Saturday, April 4, 2020

బెంజీన్

బెంజీన్


*💐బెంజీన్ ఒక ముఖ్యమైన సేంద్రియ రసాయన సంయోగ పదార్థం. ఇది ఆరోమాటిక్ వర్గానికి చెందిన హైడ్రోకార్బన్. బెంజీన్ యొక్క రసాయన సంకేత పదంC6H6.ఒక అణువు బెంజీన్ లో ఆరు కార్బను మరియు ఆరు హైడ్రోజన్ పరమాణువులు ఆరుభుజాలతోఒక వలయంలా ఏర్పడి ఉండును[11].ముడి పెట్రోలియంలో స్వాభావికంగా ఉండు పదార్థం బెంజీన్. బెంజీన్ అణువులోని కార్బన్ పరమాణువుల మధ్య ఉన్న చక్రీయ అనియత పై బంధం (pi bond) కారణంగా బెంజీన్‌ను ఆరోమాటిక్ హైడ్రోకార్బన్ గా వర్గీకరించడమైనది.బెంజీన్ రంగులేని, అత్యంత వేగంగా మండుస్వాభావమున్న ద్రవం మరియు ద్రావణి. బెంజీన్ తియ్యని వాసన వెలువరించును[12].ఇథైల్ బెంజీన్, మరియు కుమేన్ (cumene) వంటి సంక్లిష్ట అణునిర్మాణమున్న రసాయన పదార్థాల ఉత్పత్తికి బెంజీన్ ను పూర్వగామిగా (precursor) గా ఉపయోగిస్తారు.బెంజీన్ అధికస్థాయి ఆక్టేన్ సంఖ్య కల్గిఉన్నందున, గాసోలిన్/పెట్రోలు లోని బెంజీన్ అంశీభూతాలలోముఖ్యమైనది.బెంజీన్ క్యాన్సర్ కారణం కనుక పారిశ్రామికేతర వినిమయం పరిమితం*

*రసాయన ఫార్ములా*
C6H6

*మోలార్ ద్రవ్యరాశి*
78.11 g·mol−1

*స్వరూపం*
Colorless liquid

*వాసన*
Aromatic, gasoline-like

*సాంద్రత*
0.8765(20) g/cm3[1]
ద్రవీభవన స్థానం5.53 °C (41.95 °F; 278.68 K)

*బాష్పీభవన స్థానం*
80.1 °C (176.2 °F; 353.2 K)

*నీటిలో ద్రావణీయత*
1.53 g/L (0 °C)
1.81 g/L (9 °C)
1.79 g/L (15 °C)[2][3][4]
1.84 g/L (30 °C)
2.26 g/L (61 °C)
3.94 g/L (100 °C)
21.7 g/kg (200 °C, 6.5 MPa)
17.8 g/kg (200 °C, 40 MPa)[5]

*ద్రావణీయత*
Soluble in alcohol, CHCl3, CCl4, diethyl ether, acetone, acetic acid[5]

*🔥భౌతిక ధర్మాలు🔥*

*భౌతిక స్థితి*
బెంజీన్ రంగులేని, పారదర్శకంగా ఉన్నద్రవం. పెట్రోల్ వంటి వాసన కల్గిఉన్నది.బెంజీన్ అణుభారం 78.11184గ్రాములు/మోల్−1[13].

*సాంద్రత*
బెంజీన్ సాంద్రత 0.8765గ్రాములు/సెం.మీ3

*ద్రవీభవన ఉష్ణోగ్రత*
బెంజీన్ ద్రవీభవన స్థానం 5.53 °C (41.95 °F; 278.68K)

*బాష్పీభవన ఉష్ణోగ్రత *
బెంజీన్ బాష్పీభవన స్థానం 80.1 °C (176.2 °F; 353.2K)

*ద్రావణీయత*
నీటిలో చాలా అల్ప ప్రమాణంలో కరుగును. ఒకలీటరు నీటిలో 0 °C వద్ద 1.53 గ్రాములు, 30 °C వద్ద 1.84 గ్రాములు, 61 °C వద్ద 2.26 గ్రాములు కరుగును.ఇంకా ఆల్కహాల్, కార్బన్ ట్రై క్లోరైడ్ (CHCl3, కార్బన్ టెట్రాక్లోరైడ్ (CCl4, డై ఇథైల్ ఈథర్, ఎసిటోన్ మరియుఎసిటిక్ ఆమ్లంలో కరుగును.

*వక్రీభవన గుణకం*
బెంజీన్ యొక్క వక్రీభవన గుణకం 20 °Cవద్ద: 1.5011, మరియు 30°Cవద్ద: 1.4948

*స్నిగ్ధత*
బెంజీన్ యొక్క స్నిగ్ధత 10 °C 0.7528 cP. 40 °C దగ్గర 0.4965cP

*🔥చరిత్ర🔥*

*🌀ఐతిహాసికంగా బెంజీన్ అనుపదం, 15 వ శతాబ్ది నుండియు దక్షిణ తూర్పుఆసియా (ఆగ్నేయ ఆసియా) కు చెందిన, 15 వ శతాబ్ది నుండియు యూరోపియన్ మందుల తయారిదార్లకు మరియు సుగంధ ద్రవ్య ఉత్పత్తిదారులకు తెలిసిన గమ్‌బెంజోయిన్ ( బెంజోయిన్ రెసిన్) నుండి వచ్చింది. బెంజోయిన్ నుండి ఉత్పాదితం ద్వారా అమ్లగుణమున్న రాసాయాన్ని ఉత్పత్తి చేసి, దానికి ఫ్లవర్స్ ఆఫ్ బెంజోయిన్ లేదా బెంజోయిక్ ఆమ్లం అని వ్యవహరించేవారు.ఈ విధంగా బెంజోయిక్ఆమ్లం నుండి ఉత్పతి చేయబడిన ఈ హైడ్రోకార్బన్ కాలక్రమేనా బెంజైన్, బెంజోల్, లేదా బెంజీన్ అని వ్యవహరింపబడింది*.

*1825లో మొదటగా మైఖేల్ ఫారడే వెలుగించుటకు ఉపయోగించు వాయువు నుండి వేరు చేసి, దీనికి బైకార్బురేట్ ఆఫ్ హైడ్రోజన్ అని నామకరణం చేసాడు[14] . 1833లో ఎయిల్హార్డ్ మిత్స్ చెర్లిష్ (Eilhard Mitscherlich) బెంజోయిక్ ఆమ్లం మరియు సున్నాన్ని కలిపి స్వేదన క్రియద్వారా బెంజీన్ ఉత్పత్తి చేసాడు. ఆయన రసాయన పదార్థాన్ని బెంజైన్ (benzin) అని పిలిచాడు. 1836 లో ఆగస్టు లారెంట్ (Auguste Laurent ) ఈ పదార్థానికి పేరును ఫేనే (phène) గా నిర్ణయించాడు. ఈ పదమే ఇంగ్లీషు పదం ఫెనోల్ ("phenol") కు మూలపదం. ఫెనోల్ అనునది హైడ్రోక్సిలేటేడ్ బెంజీన్. ఫెనైల్ (phenyl", ) అనునది బెంజీన్ నుండి హైడ్రోజన్ పరమాణువు (స్వేచ్ఛా రాడికల్ H•) ను వేరుచేయగా/ సారగ్రహణం చేయగా (abstraction) ఏర్పడిన రాడికల్ పదార్థం. 1845లో ఆగస్టు విలహేం వోన్ హోఫ్ మాన్ (August Wilhelm von Hofmann) తో పనిచేయునపుడు చార్లెస్ మాన్స్‌ఫీల్డ్ (Charles Mansfield) కోల్ తార్ నుండి బెంజీన్‌ను వేరు చేసాడు. నాలుగు సంవత్సారాల తరువాత చార్లెస్ మాన్స్‌ఫీల్డ్ మొదటిసారిగాపారిశ్రామిక స్థాయిలో, కోల్ తార్ విధానంపై ఆధారపడి బెంజీన్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభించాడు*.

*మిగతా కెమిస్ట్‌లు కుడా బెంజీన్‌కు సంబంధిన రసాయనాలను ఉత్పత్తి కావించడం మొదలుపెట్టారు.1855లో హోఫ్ మాన్ ఆరోమాటిక్అనేపదాన్ని బెంజీన్ కుటుంబానికి చెందిన పదార్థాల సంబంధాన్ని తెలుపుటకు వాడాడు. 1997లో అంతరిక్ష అంతర్భాగంలో బెంజీన్ ఉనికిని గుర్తించారు*

*🔥అణు వలయ సౌష్టవం🔥*

*🔶బెంజీన్ రసాయన సంయోగ పదార్థం యొక్క ఎంపిరికల్ ఫార్ములా గురించి చాలా ఏళ్లగాతెలిసి ఉన్నప్పటికీ, అణువులోని ఒక హైడ్రోజన్ పరమాణువు ప్రతి ఒక్కోకార్బన్‌తో కల్గిఉన్న బహు అసంతృప్త నిర్మాణం (polyunsaturated) చాలాకాలం పెద్ద సవాల్‌గా ఉండినది. 1858 లో ఆర్చిబాల్డ్ స్కాట్ కోపెర్ (Archibald Scott Couper), 1861లో జోసెఫ్ లోస్చ్‌మిడస్ట్ (Joseph Loschmidt ) లు పలు ద్విబందాలు కల్గిన పలు వలయాకార అణుసౌష్టవాన్ని ఉహించారు, కాని కెమిస్ట్‌లకు నిరూపణకు చిన్న ఆధారం/రుజువు లభించలేదు.1865 లో ఫ్రెడ్రిక్ ఆగస్టు కెకులే (Friedrich August Kekulé ) ఫ్రెంచ్ భాషలో ఒక వివరణ/ప్రకటన పత్రాన్ని విడుదల చేసాడు.అందులోఅణువులోని ఆరుకార్బన్‌లు ఒక ఏకబంధం తరువాత ఒకద్విబంధం, తరువాత ఏకబంధం ఇలా ఒకటి వదలి ఒకటి పద్ధతిలో (alternating ) ఏక మరియు ద్విబందాలు ఏర్పరచు కొనిఉండునని ప్రకటించాడు. మరుసటి సంవత్సరం, జర్మనీ భాషలో ఇంతకన్నా విపులమైన ప్రకటన పత్రాన్ని, ఇదే విషయంపై వివరణపత్రాన్ని విడుదల చేసాడు*.

*🔥అణునిర్మాణం🔥*

*📚ఎక్సు-కిరణాల వివర్తనం (X-ray diffraction) ద్వారా బెంజీన్ అణువును పరిశీలించగా, కార్బన-కార్బన్‌లమధ్య దూరం సమానంగా 140 పైకోమీటర్లు (140 pm) ఉంది.ఈ బంధదూర విలువలు, కార్బన్-కార్బన్‌ల మధ్య ఉండు ద్విబంధ దూరం (135 pm) కన్న ఎక్కువ మరియు ఏకబంధం (147 pm) కన్న తక్కువ.ఈ మధ్యంతర బంధదూర విలువలకు కారణం అణువులలోని పరమాణు ఎలక్ట్రాన్‌ల స్థానంతరం (delocalization) వలన జరిగింది. కార్బన్-కార్బన్ బంధంలోని ఎలక్ట్రానులు సమానంగా ఆరు కార్బన్ పరమాణువుల మధ్య పంచబడినవి.బెంజీన్ 6 హైడ్రోజన్ పరమాణువుల మాత్రమే కల్గిఉన్నది. ఇది దీని మాతృకలైన ఆల్కేన్ మరియు హెక్సేన్ కన్న తక్కువ హైడ్రోజన్ పరమాణువులను కల్గి ఉన్నది*⌬⌬

No comments:

Post a Comment