*🔥కార్టోశాట్-3 విశేషాలు (పీఎస్‌ఎల్‌వీ-సీ47 ప్రయోగం)🔥*
*▪మూడోతరం
హైరెజల్యూషన్ ఎర్త్ ఇమేజింగ్
ఉపగ్రహం అయిన కార్టోశాట్-3*
*▪బరువు
1,625 కిలోలు*.
*▪జీవిత
కాలం ఐదేళ్లు.*
*▪పూర్తి
స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది.*
*▪కార్టోశాట్-3
దేశంలోకి
చొరబడే ఉగ్రవాదులను పసిగట్టడంతోపాటు
వారి కదలికలు, స్థావరాలపై
నిఘా ఉంచి ఎప్పటికప్పుడు
సమగ్ర సమాచారమందిస్తూ నిఘా
నేత్రంలా పనిచేయనుంది.*
*▪సైనిక
అవసరాలకే కాకుండా ప్రకృతి
విపత్తుల సమయాల్లోనూ ఈ ఉపగ్రహం
సేవలందించనుంది.పట్టణ,
గ్రామీణ
ప్రాంతాల్లో ప్రణాళికలు,
తీరప్రాంత
నిర్వహణ, రహదారుల
నెట్‌వర్క్ పరిశీలన,
నీటి సరఫరాపై
అధ్యయనానికి దీన్ని
వినియోగించుకోవచ్చు.*
*▪కార్టోశాట్-3లోని
కెమెరాకు 0.25 మీటర్ల
కంటే మెరుగైన రిజల్యూషన్
చిత్రాల్ని తీసే సామర్థ్యముంది.*
*▪ఈ ఉపగ్రహ
తయారీకి ఇస్రో రూ.350
కోట్లకు
పైగా ఖర్చు చేసింది.*
*▪చంద్రయాన్-2
తర్వాత
ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం
ఇదే.*
*▪పీఎస్‌ఎల్‌వీ
సీరీస్ లో ఇది 49వ
ప్రయోగం కాగా.. షార్
నుంచి 74వ
రాకెట్ ప్రయోగం.*
*▪పీఎస్‌ఎల్వీ
సీ-47 ను
ఎక్స్‌ఎల్(XL) తరహాలో
రూపొందించారు.*
No comments:
Post a Comment