నగదు బదిలీకి ఏది బెటర్?
*📝నగదు
బదిలీకి ఏది బెటర్?📝*
*🔹ఆన్‌లైన్,
డిజిటల్
లావాదేవీలు పెరుగుతున్నాయి.
ఇందుకు
కారణం నగదు తగినంతగా అందుబాటులో
లేకపోవడమే. డిజిటల్
ట్రాన్స్‌ఫర్ అయితే భారీ
మొత్తంలో నగదు తీసుకెళ్లాల్సిన
పని కూడా ఉండదు. దీంతో
దేశవ్యాప్తంగా ఆన్‌లైన్
ద్వారా నగదు లావాదేవీలు భారీ
స్థాయిలో జరుగుతున్నాయి.
ఈ పద్ధతి
లావాదేవీలు జరగడానికే కాకుండా
పెరగడానికి నెఫ్ట్ (నేషనల్
ఎలక్ట్రానిక్ ఫండ్స్
ట్రాన్సఫÛర్),
ఐఎంపీఎస్
(ఇమ్మీడియేట్
పేమెంట్ సర్వీస్),
ఆర్టీజీఎస్
(రియల్
టైం గ్రాస్ సెటిల్మెంట్)
వ్యవస్థలు
దోహదపడుతున్నాయి. వీటిని
మరింత ఎక్కువ మంది వినియోగించుకునే
విధంగా ఆర్బీఐ చర్యలు
తీసుకుంటోంది. ఇందులో
భాగంగా వీటి ద్వారా లావాదేవీలను
నిర్వహించే కాలంపై ఉన్న
పరిమితులను సడలించారు.
ఈ మూడు
విధానాల ద్వారా నగదు బదిలీ
జరుగుతోంది. వీటిలో
దేని ప్రత్యేకత దానిదే.
ఇంతకుముందు
ఐఎంపీఎస్ ద్వారా నగదు బదిలీ
రియల్ టైంలో జరిగేవి.
నెఫ్ట్
లావాదేవీల నిర్వహణపై కొన్ని
పరిమితులు ఉండేవి.
ఐఎంపీఎస్
మాదిరిగా నెఫ్ట్ కూడా ఇప్పుడు
24 గంటలు
అందుబాటులోకి వచ్చింది.
ఈ రెండూ
కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా
సేవలను అందిస్తున్నాయి.*
*🍁ఎంత
బదిలీ చేయవచ్చు....*
*🔸చిన్న
మొత్తంలో ఆన్‌లైన్ ద్వారా
నగదు బదిలీ చేయడానికి ఐఎంపీఎస్
విధానం ఉపయోగపడుతుంది.
దీని ద్వారా
గరిష్టంగా రెండు లక్షల రూపాయలు
బదిలీ చేయవచ్చు. ఎంత
తక్కువ మొత్తాన్ని అయినా
బదిలీ చేయవచ్చు. అంతేకాకుండా
నెఫ్ట్ ద్వారా అయితే గరిష్ట
మొత్తం బదిలీపై ఎలాంటి పరిమితీ
ఉండదు. దీని
ద్వారా పెద్ద మొత్తంలో నగదును
ఎప్పుడైనా బదిలీ చేయడానికి
అవకాశం ఉంటుంది. యూపీఐ
లేదా ఐఎంపీఎస్‌ల కన్నా ఎక్కువ
మొత్తంలో లావాదేవీలను జరపడానికి
అవకాశం ఉంటుంది.*
*🍁ఛార్జీలు...*
*🔸ఈ
జనవరి నుంచి నెఫ్ట్,
ఆర్టీజీఎస్
లావాదేవీలపై ప్రాసెసింగ్
ఛార్జీలను ఎత్తివేస్తున్నట్టు
ఆర్బీఐ ప్రకటించిన విషయం
తెలిసిందే. డిజిటల్
లావాదేవీలకు ప్రోత్సాహం
కల్పించే చర్యల్లో భాగంగా
ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
నెఫ్ట్
ద్వారా మరొకరికి ఇంటర్నెట్
బ్యాంకింగ్‌తో నగదు బదిలీ
చేయాలంటే ముందు వారి ఖాతా
నెంబరు జత చేసుకోవాల్సి
ఉంటుంది. ఇందుకోసం
వారికి సంబంధించిన బ్యాంక్
ఖాతా వివరాలతో పాటు ఐఎఫ్‌ఎస్‌సి
కోడ్ నెంబర్ అవసరం ఉంటుంది.
అయితే పెద్ద
మొత్తంలో నగదు బదిలీ చేయాలంటే
ఈ విధానం సరియైనది.*
*🍁ఐఎంపీఎస్
పై ఛార్జీలు...*
*🔸ఐఎంపీఎస్‌పై
ఛార్జీలు అమలవుతున్నాయి.
ఈ ఛార్జీలు
నగదు బదిలీ చేసే మొత్తంపై
ఆధారపడి ఉంటాయి. బదిలీ
చేసే సొమ్మును బట్టి రూపాయి
నుంచి రూ.25 వరకూ
బ్యాంకులు ఛార్జీలను వసూలు
చేస్తాయి. అయితే
ఈ ఛార్జీలను ఎత్తివేస్తే
డిజిటల్ లావాదేవీలు మరింతగా
పుంజుకోవడానికి అవకాశం
ఉంటుందని విశ్లేషకులు
చెబుతున్నారు. ఐఎంపీఎస్
ద్వారా మొబైల్ ఫోన్
వినియోగదారులు ప్రతిసారీ
బ్యాంకు వివరాలను ఎంటర్
చేయాల్సిన అవసరం ఉండదు.
మొబైల్
మనీ ఐడెంటిఫయర్ ద్వారా నగదు
బదిలీ చేయవచ్చు. దీన్నీ
బ్యాంకు నుంచి పొందవచ్చు.
అప్పుడు
రిజిస్టర్ అయిన మొబైల్
నెంబర్‌ను ఉపయోగించి,
నగదు బదిలీ
చేయవచ్చు. ఐఎంపీఎస్‌లో
ఖాతా నెంబర్‌తో పాటు ఐఎఫ్సికోడ్‌ను
ఎంటర్ చేసి, వెంటనే
నగదు బదిలీ చేయవచ్చు.
ఇక ఆర్టీజీఎస్‌ను
భారీ మొత్తంలో ఇంటర్ బ్యాంకు
నగదు బదిలీ కోసం వినియోగిస్తుంటారు*
No comments:
Post a Comment