Saturday, April 4, 2020

భారత రాజ్యాంగ పరిషత్

🔥భారత రాజ్యాంగ పరిషత్🔥


*💐గోపాల కృష్ణ గోఖలే 1914లో మొదటగా భారతదేశానికి ఒక రాజ్యాంగం అవసరం అని అభిప్రాయపడ్డాడు. ఆ తర్వాత 1934లో కమ్యూనిస్ట్ నాయకుడైన ఎం. ఎన్. రాయ్ రాజ్యాంగ పరిషత్ యొక్క ఆవశ్యకత తెలిపారు. 1935లో భారత జాతీయ కాంగ్రెస్ కూడా దీన్ని డిమాండ్ చేసింది. 1940లో బ్రిటిష్ ప్రభుత్వం ఒక రాజ్యాంగ పరిషత్తును స్థాపించటానికి అంగీకరించింది. 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా మొట్టమొదటి సారిగా రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ పరిషత్ సభ్యులను రాష్ట్రాలు ఎన్నుకుంటాయి. మొత్తం 389 మంది సభ్యులలో 292 మంది రాష్ట్రాల నుండి, 93 మంది సంస్థానాల నలుగురు చీఫ్ కమీషనర్ ప్రావిన్సేస్ అఫ్ ఢిల్లీ, అజ్మీర్, కూర్గ్, బ్రిటిష్ బలోచిస్తాన్ నుండి ఎన్నికయ్యారు. ఆగస్ట్ లో ఎన్నికలు పూర్తి అయ్యి కాంగ్రెస్ 208 స్థానాలను, ముస్లిం లీగ్ 73 స్థానాలు గెలుచుకున్నాయి. తర్వాత కాంగ్రెస్ తో విభేదించి ముస్లిం లీగ్ తప్పుకుని పాకిస్తాన్ కు వేరే పరిషత్ ని మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకారం జూన్ ౩న స్థాపించారు. అలా విడిపోయిన తర్వాత భారత రాజ్యాంగ పరిషత్ లో 299 స్థానాలు ఉన్నాయి*

*Temporary Chairman*
సచ్చిదానంద సిన్హా, INC

*President*
బాబూ రాజేంద్ర ప్రసాద్, INC

*ముసాయిదా కమిటీచైర్మన్*
అంబేద్కర్, షడ్యుల్ కులాల సమాఖ్య

*Vice President*
హరేంద్ర కోమర్ ముఖర్జీ

*Legal Advisor*
B. Narsing Rau


No comments:

Post a Comment