*శూన్యంగా ఉండే రోదసిలో అంతరిక్ష యాత్రికులు గాలిని ఎలా పీలుస్తారు?*
వ్యోమనౌకలో
ఉండే తక్కువ ప్రదేశంలో 3
నుంచి 6
మంది
వ్యోమగాములు ఉండటంతో గాలి
పీల్చుకునే విషయంలో వారు
ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి
వస్తుంది. అందువల్ల
అక్కడ వారు క్షేమంగా,
సౌకర్యవంతంగా
ఉండటానికి వ్యోమనౌకలో ECLSS
(Environmental Control and Life Support Systems) అనే
వ్యవస్థను ముందుగానే ఏర్పాటు
చేస్తారు. వ్యోమనౌకలో
ఉన్న వారు పీల్చుకోవడానికి
కావలసిన గాలి (ఆక్సిజన్)
రెండు
మార్గాలలో లభిస్తుంది.
ఒకటి నీటి
నుంచి విద్యుత్ విశ్లేషణ
ద్వారా ఆక్సిజన్‌ను తయారు
చేయడం. నీటిలో
ఆక్సిజన్, హైడ్రోజన్
కలిసి ఉండటంతో ఈ ప్రక్రియ
ద్వారా విడుదలయిన ఆక్సిజన్‌ను
శ్వాసించడానికి ఉపయోగించి,
హైడ్రోజనను
రోదసిలోకి వదిలేస్తారు.
మరో మార్గం
వ్యోమనౌక వెలుపలి భాగంలో
అమర్చిన టాంక్ లో పీడనంతో
ఉన్న ఆక్సిజన్ నుంచి కావలసిన
మేరకు ఆక్సిజన్ ను తీసుకోవడం.
వ్యోమనౌక
నుంచి వెలుపలికి వచ్చి రోదసిలో
ప్రయోగాలు చేసే వారికి
ప్రత్యేకమైన 'స్పేస్
సూట్లు' ఉంటాయి.
వాటిలో
వారు శ్వాసించడానికి కావలసిన
ఆక్సిజన్‌ను విడుదల చేసే
ఏర్పాట్లు ఉంటాయి. అందులో
ఉండే 'పెర్క్లోరేట్
కాండిల్స్' అనే
పరికరంలో ఉండే లోహాలు రసాయనిక
చర్యల ద్వారా ఆక్సిజన్‌ను
విడుదల చేస్తాయి.🙋♂
No comments:
Post a Comment