ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పెంపొందించుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకోండి?
ఆత్మవిశ్వాసం
కోల్పోకుండా పెంపొందించుకోవాలంటే
ఏం చేయాలో తెలుసుకోండి?
ఎంతటి
కష్టాన్నైనా ఎదిరించగలనన్న
ధైర్యం ఉండాలి. ఎంతటి
లక్ష్యాన్నైనా సాధించగలనన్న
నమ్మకం కావాలి. ఎవరికైనా
సరే నాయకత్వం వహించే లక్షణం
రావాలి ఇవన్నీ ఉండాలంటే
ఆత్మవిశ్వాసం అవసరం.
దాన్ని
ఎలా పెంపొందించుకోవాలో
చేసుకుందామా.
ఆత్మవిశ్వాసమే
అందం అదో ఆయుధం. అదే
ఉంటే ప్రపంచాన్నే జయించగమన్న
శక్తి మనకి కలుగుతుంది.ఏ
పరిస్థితినైనా ఎదిరించగల
ధైర్యం ముఖంలో కనిపిస్తుంది
కానీ అది నేడు చాలా మంది యువతలో
లోపిస్తుండటమే అసలు సమస్య.పెరిగిన
పరిస్థితులు జీవితంలో ఎదురైన
ఎదురుదెబ్బలు వంటివి మానసికంగా
ప్రభావం చూపిస్తాయి.ప్రధానంగా
ఏ వ్యక్తినైనా తన శక్తి
సామర్థ్యాలు బలాలపై నమ్మకం
లేనప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది.
ఇలాంటి
వారు ఏ అంశంపైనా సొంతంగా
నిర్ణయాలు తీసుకోలేరు.
ఏ పని చేసినా
సరే సాధించలేమో తప్పు చేస్తానేమో
అనే సందేహాలు వారిని వెంటాడుతాయి.
దాంతో
ముందడుగు వేయలేక కుంగిపోతుంటారు
అదే ఆత్మన్యూనత.
ఆత్మ
విశ్వాసం లోపించిన వారు ఏ
పనినీ వేగంగా పూర్తి చేయలేరు.
ఆటలు చదువు
ఇలా ఏ అంశాల్లో నూ తమకు వచ్చిన
అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోలేరు
కొన్నిసార్లు వాటిని దూరం
చేసుకుంటారు. వీరు
తమకంటూ ఓ లక్ష్యాన్ని
నిర్ధేశించుకోరు.గమ్యాన్ని
ఏర్పరచుకున్నా దాన్ని
చేరుకోవడానికి ఎటువంటి
ప్రయత్నం చేయరు. ప్రతి
పనికీ ఇతరులపై ఎక్కువగా
ఆధారపడతారు తమ అభిప్రాయానికి
బదులు ఇతరులు ఏమనుకుంటున్నారో
వాళ్ళు దాన్ని ఎలా స్వీకరిస్తారో
అని ఆలోచిస్తారు. అందరిలో
కలవలేరు ఎప్పుడూ ఒంటరిగా
ఉండటానికి ప్రయత్నిస్తుంటారు.
ఆత్మవిశ్వాసం
ఎలా అలవడుతుందంటే తరగతి గదిలో
ఏవైనా సెమినార్లు సంస్కృతిక
కార్యక్రమాలు ఉన్నప్పుడు
నేనేం చేయలేను అనుకోవద్దు.
వాటిని
బాగా సాధన చేయాలి స్నేహితుల
ముందు ఒకటికి రెండు సార్లు
చెప్పాలి. ఇలా
చేస్తే బాగా ప్రెజెంట్
చేయగలుగుతారు దాంతో ఆత్మ
విశ్వాసం రెట్టిస్తుంది.ఇదే
క్రమంగా అలవడుతుంది.
రోజు ఆటలాడటం
వల్ల శారీరకంగానే కాదు
మానసికంగాను ఎన్నో ప్రయోజనాలున్నాయి
దీనిలో ఒక లక్ష్యం పెట్టుకుని
ఆడతాం.నిత్యం
సాధన చేస్తుంటే నైపుణ్యాలు
పెరుగుతాయి.ఇతరులకు
సమన్వయం చేసుకుంటూ ఎలా ముందుకు
వెళ్లాలో నేర్చుకుంటాం క్లిష్ట
పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో
తెలుస్తుంది.క్రమశిక్షణ
స్థిరత్వం అలవాటవుతాయి.ఈలక్షణాలు
మనలో ఆత్మవిశ్వాసం పెంచి
ముందుకు పయనించేలా చేస్తాయి.
మనలో
ఉన్న తప్పులను అంగీకరించడం
నేర్చుకోవాలి. అప్పుడే
బలహీనతలేంటో తెలుస్తాయి
వాటినుంచి బయటపడటానికి ఎలాంటి
ప్రణాళికలను అమలు చేయాలో
నిర్ణయించుకోగలం వీటీ నుంచి
ఒక్కొక్కటిగా బయటపడితే
ఆత్మన్యూనతా భావం తగ్గుతుంది.
మిమ్మల్ని
ఇష్టపడే వారితో ఎక్కువ సమయం
గడపడం నేర్చుకోండి.చుట్టూ
సానుకూల వాతావరణం ఉండేలా
చూసుకోండి. ప్రతికూలతలు
మాత్రమే ఎత్తి చూపే వారికి
దూరంగా ఉండటం మంచిది.వీరెప్పుడు
ఉత్సాహాన్ని నీరుగార్చేలా
చేస్తారు.ఆత్మ
విశ్వాసాన్నిదెబ్బతీస్తారు.
కొందరు
ఇతరులతో మాట్లాడడానికి
ఇష్టపడరు.ఎవరైన
ఎదురుపడినా కనీసం హాయ్ చెప్పారు
అలా కాకుండా ఎవరైనా ఎదురైనప్పుడు
వారిని చిరునవ్వుతో పలకరించాలి.
ఇది ఒక
రకమైన చొరవ మనలోని భయం పోవడానికి
సహాయపడుతుంది. అందరితోనూ
కలిసిపోగలం నాయకత్వ లక్షణం
పెరుగుతుంది. ఇది
ఆత్మవిశ్వాసానికి సంకేతం ఈ
విధంగా చేయడం వల్ల మనలో
ఆత్మవిశ్వాసాన్ని
పెంపొందించుకోవచ్చు.....!!
No comments:
Post a Comment