Sunday, April 5, 2020

రాయిమర్ ఉష్ణమాపకం

*🌡🔥రాయిమర్ ఉష్ణమాపకం🔥🌡*

*💐రాయిమర్ (సంకేతం °R) ఉష్ణోగ్రతామానాన్ని 1730 లో భౌతిక శాస్త్రవేత్త అయిన René Antoine Ferchault de Réaumur (1683–1757) కనుగొన్నారు. ఉష్ణమాపకమును మొదట మంచు ముక్కలలో ఉంచి మంచు ముక్కలు కరిగునపుడు పాదరస మట్టాన్ని గుర్తించి 00 R గా తీసుకున్నాడు. (మంచు ద్రవీభవన ఉష్ణోగ్రత 00 R) . ఇపుడు అదే ఉష్ణమాపకాన్ని హిప్సోమీటర్లో ఉంచి నీరు ఆవిరిగా మారినపుడు పాదరస మట్టం గుర్తించి దానికి 800 R గా తీసుకున్నాదు. (నీటి బాష్పీభవన ఉష్ణోగ్రత 800 R) . ఉష్ణమాపకం పై గల ఊర్ధ్వ, అధో స్థిర స్థానలను గుర్తించిన తర్వాత దానిని 180 సమ భాగాలుగా చేశాడు.సెల్సియస్ ఉష్ణ మాపకంలో సెల్సియస్ ఊర్థ్వ స్థిర స్థానంగా 800 R మరియు అధో స్థిర స్థానంగా 00 R గా తీసుకున్నాడు.*

*🔥ఉష్ణమాపకాలు-నిర్మాణం అనుసరించి రకాలు🔥*
*●ద్రవ ఉష్ణమాపకములు (liquid thermometers) - యివి "ద్రవపదార్థాలు వేడి చేస్తే వ్యాకోచిస్తాయి" అనే నియమం పై పనిచేస్తాయి*.
*వాయు ఉష్ణమాపకములు (Gas thermometers) - "వాయుపదార్థాలు వేడి చేస్తే వ్యాకోచిస్తాయి" అనే నియమం పై పనిచేస్తాయి*.

*●నిరోధక ఉష్ణమాపకములు Resistance* *thermometers) - ఉష్ణోగ్రతా మార్పుల వలన వాహకములలో యేర్పడు నిరోధం ఆధారంగా పనిచేస్తాయి*.

*●ఉష్ణ విద్యుత్ ఉష్ణమాపకములు (Thermo electric thermometers) - యివి ఉష్ణ యుగ్మంలో వేడి, చల్లని సంధుల వద్ద ఉష్ణ-విద్యుచ్చాలక బలం లలో మార్పుల ఆధారంగా పనిచేస్తాయి*.

*●ధార్మిక ఉష్ణమాపకములు (Radiation thermometers) - యివి ఒక వస్తువు నుండి వెలువడే ఉష్ణ ధార్మికత ఆధారం చేసుకుని పనిచేస్తాయి*.

*💐ఉష్ణమాపకాలలోని నిర్మాణపరంగా రకాలు వున్నాయి, అవి: గాజుగొట్టంతో చేసినవి (glass thermometer), లోహనిర్మితమైన డయల్ గేజి (dail guage), మరియు పైరోమిటరు (pyro meter). గ్లాసు థెర్మామీటరులో పాదరసం నింపినవాటితో 2200C వరకు, అల్కహల్ నింపినవి గరిష్టం1100C వరకు ఉపయోగిస్తారు. డయల్ గేజు థర్మామిటరులలోను వాయువు నింపినవి (gas filled), పాదరసం(mercury) నింపినవి, మరియు థెర్మోకపుల్ మెటల్ (thermo coupled). డయల్ గేజు థెర్మామీటరుల నుపయోగించి 30-1500 C (కొండొకచో 2000 C) వరకు ఉష్ణోగ్రతను కొలవవచ్చును. అంతకుమించి ఉష్ణొగ్రతను కొలుచుటకు పైరోమీటరుల నుపయోగిస్తారు. ప్రస్తుతం డిజిటల్ థెర్మొ, మరియు నాన్ కాంటాక్ట్ డిజిటల్ థెర్మామీటరు లొచ్చాయి.*

*🔥వైద్య ఉష్ణమాపకం🔥*
*💐వైద్య ఉష్ణమాపకంను మానవ శరీర ఉష్ణోగ్రత కొలవడానికి ఉపయోగిస్తారు. వైద్య ఉష్ణమానిని ఆంగ్లంలో మెడికల్ థర్మామీటర్ లేదా క్లినికల్ థర్మామీటర్ అంటారు. ఈ థర్మామీటర్ కొనను నోటి లోపల నాలుక కింద సంచుల వంటి ఖాళీలలోని ఒక ఖాళీనందు లేదా చంక క్రింద లేదా పాయువు ద్వారా పురీషనాళంలో కొంత సేపు ఉంచడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను తెలుసుకుంటారు*.

*వైద్య ఉష్ణమాపకం ద్వారా మానవ ఉష్ణోగ్రతను కొలవటం వలన మానవుల జ్వర స్థాయిని కచ్చితంగా తెలుసుకోగలుగుతున్నారు. వైద్య ఉష్ణమాపకాన్ని వాడడం, శుభ్రపరచడం చాలా తేలిక అంతేకాక అందుబాటు ధరలలో లభిస్తున్నాయి. ఆరోగ్య జీవనానికి అవసరమైన వైద్య సాధనాలలో ప్రతి ఇంటిలో కచ్చితంగా ఉంచుకోవలసిన చౌకైన, ఉత్తమమైన వైద్య పరికరం ఇది. సాధారణంగా చేతిని పట్టుకోవడం ద్వారా, లేదా పొట్ట వద్ద, లేదా నుదుటి వద్ద చేత్తో తాకటం ద్వారా జ్వర స్థాయిని అంచనా వేస్తుంటారు, కానీ ఈ పద్ధతిలో జ్వరం స్థాయి కచ్చితంగా ఇంత ఉందని చెప్పటం కష్టం.*



🌡
*🔶మానవుని ఉష్ణోగ్రతను తెలుసుకునేందుకు సాధారణంగా, ఎక్కువగా పాదరసంతో ఉన్న వైద్య ఉష్ణమాపకాలను ఉపయోగిస్తుంటారు. పాదరస ఉష్ణమాపకాన్ని ఉపయోగించే ముందు పాదరసం ఉన్న బల్బు కొనను కిందకు ఉంచి పై భాగాన్ని చేతితో పట్టుకొని నెమ్మదిగా కొన్నిసార్లు కిందికి విదిలించినట్లయితే పాదరసం బల్బులోనికి దిగుతుంది. అప్పుడు నోరును తెరవమని నాలుకను పైకెత్తమని నోటిలో నాలుక కింద పాదరసంతో ఉన్న బల్బు కొనను ఉంచాలి. మెడికల్ థర్మామీటర్ పై ఎక్కువ ఒత్తిడి కలగకుండా నోటిని నెమ్మదిగా మూయమని చెప్పాలి. ఎందుకంటే దంతాలకు నొక్కుకొని వైద్య ఉష్ణమాపకం ఎక్కువ ఒత్తిడికి గురై పగిలిపోవచ్చు, కావున కొంచెం జాగ్రత్త వహించవలసి ఉంటుంది. కచ్చితమైన ఫలితాల కోసం వైద్య ఉష్ణమాపకాన్ని పెదవులను మూసి నోటిలోపల కనీసం 3 నిమిషాలు ఉంచాలి. ఈ సమయంలో నోరు తెరవకూడదు, ఊపిరిని ముక్కుతో మాత్రమే తీసుకోవాలి. థర్మామీటరును నోటి నుంచి బయటికి తీసిన తరువాత ఉష్ణోగ్రత ఎంత ఉందో చూసుకొని చల్లని సబ్బునీటితో శుభ్రపరచుకోవాలి*


No comments:

Post a Comment