బీదర్ కోట
*🔥బీదర్
కోట🔥*
*💐బీదర్
కోట కర్నాటకలోని ఉత్తర భాగంలో
ఉన్న బీదర్ నగరంలో ఉంది.
ఈ ప్రాంతం
పీఠభూమి ప్రాంతం. 1427లో
బహమనీ రాజవంశపు సుల్తాసు
అయిన సుల్తాన్ అల్లావుద్దీన్
బహమన్ తన రాజధానిని గుల్బర్గా
నుండి బీదర్ కు తరలించాడు.
ఆ కాలంలోనే
ఈ కోటను మరికొన్ని మొహమ్మదీయ
నిర్మాణాలను నిర్మించాడు.
ఇక్కడ దగ్గర
దగ్గర 30 నిర్మాణాలున్నాయి*
*కట్టిన
సంవత్సరం*
15వ
శతాబ్దం
*కట్టించింది*
అల్లావుద్దీన్
బహమన్
*వాడిన
వస్తువులు*
నల్లరాయి,
సున్నపు
ఆతుకు
*🔥భౌగోళికం🔥*
*ఇక్కడ
నగరానికి, జిల్లాకు,
కోటకూ ఒకటే
పేరు - బీదర్.
22 మైళ్ళ
పొడవు అత్యధికంగా 12 మైళ్ళ
వెడల్పు కలిగిన పీఠభూమికి
ఒక మూలన ఈ నగరం మరియు కోట
ఉన్నాయి. మొత్తం
విస్తీర్ణం 12 చదరపు
మైళ్ళు. ప్రాచీన
కళ్యాణి చాళుక్యుల రాజధాని
కల్యాణి (బసవ
కల్యాణ్) బీదర్
కు పశ్చిమంగా 40 మైళ్ళ
దూరంలో ఉంది*.
*🔥నది
వ్యవస్థ🔥*
*🥀బీదర్
నగరం, జిల్లాలోని
నగర పరిసర ప్రాంతాలు కారంజ
నది ద్వారా నీళ్ళ అవసరాన్ని
తీర్చుకుంటాయి. ఈ
కారంజ నది మంజీర నదికి ఉపనది*.
*🔥వాతావరణం🔥*
*🌀ఇక్కడి
వాతావరణం సంవత్సరం పొడుగునా
ఆహ్లాదకరంగా, అనుకూలంగా
ఉంటుంది. ఏప్రిల్
మే నెలల్లో కూడా అనుకోని
వర్షాలు కురిసి ఈ ప్రదేశం
చల్లబడుతుంది. జూన్
మొదట్లో నైఋతి ఋతుపవనాలు ఈ
ప్రాంతాన్ని చేరి మరింత
ఆహ్లాదకరమైన వాతావరణాన్ని
కలిగిస్తాయి. చలికాలంలో
కూడా ఈ ప్రాంతపు వాతావరణం
బాగుంతుంది.[4]*
*🔥చరిత్ర🔥*
*🏮ప్రస్తుత
బీదర్ కోటను కట్టించింది
బహమనీ సుల్తాను అల్లావుద్దీన్
బహమన్ అనీ, అతడు
1427లో
తన రాజధానిని గుల్బర్గా నుండి
బీదర్ కు తరలించినప్పుడు
కట్టించాడనీ చరిత్ర ద్వారా
తెలుస్తున్నది. ఈ
ప్రదేశం మెరుగైన వాతావరణం,
సారవంతమైన
భూమి కలిగి ఉండటమే ఇందుకు
కారణంగా చెప్పుకోవచ్చు.
ఈ ప్రదేశంలో
దృఢమైన, చిన్నదైన
ఒక కోట ఉందనీ 1322 లో
జరిగిన మొదటి ముస్లిం దండయాత్ర
కు సంబంధించిన రాజకుమారుడు
ఉలుఘ్ ఖాన్ ద్వారా తుగ్లక్
సామ్రాజ్యం కిందకు వచ్చిందనీ
ఆధారాలున్నాయి. బహమనీ
సామ్రాజ్యం స్థిరపడ్డాక
1347లో
బీదర్ సుల్తాన్ అల్లావుద్దీన్
బహమన్ షా బహమనీ పాలనలోకి
వచ్చింది. మొదటి
అహ్మద్ షా (1422-1486) పాలనలో
బీదర్ బహమనీ సామ్రాజ్యపు
రాజధాని అయింది. పాత
కోట స్థానంలో కొత్త కోటతో
పాటుగా మద్రాసాలు,
మసీదులు,
మహల్లు,
రాజభవనాలు,
తోటలు
నిర్మించబడ్డాయి. బీదర్
చరిత్రలో చెప్పుకోదగ్గ వ్యక్తి
1466లో
ప్రధాన మంత్రిగా పని చేసిన
మహమ్మద్ గవాన్. క్రీ.శ.
1656 లో ముఘల్
చక్రవర్తి ఔరంగుజేబ్
ఆక్రమించుకునేవరకూ ఈ కోట
బారిద్ షాహీ సామ్రాజ్యం
అధీనంలో ఉంది. 1724లో
బీదర్ నిజాము నవాబులైన ఆసఫ్
జాహీల అదుపులోకి వచ్చింది.
బీజాపుర్
సామ్రాజ్యంలోకి 1619-20 లలో
చేర్చబడి 1657లో
ముఘల్ రాజప్రతినిధిత్వం
కిందకు వచ్చి, 1686 నాటికి
ముఘల్ సామ్రాజ్యంలో భాగమయింది.
1751 నుండి
1762 మధ్య
ఆసఫ్ జా మూడవ కుమారుడైన నవాబ్
సఈద్ మొహమ్మద్ ఖాన్ అసఫుద్దౌలా
బీదర్ కోట నుండి సామ్రాజ్యాన్ని
పాలించాడు. తన
తమ్ముడు మూడవ మీర్ నిజాం అలీ
ఖాన్ ఆసఫ్ జా ఇతన్ని కోటలో
బంధించి 16 సెప్టెంబర్
1763 లో
హత్య చేయించే వరకూ అతని పాలన
కొనసాగింది. బీదర్
కు పాత పేరైన మొహమ్మదాబాద్
కూడా ఇతని స్మృతిలోనే పెట్టబడింది.
ఆ విధంగా
బహమనీ రాజులు గుల్బర్గా నుండి
1347-1424 మధ్య
కాలంలో 1424 నుండి
రాజ్యం సమాప్తి చెందే వరకూ
బీదర్ నుండి పరిపాలన సాగించారు.
ఆ పైన
సామ్రాజ్యం 5 ముక్కలయింది.
బీజాపుర్,
గోల్కొండ,
అహ్మద్
నగర్, బీదర్,
బేరార్
ప్రాంతాలుగా సామ్రాజ్యం
విడిపోయింది. భారత
స్వాతంత్ర్యం తరువాత 1956లో
బీదర్ మైసూర్(ప్రస్తుత
కర్నాటక) లో
భాగమయింది*
No comments:
Post a Comment