🔥 *మహిళా
చట్టాలు - శిక్షలు*
🔥
మహిళలు
ఇంటా బయట ఎదుర్కొనే సమస్యల్లో
లైంగిక వేధింపులు ప్రధానమైనవి.
మానసికంగా,
శారీరకంగా
నిత్యం అనేక రూపాల్లో సగటు
మహిళ లైంగిక వేధింపులకు
గురవుతూనే ఉంది. అయితే
మహిళల కోసం అనేక చట్టాలున్నాయనే
సంగతి చాలామందికి తెలియదు.
స్త్రీల
రక్షణకు చేయబడిన అలాంటి
చట్టాలు, శిక్షల
గురించి అందరికీ తెలియాలి.
భారతీయ
శిక్షాస్మృతి (INDIAN PENAL
CODE-1860) లో
లైంగిక నేరాలకు సంబంధించి
ప్రత్యేక సెక్షన్లు ఉన్నాయి.
అవేంటో
తెలుసుకుందాం!
ఇవి
గాకుండా మహిళలపై లైంగిక
వేధింపులు, కిడ్నాప్‌లు,
వ్యభిచారానికి
బలవంత పెట్టడంలాంటి వాటికి
వేరే శిక్షలున్నాయి.
శిక్షలు
కఠినంగా ఉంటే ఇతరులు అలాంటి
నేరాలుచెయ్యరని
చట్టనిర్మాతల భావన. కానీ
వాస్తవం అందుకు విరుద్ధం.
నేరం
చేసేవాళ్ళు వీటిని గుర్తుంచకపోవడం
వల్ల నేరాలు జరుగుతూనే ఉన్నాయి.
లైంగిక
నేరాలురాజ్యాంగం
14 వ
అధికరణం సమాన హక్కులకు
సంబంధించింది. స్త్రీ,
పురుషులకు
సమాన హక్కులను ఇది ప్రతిపాదిస్తోంది.
చరిత్రలో
మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్
రాష్ట్రం మహిళలకు సమానహక్కులు
చట్టరూపంగా కల్పించిన తర్వాత,
మరికొన్ని
రాష్ట్రాలు కూడా చట్టాలు
చేశాయి. ఎట్టకేలకు
రాజ్యాంగ అధికరణం 14
ప్రాతిపదికగా
కేంద్రం కూడా మహిళలకు ఆస్థి
హక్కు కల్పించింది.
పూర్వం
మాదిరిగా మహిళలు కేవలం వంటింటికే
పరిమితం కావటం లేదు.
అన్ని
రంగాలలో మగవారితో పోటీపడుతున్నారు.
విద్యారంగంలో
మగవారిమీద ఆధిక్యత చాటుతున్నారు.
చివరకు
రక్షణదళాల్లో సైనికులుగా,
యుద్ధవిమాన
పైలట్లుగా కూడా బాధ్యతలు
నిర్వహించగల స్థాయికి ఎదిగారు.
సైన్సు,
క్రీడలు,
శాస్త్రజ్ఞులు,
వైద్య
రంగాలలో మహిళలు ప్రశంసనీయమైన
పాత్ర పోషిస్తున్నారు.కానీ,
లైంగిక
వేధింపులు, అత్యాచారాలు,
గృహహింస
వంటి సాంఘిక దుర్మార్గాలకు
బలిపశువులవుతున్నారు.
ఈ సమస్య
దాదాపు అన్ని రంగాలలోనూ తిష్ట
వేసుకుని ఉంది. ఉద్యోగినులు
లైంగిక వేధింపులకు గురైతే,
వారికి
రక్షణ ఎలా కల్పించాలి.
నేరస్థుల
మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి
అనే అంశాల మీద 'విశాఖ'
మార్గదర్శకాలు
ఉన్నాయి. ఆ
వివరాలు చూద్దాం.
విశాఖ
మార్గదర్శకాలు (vishaka
guidelines):
సుప్రీంకోర్టు
vishaka,others vs state of rajasthan (JT1997(7) sec
384) కేసులో,
1993 నాటి
మానవహక్కుల చట్టంలోని సెక్షను
2(d)లో
ఇవ్వబడిన నిర్వచనం ఆధారంగా
మార్గదర్శకాలు ఇవ్వటం జరిగింది.
ప్రస్తుతం
ఉన్న సివిల్, క్రిమినల్
చట్టాలు, కార్యాలయాల్లో
పనిచేస్తున్న మహిళలకు ప్రత్యేక
రక్షణను కల్పించలేకపోతున్నాయి.
కొత్త
చట్టంలో చేయటానికి సమయం
పడుతుంది గనుక ఈ మార్గదర్శకాలు
ఇవ్వబడ్డాయి. కార్యాలయాల్లో
మహిళలకు లైంగిక వేధింపుల
నుండీ రక్షణ కల్పించవలసిన
పూర్తి బాధ్యత సంస్థ అవజమాన్యానిదే
అందుకు అవసరమైన చర్యలూ
తీసుకోవాలి.
చట్టం
దృష్టిలో అసలు లైంగిక వేధింపులు
అంటే ఏమిటి? వచ్చేవారం
తెలుసుకుందాం.
సెక్షన్
- నేరం
- శిక్షలు375 -
అత్యాచారం
సెక్షన్ - కనీసం-7
సంవత్సరాలు376 -
అత్యాచారానికి
శిక్ష - గరిష్టం-
పది సంవత్సరాలు
లేక జీవత ఖైదు జరిమాన376 -
స్వంత భార్య
12 సంవత్సరాలలోపు
అయితే, మానభంగానికిసామూహిక
అత్యాచారం కేసులో గరిష్టం-2
సంవత్సరాలు
జరిమాననోట్:
కస్టడీలో
ఉన్న మహిళపై పోలీసు అధికారికి
జైలు అధికారి, మరే
ప్రభుత్వ అధికారిఆస్పత్రి
అధికారి, గ్యాంగ్
రేప్, గర్భిణీ
మీద అత్యాచారం - 5 సంవత్సరాల
జైలు జరిమానా376-A-
కోర్టు
ఉత్తర్వు ద్వారా విడిగా ఉన్న
భార్యతో లైంగిక సంబంధానికి
-2 సంవత్సరాలు
జైలు, జరిమానా376-b
376-c -
ప్రభుత్వ
అధికారులు పదవీ దుర్వినియోగంతో
అత్యాచారం చేస్తే - 5
సంవత్సరాల
జైలు, జరిమానా377 -
అసహజ లైంగిక
చర్యలు -10 సంవత్సరాలు
జైలు, జరిమానాఇవి
ప్రధానమైన అత్యాచార నేరాలు*.
No comments:
Post a Comment