Tuesday, April 7, 2020
సాలెగూడులో బోలుగావుండే కీటకాల అవశేషాలు ఎక్కడనుంచి వస్తాయి?
✳సాలెపురుగు
తన ఉదరభాగానికి కిందివైపున
ఉండే గ్రంధుల నుంచి స్రవించే
ద్రవం సాయంతో గూడును అల్లుతుంది.
ఆ ద్రవం
గట్టిపడి దారంలాగా అవుతుంటుంది.
సాలెగూడు
దారాలు సన్నగా దృఢంగా
ఉండటమేకాకుండా ఒక జిగురులాంటి
పదార్థాన్ని కలిగి ఉంటాయి.
గాలిలో
ఎగురుతూ వచ్చే కీటకాలు గూడును
గమనించలేక దాన్ని తాకి కాళ్లు,
రెక్కలు
అతుక్కుపోయి చిక్కుకుంటాయి.
అక్కడ నుంచి
తప్పించుకొనే ప్రయత్నంలో
వాటి దేహాలు మరిన్ని దారాలకు
చుట్టుకుపోతాయి. కీటకాల
కదలికలతో గూడు కంపించడం వల్ల
ఏ మూలనో ఉన్న సాలె పురుగు
వాటిని గ్రహించి అతి వేగంగా
అక్కడికి చేరుకుంటుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment