*🔴పొద్దుతిరుగుడు పువ్వు ఎప్పుడూ సూర్యునివైపే తిరగడానికి కారణం ఏమిటి?*
✳పొద్దు
తిరుగుడు పువ్వు (దీనిని
సూర్యకాంత పుష్పం Sun
flower) అని
కూడా అంటారు. సూర్యుడు
తూర్పున ఉదయించింది మొదలు
సాయంత్రం పడమరలో అస్తమించే
వరకు అది సూర్యుని వంకే
చూస్తున్నట్లుగా తిరుగుతూ
ఉంటుంది.
ఈ
పువ్వు ఇలా తిరగడానికి కారణం
ఈ మొక్కలో ఉండే ఫొటోట్రాపిజం
అనే లక్షణమే. ఫొటోట్రాపిజం
అంటే, కంటికి
కనిపించే సూర్యరశ్మి వలన
మొక్క పెరుగుదలతోపాటు కలిగే
ప్రతిస్పందన అని చెప్పుకోవచ్చు.
పొద్దుతిరుగుడు
మొక్క కాండంలో ఉండే 'ఆక్సిన్'
అనే హార్మోన్
ఈ స్పందనను ప్రేరేపిస్తుంది.
ఈ హార్మోన్
మొక్కలు పొడవుగా, ఏపుగా
పెరగడానికి దోహదపడుతుంది.
మొక్కల్లో
ఉన్న ఎమినో ఆసిడ్ (amino
acid) వల్లగాని,
కార్బోహైడ్రేటులో
విచ్ఛిన్నం కావడం వల్ల గాని
ఈ హార్మోన్ ఏర్పడుతుంది.
ఈ హార్మోన్
మొక్కలో ఉన్న కణాల గోడలపై
ఉన్న కార్బోహైడ్రేటుల బంధాలపై
పనిచేస్తాయి. తద్వారా
మొక్కల పెరుగుదలకు ఉపయోగపడతాయి.
'ఫొటోట్రాపిజం'
ధర్మం ఉన్న
పొద్దుతిరుగుడు మొక్కపై
సూర్యరశ్మి నేరుగా పడినపుడు
ఆ మొక్క వెనుక భాగంలో అంటే
పువ్వు వెనుక ఉన్న కాండంపై
నీడ ఉంటుంది. సూర్యరశ్మి
నేరుగా సోకని ఆ చీకటి భాగాలలో
'ఆక్సిన్'
హార్మోన్
ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.
అందువల్ల
ఆ భాగం వేగంగా పెరుగుతుంది.
అందువల్ల
ఆ దిశలో మొక్క, దానితోపాటు
పొద్దుతిరుగుడు పువ్వు
కదులుతాయి. నీడలో
ఉండే కాండం పెరిగే కొద్దీ,
ఆ పెరుగుదల
మొక్కను నీడనుంచి సూర్యరశ్మి
పడే దిశలోకి కదిలిస్తుంది.
ఫలితంగా
పొద్దుతిరుగుడు పువ్వు ఎప్పుడూ
సూర్యుణ్ని చూస్తూ ఆనందపడుతుంది.
No comments:
Post a Comment