Friday, April 3, 2020

ఆర్టికల్‌ 35ఏ పూర్తి వివరణ

ఆర్టికల్‌ 35; హక్కుల నిబంధన  

*👉రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్‌ జమ్మూకశ్మీర్‌ ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తుంది.*

*👉జమ్మూకశ్మీర్‌ శాశ్వత నివాసి ఎవరు? అన్న దానిని నిర్వచిస్తుంది.*

*👉వారి స్థిరాస్తి హక్కుల్ని నిర్ధారిస్తుంది.*

*🇮🇳కశ్మీరీ నివాసి అంటే..*

*🇮🇳కశ్మీర్‌ శాశ్వత నివాసి ఎవరు అన్న దానిని రాష్ట్ర రాజ్యాంగం నిర్వచించింది. 1954 మే 14వ తేదీకన్నా ముందు లేదా ఆ తేదీ నాటికి రాష్ట్రంలో జన్మించిన వ్యక్తి లేదా, పదేళ్లపాటు రాష్ట్రంలో నివసించిన వ్యక్తి కశ్మీర్‌ శాశ్వత నివాసి అవుతాడు. ఆ వ్యక్తి రాష్ట్రంలో స్థిరాస్తుల్ని కలిగి ఉండవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వం కల్పించే స్కాలర్‌షిప్‌లు, ఇతరత్రా సహాయాల్లాంటి ప్రత్యేక ప్రయోజనాలు పొందొచ్చు. దీర్ఘకాలం రాష్ట్రంలో నివసిస్తున్న వారికి సర్టిఫికెట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేయొచ్చు. రాష్ట్ర స్థిర నివాసులు ఎవరో నిర్వచించడం కోసం చట్టాలు చేసే అధికారాన్ని జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీకి ఆర్టికల్‌ 35ఏ కట్టబెట్టింది. అయితే ఈ నిర్వచనాన్ని మూడింట రెండొంతుల మెజారిటీతో రాష్ట్ర అసెంబ్లీ మార్చొచ్చు. కశ్మీరీ మహిళ కశ్మీరేతరుణ్ని పెళ్లిచేసుకుంటే మాత్రం- ఆమె ఈ రాష్ట్రంలో స్థిరాస్తుల్ని కలిగి ఉండటానికి వీల్లేదు. ఆమె పిల్లలకూ ఆ ఆస్తిపై హక్కు ఉండదు. పిల్లలకు శాశ్వత నివాస సర్టిఫికెట్‌ను ఇవ్వరు. ఈ నిబంధన చట్టవ్యతిరేకమని 2002లో జమ్ముకశ్మీర్‌ హైకోర్టు ప్రకటించింది. కశ్మీరేతరుడు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక కాకూడదని 1956 నవంబరు 17వ తేదీన ఆమోదించిన రాష్ట్ర రాజ్యాంగం చెబుతోంది.*

*👍ఎలా వచ్చిందంటే..*

*🌸నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత షేక్‌ అబ్దుల్లా, ప్రధాని నెహ్రూ మధ్య 1952 జులైలో కుదిరిన దిల్లీ ఒప్పందం ప్రకారం కశ్మీరీలందరికీ భారత పౌరసత్వం ఇస్తారు. రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హక్కులు, సౌకర్యాలు కల్పించడం కోసం చట్టాలు చేసే అధికారం రాష్ట్ర అసెంబ్లీకి ఉంటుంది. ఈ నిబంధనల్నే 1954 మే 14న రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్‌ 35ఏ కింద చేర్చారు. అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌ ఈ ఉత్తర్వులు ఇచ్చారు.*

*🌸ఇదీ పీవోకే...*

*👉విస్తీర్ణం: 13300 చదరపు కి.మీ.లు.*

*👉జనాభా: దాదాపు 50 లక్షలు.*

*👉రాజధాని: ముజఫరాబాద్‌.*

*👉సరిహద్దులు: పాకిస్థాన్‌లోని పంజాబ్‌, అఫ్గానిస్థాన్‌లోని వఖాన్‌, చైనాలోని జింజియాంగ్‌, భారత్‌లోని కశ్మీర్‌తో..*

*🏳పీవోకే: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌*

*🇮🇳ప్రస్తుతం పాకిస్థాన్‌ ఆక్రమణలో ఉన్న ఈ భూభాగం(పీవోకే) ఒకప్పుడు జమ్మూకశ్మీర్‌ సంస్థానంలో భాగం. 1947 అక్టోబరులో పాకిస్థాన్‌ సైన్యం అండతో పష్తూన్‌ గిరిజనులు జమ్మూకశ్మీర్‌పై దాడి చేసి పీవోకేను ఆక్రమించారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి జమ్మూకశ్మీర్‌ పాలకుడు హరిసింగ్‌ భారత సైన్యం సాయం తీసుకున్నారు. ఆ తర్వాత కశ్మీర్‌ సంస్థానాన్ని హరిసింగ్‌ భారత యూనియన్‌లో విలీనం చేశారు. అప్పట్నుంచి జమ్మూకశ్మీర్‌ మొత్తంపైనా తమకు పూర్తి హక్కు ఉందని భారతదేశం వాదిస్తోంది. దీనిని పాకిస్థాన్‌ వ్యతిరేకిస్తోంది. పీవోకే తమదేనంటూనే.. కశ్మీర్‌లోనూ పాగా వేయడానికి ప్రయత్నిస్తోంది. దాదాపు ఏడు దశాబ్దాలుగా తమ ఆక్రమణలో ఉన్న భూభాగాన్ని పాకిస్థాన్‌ ‘ఆజాద్‌ కశ్మీర్‌’ అని పిలుస్తుంది. పీవోకేలో రెండు భాగాలు. 1. ఆజాద్‌ కశ్మీర్‌ 2. గిల్గిత్‌- బాల్టిస్థాన్‌. బాల్టిస్థాన్‌లోని షక్సగమ్‌ నుంచి గిల్గిత్‌లోని రుక్సం వరకున్న భూభాగాన్ని పొరుగునున్న చైనాకు పాకిస్థాన్‌ ధారదత్తం చేసింది. దీన్ని ‘ట్రాన్స్‌ కారకోరం మార్గం’ అంటారు. కశ్మీర్‌లోని అక్సాయిచిన్‌ ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది. తాత్కాలిక రాజ్యాంగ చట్టం ప్రకారం ఆజాదీ కశ్మీర్‌(ఏజేకే) పరిపాలన కొనసాగుతోంది. దీనికి ప్రత్యేక అధ్యక్షుడు, ప్రధానమంత్రి ఉన్నప్పటికీ.. ఈ పాలనాయంత్రాంగానికి ఎలాంటి అధికారాలూ లేవు. ప్రతి చిన్న దానికీ పాకిస్థాన్‌పైనే ఆధారపడాల్సిన పరిస్థితి.*

ఆర్టికల్‌ 35ఏ ఏం చెబుతోంది?

* జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర శాశ్వత నివాసి ఎవరు? అన్నది నిర్వచిస్తుంది.
* వారి స్థిరాస్తి హక్కుల్ని నిర్ధారిస్తుంది.
* కశ్మీరేతరులు రాష్ట్రంలో స్థిరాస్తులు కలిగి ఉండటాన్ని, ప్రభుత్వోద్యోగాలు పొందడాన్ని నిషేధిస్తుంది.
కశ్మీరీలకు ప్రత్యేక హక్కులు కట్టబెట్టే రాజ్యాంగంలోని ఆర్టికల్‌-35ఏపై వివాదం ఈనాటిది కాదు. దీని రద్దును చేయాలంటూ కొందరు సుప్రీంకోర్టు తలుపు తట్టడం.. కొనసాగించాల్సిందేనంటూ మరికొందరు ఉద్యమబాట పట్టడంతో ఈ వివాదం ఇప్పుడు మరోసారి రాజుకుంది.



వ్యతిరేకుల వాదనేంటి?
* ఆర్టికల్‌ 370 కింద ఇప్పటికే ప్రత్యేక ప్రతిపత్తిని అనుభవిస్తున్న జమ్ముకశ్మీర్‌కు మళ్లీ ఆర్టికల్‌ 35ఏ రూపంలో ప్రత్యేకాధికారాలు ఇవ్వడం ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించడమే.
* ఆర్టికల్‌ 35ఏ ఎన్నడూ పార్లమెంటు ముందుకు వెళ్లలేదు. దానిని చట్టవ్యతిరేకంగా రాజ్యాంగంలో చేర్చారు.
* రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 ప్రకారం... చట్టం ముందు అందరూ సమానులే. ఆర్టికల్‌ 35ఏ పూర్తిగా పురుషులకు అనుకూలంగా ఉంది. బయటి మహిళ ఎవరైనా కశ్మీర్‌ యువకుణ్ని పెళ్లిచేసుకుంటే అతని శాశ్వత నివాస హక్కుపోదు. అదే కశ్మీర్‌ మహిళ బయటి వ్యక్తిని పెళ్లిచేసుకుంటే ఆమె నివాస హక్కు పోతుంది. ఆస్తి పోతుంది కాబట్టి.. కశ్మీరీ మహిళ బయటి వ్యక్తి ఎవరినీ పెళ్లిచేకోకుండా ఈ నిబంధన అడ్డుపడుతుంది. ఇది సమానత్వ హక్కును ఉల్లంఘించడమే.
* రాష్ట్రంలో అనేక ఏళ్లుగా నివసిస్తున్న ఎస్సీ, ఎస్టీల ప్రాథమిక హక్కుల్ని ఈ ఆర్టికల్‌ కాలరాస్తోంది. వీరు కులవృత్తులు కొనసాగించాలన్న నిబంధనతో శాశ్వాత నివాస పత్రాలు ఇచ్చారు. దీనివల్ల వారు మరే పనీ చేయడానికి అర్హత లేకుండా ఇప్పటికీ అదే వృత్తి కొనసాగిస్తున్నారు.
* యాజమాన్య హక్కు నిబంధన వల్ల బయటి పరిశ్రమలేవీ రాష్ట్రానికి రావడం లేదు. మంచి డాక్టర్లూ రావట్లేదు.

కశ్మీరీ శాశ్వత నివాసి అంటే..
* 1954 మే 14వ తేదీకన్నా ముందు/తేదీ నాటికి రాష్ట్రంలో జన్మించిన వ్యక్తి లేదా, పదేళ్లపాటు రాష్ట్రంలో నివసించిన వ్యక్తి కశ్మీర్‌ శాశ్వత నివాసి(జమ్మూకశ్మీర్‌ రాజ్యాంగం ప్రకారం..).
* ఆ వ్యక్తి రాష్ట్రంలో స్థిరాస్తుల్ని కలిగి ఉండొచ్చు.





అనుకూలురు ఏమంటున్నారు?
* జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి లేకపోతే.. ఇతర రాష్ట్రాల వారు కశ్మీర్‌ను ముంచెత్తి.. ఇక్కడ ఆస్తులు, ఓటింగ్‌ హక్కులు సంపాదించుకుంటారు.
* దీనివల్ల ముస్లిం మెజారిటీ రాష్ట్రమైన కశ్మీర్‌ భౌగోళిక స్వరూపమే మారిపోతుంది.
* కశ్మీరీలకు ఉపాధి సహా అన్ని రకాల అవకాశాలూ దెబ్బతింటాయి.
* రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం, స్కాలర్‌షిప్‌లు, ఇతరత్రా సహాయాలు పొందొచ్చు.
* రాష్ట్రంలో దీర్ఘకాల నివాసితులకు రాష్ట్ర ప్రభుత్వం సర్టిఫికెట్లను మంజూరుచేయొచ్చు.
* కశ్మీరీ మహిళ కశ్మీరేతరుణ్ని పెళ్లిచేసుకుంటే ఆమె ఈ రాష్ట్రంలో స్థిరాస్తుల్ని కలిగి ఉండటానికి వీల్లేదు. ఆమె పిల్లలకూ ఆ ఆస్తిపై హక్కు ఉండదు. పిల్లలకు శాశ్వత నివాస సర్టిఫికెట్‌ను ఇవ్వరు.
* కశ్మీరేతరుడు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక కాకూడదు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వృత్తివిద్యా కళాశాలలో చేరకూడదు.

నేపథ్యం..
భారత యూనియన్‌లో కశ్మీర్‌ విలీనం- రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్లకే పరిమితం. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత షేక్‌ అబ్దుల్లా, ప్రధాని నెహ్రూ మధ్య 1952 జులైలో కుదిరిన ‘దిల్లీ ఒప్పందం’ ప్రకారం- కశ్మీరీలందరికీ భారత పౌరసత్వం ఇస్తారు. రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హక్కులు, సౌకర్యాలు కల్పించడం కోసం, స్థిర నివాసులు ఎవరో నిర్వచించడం కోసం చట్టాలు చేసే అధికారం రాష్ట్ర అసెంబ్లీకి ఉంటుంది. 1954 మే 14వ తేదీన రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌ ఉత్తర్వు ద్వారా- ఆర్టికల్‌ 35ఏను రాజ్యాంగంలో చేర్చారు. దీనిపై పార్లమెంటులో ఎలాంటి చర్చ జరగలేదు.

ఇతర రాష్ట్రాలకూ ఉన్నాయి..
దేశంలోని చాలావరకు గిరిజన, పర్వతప్రాంత వాసులకు ప్రత్యేక చట్టాలున్నాయి. ఆర్టికల్‌ 371() కింద నాగాలాండ్‌కు, ఆర్టికల్‌ 371(జీ) కింద మిజోరం రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు కల్పిస్తున్నారు. గిరిజనుల భూములపై హక్కులకు సంబంధించి తెలుగురాష్ట్రాల్లో ఉన్న 1/70 చట్టం కూడా ఇలాంటిదే.

No comments:

Post a Comment