రాకెట్
*🔥రాకెట్🔥*
*💐చక్రాల
మీద నడిచే బండి కాని,
గాలిలో
ఎగిరే విమానం కాని, నీటిలో
ప్రయాణం చేసే పడవ కానీ,
రోదసిలోకి
దూసుకుపోయే అవాయి (రాకెట్)
కాని -
మరే రకమైన
యానం (vehicle) కాని
ముందుకు వెళ్ళాలంటే దానిని
వెనక నుండి ముందుకి తోసే కారకం
(cause) ఉండాలి.
ఇలా ముందుకి
తోసే కారకాన్ని ఇంగ్లీషులో
త్రస్ట్ (thrust) అంటారు;
తెలుగులో
తోపుడు అనొచ్చు. ఎద్దు
బండిలో అయితే తోపుడుకి (push)
బదులు
లాగుడు (pull) ఉంటుంది.
వాహనం
ముందుకి కదలాలంటే లాగనయినా
లాగాలి, తొయ్యనైనా
తొయ్యాలి. ప్రొపెల్లర్
విమానంలో క్షేపణి (propeller)
గిర్రున
తిరిగి విమానాన్ని ముందుకి
లాగుతుంది. జెట్
విమానంలో ఇంజను గాలిని జోరుగా
వెన్కకకి వదలటం వల్ల విమానం
ముందుకి తొయ్యబడుతుంది*.
*తారాజువ్వలు
ఆకాశంలోకి రివ్వున లేవటానికీ,
అవాయి
(rocket) ఆకాశంలోకి
దూసుకు పోవటానికీ సూత్రం
నూటన్ ప్రవచించిన మూడవ గమన
సూత్రం: ప్రతి
చర్యకీ దానితో సమానమైనటువంటి,
వ్యతిరిక్తమైన
(opposite) ప్రతిచర్య
(reaction) ఉంటుంది.
కనుక నిండుగా
ఉన్న రబ్బరు బుడగ మూతిని తెరచి
వదలి పెడితే మూతి గుండా గాలి
జోరుగా బయటకు రావటం 'చర్య'
(action) అయితే
గాలి వచ్చే దిశకి వ్యతిరేక
దిశలో బుడగ దూసుకుపోవటం
ప్రతిచర్య అవుతుంది.
తారాజువ్వలో
ఉన్న మందుగుండు సామానుకి
చురక అంటించినప్పుడు జువ్వలోని
రసాయనాలు భగ్గున మండి,
వాయుపదార్ధాలు
వ్యాకోచం చెందుతాయి. ఆ
దహన ప్రక్రియలో పుట్టిన
పదార్దాలు జోరుగా కిందికి
వస్తే జువ్వ పైకి లేస్తుంది.
ఇదే విధంగా
అవాయిలో ఉన్న ఇంధనాలు మండినప్పుడు
నిశ్వాస వాయువులు (exhaust
gases) దిగువకి
వస్తే అవాయి (రాకెట్)ఎగువకి
పోతుంది*.
*ఈ
రోజులలో రాకెట్లు మనకి అనేక
విధాలుగా ఉపయోగపడుతున్నాయి.
యుద్ధాలలో
వాడే రాకెట్లని క్షిపణులు
(missiles) అంటారు.
కృత్రిమ
గ్రహాలని కక్ష్యలో ప్రవేశపెట్టటానికి
ఉపయోగించినప్పుడు వాటిని
ప్రవేశ యానాలు (launch vehicles)
అనొచ్చు.*
*🔥చరిత్ర🔥*
*🎀రాకెట్ల
చరిత్ర కెళితే 13వ
శతాబ్దంలో కెళ్ళాలి.[1]
20వ శతాబ్దంలో,
ఇవి మానవుని
చంద్రయానం వరకూ తీసుకెళ్ళాయి.
21వ శతాబ్దంలో,
అంతరిక్ష
వ్యాపార రంగాన్ని నిజం
చేయబోతున్నాయి*.
*రాకెట్లను
టపాకాయలు, మరియు
ఆయుధాలలోనూ, లాంచ్
వాహనంగా కృతిమ ఉపగ్రహాలను
అంతరిక్షంలో సంధించుటకు
లాంచ్ వాహనం గానూ, మానవ
అంతరిక్ష వాహనం, మరియు
ఇతర గ్రహాలకు అంతరిక్ష వాహనం
గానూ ఉపయోగిస్తారు. ఇవి
పలాయన వేగాన్ని కలిగి
భూమ్యాకర్షణశక్తిని ఛేదించుకొంటూ
అంతరిక్షంలోకి చొచ్చుకొని
పోయే ప్రత్యేక వాహనాలు*.
*రసాయన
రాకెట్లు, తమలో
అత్యంత శక్తిని పోగుచేసుకొని,
సులభంగా
విడుదల చేసే స్థాయిని కలిగి
వుంటాయి, కాని
ఇవి ఎక్కువ అపాయవంతమైనవి.
చాలా
పకడ్బందీగా డిజైన్ చేసి,
పరీక్షించి
అపాయస్థాయిలను తగ్గించి మరీ
తయారు చేస్తారు.*
*🔥రాకెట్ల
చరిత్ర🔥*
*ప్రాచీన
కాలం*
*🥀క్రీ.పూ.
400 లో 'ఆలస్
గెల్లియస్' వ్రాతలప్రకారం
'గ్రీకు
పైథాగోరియన్' అర్చిటాస్
ఒక కలపతో తయారుచేసిన పక్షిని,
ఆవిరిని
ఉపయోగించి ఎగురవేశాడు.[2]
దీని
చిత్రంగాని, ప్లాన్
నమూనా గాని ఎటువంటి ఇతర
శాస్త్రీయ ఆధారాలు లభించలేదు*.
*తుపాకి
మందు లభ్యమైన కాలంలో ఘన రాకెట్ల
తయారీ ప్రారంభమైనది.
9వ శతాబ్దంలో
చైనీయులు, అల్కెమీ
రసాయనశాస్త్రవేత్తలు తుపాకి
మందు కనిపెట్టి, రాకెట్ల
తయారీకి నాంది పలికారు.
వీటి
ఆధారంగానే బాంబులు,
తారాజువ్వలు,
టపాకాయ
రాకెట్లు తయారీ చేశారు.
లిజాంగ్
చక్రవర్తి కాలంలో ఈ తుపాకి
మందును ఉపయోగించి, 1264 లో
'గ్రౌండ్
రాట్' అనబడే
టపాకాయను తయారుచేశారు.[3]*
*🔥ప్రారంభ
మానవ రాకెట్లు🔥*
*🔹చరిత్ర
గాథల ప్రకారం వాన్ హూ,
చైనాలో
1232 కాలంలో
నల్లమందుతో నిండిన 47
రాకెట్ల
సమూహాన్ని ఉపయోగించి మానవ-సహిత
రాకెట్టును ఉపయోగించారు.[10]
లేదా 16వ
శతాబ్దంలో.[11]. దీని
ప్రథమ దశలోనే ఒక పెద్ద ప్రేలుడు
సంభవించిందని, దాని
తరువాత పైలట్ కానరాలేదని
వర్ణింపబడింది.[12].*
*ఉస్మానియా
టర్కీ, 1633 లో,
లగారి హసన్
ఖలబీ ఓ శంఖు ఆకార రాకెట్ లో
ఎగిసాడు. దీనికి
రెక్కలు కూడా ఉన్నాయి.
ఇతను టోప్-కపి
ప్యాలస్ నుండి లంగించాడు.
ఇతను
సురక్షితంగా భూమిపై వాలాడు
కూడా. దీని
వల్ల ఇతడికి సైన్యంలో ఓ పెద్ద
పదవికూడా లభించింది.[13]
ఈ "నింగికెగరడం",
ఉస్మానియా
చక్రవర్తి మురాద్ 4
కుమార్తె
జన్మించిన సందర్భంగా కూడా
ఓ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో
ఓ ఉయ్యాల, దానికి
రెక్కలు, దానికి
7 రాకెట్లు,
70 కి.గ్రా.
ల మందుగుండును
ఉపయోగించి ప్రయోగించారు.
ఇది 200
సెకన్లు
300 మీటర్ల
ఎత్తున ఎగిరి తిరిగీ సురక్షితంగా
చేరింది. దీనిపై
సుల్తాన్ ఎన్నో బహుమానాలు
ప్రకటించాడు.*
*🔥అంతర్-గ్రహాల
రాకెట్ల సిద్ధాంతాలు🔥*
*🌀1920
లో,
రాబర్ట్
గాడర్డ్ అనే శాస్త్రవేత్త
"అత్యంత
ఎత్తుకు ఎగిరేందుకు మార్గాలు"
అనే పుస్తకం
ప్రచురించాడు.[14],*
*గొడ్డార్డ్,
ద్రవ ఇంధన
రాకెట్ ఇంజన్లకు, సూపర్
సానిక్ నాజల్ లను చేర్చి నవీన
రాకెట్ల యుగానికి నాంది
పలికాడు. ఈ
నాజళ్ళు వేడి వాయువులను
కంబష్షన్ ఛేంబర్ ను కూలర్ గా
మారుస్తాయి, హైపర్
సానిక్, వాయు
జెట్ ను రెండింతలు జేసి,
ఇంజన్
స్తోమతను 2% నుండి
64% పెంచుతాయి.[15][16].
ప్రారంభ
రాకెట్లు, తగిన
స్తోమత లేనివి, కారణం,
ఎక్జాస్ట్
వాయువుల వల్ల వేడిమి,
శక్తి
కొరగాకుండాపోయేవి. 1926
లో,
రాబర్ట్
గొడ్డార్డ్, ప్రపంచపు
మొదటి ద్రవ-ఇంధన
రాకెట్టును ఔబర్న్,
మెసాచుసెట్స్
లో ప్రయోగించాడు*.
*1920
కాలంలో,
అమెరికా,
ఆస్ట్రియా,
బ్రిటన్,
చెకోస్లోవేకియా,
ఫ్రాన్స్,
ఇటలీ,
జెర్మనీ
మరియు రష్యాలో అనేక రాకెట్
పరిశోధనా సంస్థలు వెలిసాయి.
1920 మధ్య
కాలంలో, వీమర్
రిపబ్లిక్, జెర్మనీ
శాస్త్రజ్ఞులు, ద్రవ
ప్రొపెల్లెంట్ లను ఉపయోగించి,
ఎత్తులకు
ఎగిరేందుకు, దూరంవరకు
సాగేందుకు కావలసిన సాపేక్షతలను
కలిగిన రాకెట్లను శోధించగలిగారు.
ఔత్సాహిక
ఇంజనీర్లను కలిగిన ఒక సమూహము,
జర్మన్
రాకెట్ సొసైటీకి చెందినవారు,
1927లో మరియు
1931లో,
ఆక్సిజన్
మరియు గాసోలిన్ లను ఉపయోగించి,
ద్రవ
ప్రొపెల్లెంట్ రాకెట్ ను
ప్రవేశపెట్టారు.[17]*
*🔥రెండవ
ప్రపంచ యుద్ధం🔥*
*🖊️1943
లో,
వీ-2
రాకెట్
నిర్మాణం ప్రారంభమైంది.
ఈ వీ-2
రాకెట్లు
తమ కార్యకలాపాల పరిధి 300
కి.మీ.
(185 మైళ్ళు)
ను కలిగి,
1000 కి.గ్రా.
(2204 పౌండ్ల)
వార్ హెడ్
లను మోసుకెళ్ళే స్తోమతను
కలిగి వుండేవి. ఇవి
దాదాపు 90 కి.మీ.
ఎత్తువరకూ
వెళ్ళగలిగే స్థాయినీ కలిగి
వుండేవి. ఈ
రాకెట్ కు మరియు నవీన రాకెట్లకు
తేడా వీటి టర్బో పంపులు మరియు
గైడెన్స్ సిస్టమ్. వీటిని
అల్లైడ్ సైన్యాలపై ప్రయోగించారు,
ముఖ్యంగా
ఇంగ్లాండ్ పై. సాంకేతిక
నాణ్యతా పరంగా ఇవి అంత పటుత్వం
కలిగి లేవు. వీటి
పరిధి కొన్ని సార్లు కొద్ది
మీటర్లే, ఇంకొన్ని
సార్లు ఇవి ప్రయోగించిన
ప్రదేశాలలోనే పేలియోయేవి.[18]
ఈ రాకెట్ల
దాడి కారణంగా ఇంగ్లాండులో
2,754 మంది
ప్రజలు మరణించారు మరియు 6,523
మంది
గాయపడ్డారు*.
*ప్రాజెక్ట్
అమెరికా నాజీ జెర్మనీ,
"జలాంతర్గామి
చే సంధింపబడ్డ బాలిస్టిక్
మిసైల్" లను
అభివృద్ధి మరియు మెరుగు
పరచడానికి ప్రయత్నించింది.[19]
ఈ ప్రోగ్రాం
అనుసారం న్యూయార్క్ మరియు
ఇతర అమెరికా నగరాలపై బాంబుల
వర్షం కురిపించడం*.
*నాజీ
జర్మనీలో గైడెడ్ మిసైల్
ప్రోగ్రాంకు సమానంగా,
రాకెట్లను
ఏర్ క్రాఫ్ట్ లలో కూడా
ఉపయోగించారు, ఈ
విధానంలో "రాపిడ్
హారిజాంటల్ టేక్ ఆఫ్"
మరియు
"వెర్టికల్
టేక్ ఆఫ్" కొరకు
రాకెట్లను ఉపయోగించారు*.
*🔥రెండవ
ప్రపంచ యుద్ధం తరువాత🔥*
*💐రెండవ
ప్రపంచ యుద్ధం ఆఖరులో,
రష్యా,
బ్రిటన్
మరియు అమెరికా లు, జెర్మనీకి
చెందిన రాకెట్ పరిజ్ఞానాన్ని
తస్కరించి, తమ
తమ దేశాలలో ఈ విజ్ఞానాన్ని
పెంపొందిచుటకు పోటీపడ్డాయి.
రష్యా మరియు
బ్రిటన్ లు కొద్దిగా లాభపడితే,
అమెరికా
మాత్రం చాలా లాభపడింది.
అమెరికా
ఇంకో ముందడుగు వేసి,
నాజీపార్టీ,
జెర్మనీకి
చెందిన రాకెట్ పరిజ్ఞాన
శాస్త్రవేత్తలను (వాన్
బ్రాన్ తో సహా) "ఆపరేషన్
పేపర్ క్లిప్" పేరుతో
బంధించి తమ దేశానికి
తీసుకుపోయింది.[20]. వీరు
అమెరికాలో, అమెరికా
కోసం పనిచేశారు, ఏ
రాకెట్లైతే బ్రిటన్ పై
సంధించారో, ఆ
రాకెట్లనే, ప్రయోగాత్మకంగా,
రాకెట్
పరిజ్ఞానాన్ని పెంపొందించుటకు
ఉపయోగించారు*.
*యుద్ధం
తరువాత, ఈ
రాకెట్లను, ఇతర
ఉపయోగాలకొరకు వాడారు.
ఉదాహరణకు,
ఆకాశ ఎత్తులకు
ఎగరడానికి, రేడియో
టెలీమెట్రీ కొరకు, వాతావరణ
అధ్యయనం. అమెరికాకు
లొంగిపోయిన వాన్ బ్రాన్ మరియు
ఇతర జర్మనీ శాస్త్రవేత్తలు,
అమెరికాలోని
ఇతర శాస్త్రవేత్తలతో కలసి
అమెరికా ఉపయోగాలకొరకు
పనిచేశారు*.
*ఆర్-7
8కే72
"వోస్టోక్"*
*సోవియట్
యూనియన్లో స్వతంత్రంగా
రాకెట్లపై పరిశోధనలు ప్రారంభమైనవి.
చీఫ్ డిజైనర్
అయిన సెర్గీ కొరెలెవ్ ఆధ్వర్యంలో
ఈ పరిశోధనలు ఊపందుకొన్నవి.[21].
జర్మనీ
టెక్నీషియన్ల సహాయంతో,
వీ-2
రాకెట్ల
డూప్లికేట్ లను తయారుచేసి,
ఆర్-1,
ఆర్-2,
మరియు ఆర్-5
రాకెట్లు
మరియు మిసైల్స్ అభివృద్ధి
పరచసాగారు. జర్మన్
డిజైన్ లను నిలుపుదల చేసి
1940, జర్మనీ
వర్కర్లకు వెనక్కు పంపారు.
అలెక్సీ
మిహైలోవిచ్ ఇసయెవ్ చే తయారుచేయబడ్డ
కొత్త ఇంజన్లను ఉపయోగించి
మొదటి ఐ.సీ.బీ.యం.
ఆర్-7
లు తయారు
చేశారు.[22] ఈ
ఆర్-7 ల
సహాయంతోనే మొదటి కృత్రిమ
ఉపగ్రహం, మొదటి
అంతరిక్ష యాత్రికుడు,
అంతరిక్షంలో
ప్రవేశపెట్టారు. నేటికినీ
ఈ ఆర్-7 లే
ఉపయోగిస్తున్నారు. ఈ
విజయవంతమయిన కార్యక్రమాలు
ఇంకనూ పరిశోధనలకు ఊపిరినిచ్చాయి*.
*ప్రచ్ఛన్న
యుద్ధం కారణాన, 1960 దశకం
ఈ పరిశోధనలను వేగాన్నిచ్చింది.
సోవియట్
యూనియన్ వోస్టోక్, సోయుజ్,
ప్రోటాన్
మరియు అమెరికాకు చెందిన
ఎక్స్-15[23] మరియు
ఎక్స్-20 డైనా-సోర్
[24] ఎయిర్
క్రాఫ్ట్, జెమినీ,
ఇవన్నీ
ముందుకొచ్చాయి. ఈ
దేశాలే గాక, బ్రిటన్,
జపాన్,
ఆస్ట్రేలియా
మొదలగునవి కూడా పరిశోధనలు
సాగించాయి. 60 దశకంలో
మానవసహిత 'చంద్రుడిపై
యాత్ర' సాటర్న్-5
ద్వారా
సుగమమైంది*.
No comments:
Post a Comment