చంద్రగిరి
*🔥చంద్రగిరి🔥*
*💐చంద్రగిరి,
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా,
చంద్రగిరి
మండలానికి చెందిన గ్రామం,
రెవిన్యూ
డివిజన్ కేంద్రం.[1].ఇది
సమీప పట్టణమైన తిరుపతి నుండి
12 కి.
మీ.
దూరంలో
ఉంది.2011 భారత
జనగణన గణాంకాల ప్రకారం ఈ
గ్రామం 5180 ఇళ్లతో,
20299 జనాభాతో
1956 హెక్టార్లలో
విస్తరించి ఉంది. గ్రామంలో
మగవారి సంఖ్య 9894, ఆడవారి
సంఖ్య 10405. షెడ్యూల్డ్
కులాల సంఖ్య 3748 కాగా
షెడ్యూల్డ్ తెగల సంఖ్య 852.
గ్రామం
యొక్క జనగణన లొకేషన్ కోడ్
596031[2].పిన్
కోడ్: 517101*
*🔥చంద్రగిరి
కోట🔥*
*✳️చంద్రగిరిలో
1640లో
కట్టబడిన కోట ఉంది. శ్రీ
కృష్ణదేవరాయలు ఆస్థానములో
వుండిన మహామంత్రి తిమ్మరుసు
జన్మస్థలం చంద్రగిరి.
అర్ధ
చంద్రాకారంగా ఉన్న కొండ
పాదభాగంలో కోటను నిర్మించడం
వలన దీనిని చంద్రగిరి దుర్గం
అని పిలిచే వారు. ఇలా
నిర్మించుట వలన కోట రక్షణ
కొండ ప్రాంతమువైపుగా తగ్గగలదనీ
కొండపైనుండి శత్రువుల కదలికలను
దూరంనుండి గమనించుట సులభం
కనుక కొండ ప్రక్కగా నిర్మించారనీ
మ్యూజియంలో సమాచారముద్వారా
తెలుస్తున్నది.కోట
చుట్టూ దాదాపు కిలో మీటరు
దృఢమైన గోడకలదు ఈ గోడ నిర్మించేందుకు
వినియోగించిన రాళ్ళ పరిమాణం
చాలా పెద్దది. దీనిని
ఏనుగుల సహాయంతో నిర్మించారని
తెలుస్తుంది.ఈ
గోడ పొదల తుప్పల మధ్య ఇప్పటికీ
చెక్కు చెదరక ఉంది. ఈ
గోడననుసరిస్తూ బయటి వైపుగా
పెద్ద కందకము ఉంది.
ప్రస్తుతము
పూడిపోయిననూ అప్పటి కాలమందు
ఇందులో మొసళ్ళను పెంచే
వారట.విజయనగర
రాజుల చరిత్రలో చంద్రగిరి
ఓ ప్రముఖ స్థానం వహించింది.కృష్ణదేవరాయలు
తిరుమలను దర్శించినప్పుడు
ఇక్కడే విడిదిచేసేవారు.అచ్యుతదేవరాయలను
ఇక్కడే గృహనిర్బంధములో
ఉంచారు*.
*🔥సమాచార,
రవాణా
సౌకర్యాలు🔥*
*💐చంద్రగిరిలో
పోస్టాఫీసు సౌకర్యం,
సబ్ పోస్టాఫీసు
సౌకర్యం, పోస్ట్
అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి.
లాండ్ లైన్
టెలిఫోన్, పబ్లిక్
ఫోన్ ఆఫీసు, మొబైల్
ఫోన్, ఇంటర్నెట్
కెఫె / సామాన్య
సేవా కేంద్రం, ప్రైవేటు
కొరియర్ మొదలైన సౌకర్యాలు
ఉన్నాయి. గ్రామానికి
సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ
రవాణా సంస్థ బస్సులుప్రైవేటు
బస్సులు తిరుగుతున్నాయి.
సమీప గ్రామాల
నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది.
వ్యవసాయం
కొరకు వాడేందుకు గ్రామంలో
ట్రాక్టర్లున్నాయి.
రైల్వే
స్టేషన్ గ్రామానికి 5
కి.మీ.
లోపు దూరంలో
ఉంది. రాష్ట్ర
రహదారి, ప్రధాన
జిల్లా రహదారి, జిల్లా
రహదారి గ్రామం గుండా పోతున్నాయి.
జాతీయ
రహదారి గ్రామం నుండి 5
కి.మీ.
లోపు దూరంలో
ఉంది. గ్రామంలో
తారు రోడ్లు, కంకర
రోడ్లు, మట్టిరోడ్లూ
ఉన్నాయి*.
No comments:
Post a Comment