెబితే తండ్రి
కాదనరన్నది కల్పన విశ్వాసం.
ఈమె
అనుకున్నట్లే జరిగింది.
కల్పనే
గెలిచారు. చండీగఢ్
లోని పంజాబ్ ఇంజరీరింగ్
కాలేజీలో బి.ఎస్.సి.
(ఏరోనాటికల్
ఇంజనీరింగ్) పూర్తి
చేశారు. 1982 లో
డిగ్రీ చేతికొచ్చింది.
ఏమెకింకా
పై చదువులు చదవాలని ఉంది.
అమెరికాకు
వెళ్లాలన్న అన ఆకాంక్షను
తండ్రి వద్ద బయట పెట్టారు.
తండ్రి
వీల్లేదన్నారు. అందరిలాగే
పెళ్ళి చేసుకుని స్థిరపడాలన్నది
ఆయన కోరిక. ఈమె
అంగీకరించలేదు. తుదకు
తండ్రిని ఒప్పించి తనమాటే
నెగ్గించుకున్నారు.
(అమెరికా
వెళ్ళిన చాలా కాలానికి ఫ్రెంచ్
ప్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్,
వైమానిక
వ్యవహారాల రచయిత జీన్ పియెర్రా
హారిసన్ తన భర్తగా చేసుకున్నారు)*
*మాస్టర్స్
డిగ్రీ చదివేందుకు అమెరికా
లోని టెక్సాస్ యూనివర్సిటీలో
వాలారు. 1984 లో
అది కూడా పూర్తయింది.
కొలరాడో
యూనివర్సిటీలో పిహెచ్‌డి
చేసి... నాలుగేళ్ళ
తరువాత డాక్టరేట్ పొందారు.
కాలిఫోర్నియా
లోని ఓ కంపెనీ ఉపాధ్యక్షురాలిగా
పని చేశారు. పరిశోధనా
శాస్త్రవేత్తగా అక్కడెంతో
అనుభవం గడించారు.
ఏరోడైనమిక్స్
ఉపయోగానికి సంబంధించి సమర్థమైన
మెళకువలు నేర్చుకున్నారు.
సిమ్యులేషన్,
అనాలిసిస్
ఆఫ్ ఫ్లో ఫిజిక్స్ తదితర
వైవిద్యమున్న అంశాలను శోధించారు.
ఇదంతా
నేషనల్ ఏరోనాటిక్స్ అండ్
స్పేస్ అడ్మినిస్ట్రేషన్
(నాసా)
కు దరఖాస్తు
చేయక ముందే....!!*
*🔥నాసా
శాస్త్రవేత్తగా ఎంపిక🔥*
*🎀1994
లో మొట్టమొదటి
సారి కల్పనా చావ్లా పేరు
ప్రపంచానికి తెలిసింది.
ఎందుకంటే
అప్పుడామెను "నాసా"
వ్యోమగామిగా
ఎంపిక చేసింది. నిజానికి
కల్పనా చావ్లా "నాసా"కు
దరఖాస్తు చేసేనాటికి ఆమెతో
పాటు దాదాపు 2000 మందికి
పైగా అభ్యర్థులు దరఖాస్తు
చెసుకున్నారు. అంతమందినీ
పరిశీలించి... కేవలం
23 మందినే
నాసా ఎంపిక చేసింది.
1995 లో మిగతా
22 మందితో
కలసి నాసాకు చెందిన వ్యోమగామి
శిక్షణ కార్యక్రమాన్ని ఈమె
పూర్తి చేసుకున్నారు.
టెక్సాస్
లోని హూస్టన్ లో గల జాన్సన్
స్పేస్ సెంఆట్ర్లో తన శిక్షణ
చాలా ఆనందంగా గడిచిందంటారీమె...
అక్కది
శిక్షణ గురించి వ్యాఖ్యానిస్తూ
"శిక్షణ
చాలా ఉత్కంఠభరితంగా తమాషాగా
ఉండేది. తమాషాగానూ
ఉండేది లెండి." అనేవారు.
తరువాత
పైలట్ గా వివిధ రకాల విమానాలు
నడిపేందుకు అర్హత సాధించారు*.
No comments:
Post a Comment