కృత్రిమంగా అమర్చే ఆక్సిజన్ సిలిండర్లు ఎలా పనిచేస్తాయి?
*🔥కృత్రిమంగా
అమర్చే ఆక్సిజన్ సిలిండర్లు
ఎలా పనిచేస్తాయి?🔥*
*🌀కృత్రిమ
శ్వాస అందించడంలో కీలకమైనవి
ఆక్సిజన్ వెంటిలేటర్లే.
మామూలు
సిలిండర్లలో పెద్ద పనితనం
ఏమీ లేదు. చిన్న
వాల్వ్ పిన్నును తెరవడం,
రెగ్యులేటర్ల
ద్వారా సిలిండర్లలోని గాలిని
ఒకే దిశలో ఆశించిన పీడనంలో
బయటకు పంపడం మినహా వాటిలో
మరే తతంగం లేదు. కానీ
ఆక్సిజన్ వెంటిలేటర్లు
వేరు. ఎవరికయినా
అత్యవసర చికిత్స అవసరమైనపుడు,
ఊపిరితిత్తుల
పనితనం స్తంభించిపోయినపుడు,
కోమాలోకి
వెళ్లినపుడు కృత్రిమంగా
శ్వాస ప్రక్రియను నిర్వహించాలి.
అలాంటి
సందర్భాలలో సిలిండర్లలో ఉన్న
ఆక్సిజన్‌ను తగు మోతాదులో
తగిన పీడనంలో రోగి ముక్కు
లేదా నోటి ద్వారా ఊపిరితిత్తుల్లోకి
పంపుతారు. సాధారణంగా
ఇలా కృత్రిమంగా పంపే ఆక్సిజన్
(ఒక్కోసారి
నైట్రోజన్‌లో కలిసి)
పీడనం బయటి
వాతావరణ పీడనం కన్నా హెచ్చుగా
ఉండడం వల్ల బలవంతంగానే ఆక్సిజన్
లోపలికి వెళ్లి రోగి ఊపిరితిత్తుల
ద్వారా రక్తంలో కలుస్తుంది.
అదే సమయంలో
అధిక పీడనం వల్ల వ్యాకోచించిన
ఊపిరితిత్తుల ప్రోద్బలంతో
పేషెంటు ఉదర వితానం (diaphragm)కూడా
వ్యాకోచిస్తుంది. ఇది
ఉచ్ఛ్వాస ప్రక్రియ (inspiration).ఈ
దశకాగానే ప్రత్యేకమైన వాయు
సరఫరా పద్ధతుల ద్వారా గాలిని
పంపడం నిలుపు చేస్తారు.
అప్పుడు
ఉదరవితానం సంకోచించడం ద్వారా
నిశ్వాస ప్రక్రియ
(expiration)జరుగుతుంది.
అపుడు
విడుదలయ్యే కార్బన్‌డయాక్సైడు,
నీటి ఆవిరి
మరో మార్గం ద్వారా గాల్లో
కలుస్తాయి. ఇలా
ఉచ్ఛ్వాస, నిశ్వాస
ప్రక్రియనే కృత్రిమ శ్వాస
క్రియ అంటారు. ఈ
విధానంలో ఉపయోగపడే పరికరాల్ని
వెంటిలేటర్లు అంటారు.*
No comments:
Post a Comment