*🔥కళింగ
యుద్ధం🔥*
*ప్రాచీన
భారతదేశపు యుద్ధం*
*💐కళింగ
యుద్ధం మౌర్య సామ్రాజ్యానికి,
కళింగ
రాజ్యానికి మధ్య జరిగింది.
దీనికి
అశోక చక్రవర్తి సారథ్యం
వహించాడు. కళింగ
రాజ్యం ఇప్పటి భారతదేశం యొక్క
ఒడిషా రాష్ట్ర ప్రాంతంలో
వుండేది. భారత
చరిత్రలో కళింగ యుద్ధం అతిపెద్ద,
అతి ఎక్కువ
రక్తపాతం జరిగిన యుద్ధాలలో
ఒకటిగా నిలిచింది.
కళింగులు
తీవ్రమైన ప్రతిఘటన చేసినా,
ఆఖరుకి
మౌర్యులే యుద్ధాన్ని గెలిచి,
కళింగ
రాజ్యాన్ని ఆక్రమించారు.
సాంస్కృతికంగా
కళింగ రాజ్యాన్ని రాజు లేకుండా
నిర్వహించే పద్ధతి ఒకటి
ఉన్నందున కళింగ ప్రాంతం/రాజ్యానికి
ప్రత్యేకించి ఒక రాజు అంటూ
ఎవరూ లేరు.[5]*
*తేదీ*
c. 261
– c. 260 బి.సి
*ప్రదేశం*
కళింగ,
భారతదేశంఫలితం నిర్ణయాత్మకంగా
మౌర్య సామ్రాజ్యం గెలిచింది
*రాజ్యసంబంధమైనమార్పులు*
మౌర్య
సామ్రాజ్యం లోని కళింగ ప్రాంతం
*🔥నేపధ్యం🔥*
*🟦కళింగ
రాజ్యంపై మౌర్యులు దండెత్తడానికి
రెండు కారణాలున్నాయి.
రాజకీయపరమైన
కారణం ఒకటి కాగా, మరొకటి
ఆర్థిక కారణం. కళింగ
రాజ్యంగ్ ఎంతో సంపన్న దేశం.
అంతేకాక,
అక్కడి
ప్రజలు కళాత్మకంగా అద్భుతమైన
నైపుణ్యం కలవారు. పైగా
అది ఎంతో ప్రశాంతమైన రాజ్యం.
ఇక్కడి
ప్రజలు మంచి కళా నైపుణ్యం
కలవారు కాబట్టే ఈ ప్రాంతానికి
"ఉత్కళ"
అని పేరు
వచ్చింది.[6] ఈ
ప్రాంతం మొత్తం మీద,
దేశానికి
ఆగ్నేయంగా ప్రయాణించి అక్కడి
దేశాలతో వాణిజ్య సంబంధాలు
కలిగిన మొట్టమొదటి రాజ్యం
కళింగ కావడం విశేషం.
దాంతో ఈ
రాజ్యానికి ముఖ్యమైన రేవు
పట్టణాలు, బలమైన
నౌకాదళం ఉండటం కూడా ఈ దండయాత్రకు
ఒకానొక కారణం. వీరి
సంస్కృతి ఎంతో విశాలమైనది.
అలాగే వారు
అందరికీ సమానమైన పౌర స్మృతిని
(యూనిఫాం
సివిల్ కోడ్) పాటించేవారు.[7]*
*321
బిసిలో
సామ్రాజ్య పతనం జరిగేంతవరకూ
కళింగ రాజ్యాన్ని నంద వంశం
పరిపాలించేది.[8] అశోకుని
ముందు అతని ముత్తాత చంద్రగుప్త
మౌర్యుడు కళింగ రాజ్యాన్ని
ఆక్రమించడానికి ప్రయత్నించి
విఫలమయ్యాడు. అందుకే
అశోకుడు, కొత్తగా
స్వాతంత్ర్యం పొందిన కళింగాన్ని,
పట్టాభిషిక్తుడైన
వెంటనే గెలవాలని ముందే
నిర్ణయించుకున్నాడు.
అతని రాజ్యంలో
తన స్థానం సుస్థిరం కాగానే
కళింగ రాజ్యం మీదకి దండెత్తాడు.[7]
ప్రస్తుత
ఒడిశా తీరప్రాంతాన్నే అప్పట్లో
కళింగ రాజ్యంగా వ్యవహరించేవారు*
*🔥అనంతర
పరిణామాలు🔥*
*🌀యుద్ధంలో
జరిగిన హింస చూసిన అశోకుడు,
ఇంతటి
వినాశనానికి తానే కారణమని
భావించాడు. కళింగ
ప్రాంతం మొత్తం దోపిడీకి
గురై, నాశనమైంది.
అశోకుని
అధికారుల లెక్కల ప్రకారం
కళింగుల వైపు 100,000 మంది
ఈ యుద్ధంలో చనిపోయారు.
అంతకు
తక్కువ కాకుండానే అశోకుని
వైపు కూడా జననష్టం జరిగింది.
కానీ కొందరు
ఒడిశా చరిత్రకారులు,
కళింగ
ప్రాంతపు వాసులు మాత్రం అవి
తప్పుడు లెక్కలనీ, అంత
భారీ నష్టం జరగలేదనీ,
ఈ లెక్కలన్నీ
అతిశయోక్తులనీ అరోపించారు.
వారి ప్రకారం
కళింగ సైన్యం తాము నష్టపోయిన
దానికన్నా రెండు రెట్లు
ఎక్కువగా శత్రు సైన్యాన్ని
నాశనం చేసింది. ఈ
యుద్ధంలో కొన్ని వేలమంది
స్త్రీ, పురుషులు
మరణించారు అన్నది మాత్రం
చరిత్ర చెప్పే నిజమని వారు
చెబుతారు*.
*ఎడిక్ట్స్
ఆఫ్ అశోకా అనే పుస్తకంలో కళింగ
యుద్ధం, దాని
పరిణామాలపై అశోకుని ప్రతిస్పందన
రాయబడింది. అప్పటికే
అశోకుడు బౌద్ధమతంలో ఉన్నా,
ఆ మత నియమాలను
పాటించడం లేదు. ఈ
యుద్ధం కారణంగా అతనిలో
రక్తపాతంపై విముఖత రావడంతో
పూర్తిస్థాయిలో బౌద్ధునిగా
మారిపోయాడు. ధర్మవిజయం,
అహింస
ధర్మాలే ఆచరణీయాలని నిర్ణయించుకున్న
అశోకుడు తన జీవితకాలంలో యుద్ధం
చేయనని ప్రతిజ్ఞ చేశాడు.
అప్పటి
నుంచీ సైన్య విస్తరణ,
రాజ్య
విస్తరణ, ఆక్రమణలను
పూర్తిగా మానేశాడు. ఈ
యుద్ధం తరువాత దాదాపు 40
ఏళ్ళ పాటు
రాజ్యం చేసిన అశోకుడు శాంతి,
సామరస్యం,
ప్రజల,
రాజ్య
శ్రేయస్సులే లక్ష్యాలుగా
రాజ్యం చేశాడు. అంతేకాక,
తన పిల్లలు
ఇద్దర్నీ దేశంలోనూ, ఇతర
దేశాల్లోనూ బౌద్ధ మత ప్రచారం
కోసం పంపాడు*.
No comments:
Post a Comment